International
oi-Jakki Mahesh
సాంకేతిక
ప్రపంచంలో
తన
ఆధిపత్యాన్ని
చాటుకునేందుకు
చైనా
శరవేగంగా
అడుగులు
వేస్తోంది.
ఇప్పటికే
5జీలో
అగ్రగామిగా
ఉన్న
ఆ
దేశం
ఇప్పుడు
6జీ
నెట్‌వర్క్
లాంచ్
దిశగా
ప్రపంచ
దేశాల
కంటే
ఒక
అడుగు
ముందే
ఉంది.
తాజాగా
6జీ
టెక్నాలజీ
ట్రయల్స్‌లో
చైనా
మొదటి
దశను
విజయవంతంగా
పూర్తి
చేయడమే
కాకుండా..
రెండో
దశను
కూడా
ప్రారంభించింది.
300
కీలక
సాంకేతికతలు
సిద్ధం
చైనా
పరిశ్రమ,
సమాచార
సాంకేతిక
మంత్రిత్వ
శాఖ
వెల్లడించిన
వివరాల
ప్రకారం..
6జీ
తొలి
దశ
ట్రయల్స్‌లో
300
కంటే
ఎక్కువ
కీలకమైన
సాంకేతికతలను
భద్రపరిచారు.
ఈ
విజయంతో
దేశంలోని
సమాచార,
కమ్యూనికేషన్
రంగం
మరింత
బలోపేతం
కానుంది.
ప్రస్తుతం
చైనా
నిర్మించిన
ఇన్ఫర్మేషన్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ప్రపంచంలోనే
అతిపెద్దది,
అత్యంత
ఆధునికమైనది.
5G
బేస్
స్టేషన్లు
4.838
మిలియన్లు(48
లక్షలకు
పైగా)
ఉన్నాయి.
5G
వినియోగదారులు
1.2
బిలియన్లు
(120
కోట్లు)
దాటారు.
5Gకి
సంబంధించిన
ప్రపంచస్థాయి
పేటెంట్లలో
42
శాతం
వాటా
చైనాదే
కావడం
గమనార్హం.
రెండో
దశపై
దృష్టి
మొదటి
దశ
విజయవంతం
కావడంతో
రెండో
దశ
సాంకేతిక
పరీక్షలను
చైనా
ప్రభుత్వం
ప్రారంభించింది.
కేవలం
నెట్‌వర్క్
వేగం
మాత్రమే
కాకుండా,
అప్లికేషన్
ఆధారిత
‘ఇండస్ట్రీ
ఎకోసిస్టమ్’ను
నిర్మించడంపై
మంత్రిత్వ
శాఖ
దృష్టి
సారించింది.
అంటే
పరిశ్రమల్లో
6G
వినియోగాన్ని
సులభతరం
చేసేలా
పరిశోధనలను
వేగవంతం
చేయనున్నారు.
అమెరికా,
భారత్
పరిస్థితి
ఏంటి?
చైనా
దూకుడు
చూస్తుంటే
అమెరికా,
భారత్
వంటి
దేశాల
కంటే
ముందే
6జీని
అందుబాటులోకి
తెచ్చేలా
కనిపిస్తోంది.
భారత్,
అమెరికా
దేశాల్లో
కూడా
6జీపై
ముమ్మరంగా
పరిశోధనలు
జరుగుతున్నాయి.
సాధారణంగా
6G
నెట్‌వర్క్
2030
నాటికి
వినియోగదారులకు
అందుబాటులోకి
వస్తుందని
నిపుణులు
భావిస్తున్నారు.
కానీ
చైనా
ప్రయత్నాలు
చూస్తుంటే
అంతకంటే
ముందే
ఆ
దేశం
6Gని
ప్రపంచానికి
పరిచయం
చేసే
అవకాశం
ఉంది.
డేటా
వేగంలో
విప్లవం
రాబోతోంది.
6G
అందుబాటులోకి
వస్తే
ఇంటర్నెట్
వేగం
ఊహించని
రీతిలో
ఉంటుంది.
ఈ
సాంకేతిక
యుద్ధంలో
అగ్రరాజ్యం
అమెరికాను
చైనా
నిజంగానే
వెనక్కి
నెడుతుందా
అనేది
వేచి
చూడాలి.


