Entertainment
oi-Korivi Jayakumar
‘ప్రేమ
ఇష్క్
కాదల్’,
‘వైశాఖం’
వంటి
చిత్రాలతో
ప్రేక్షకులకు
పరిచయమైన
హరీష్
ధనుంజయ్
హీరోగా,
దర్శకుడు
చైతన్య
వర్మ
నడింపల్లి
(RX100
పాటల
రచయిత)
రూపొందించిన
తాజా
ప్రేమ
కావ్యం
“మరువ
తరమా”.
అవంతిక,
అతుల్య
చంద్ర
కథానాయికలుగా
నటించిన
ఈ
చిత్రం,
యూత్‌లో
మంచి
బజ్
క్రియేట్
చేసి
ప్రీమియర్స్‌తో
విడుదలైంది.
మరి
ఈ
ట్రయాంగిల్
లవ్
స్టోరీ
ప్రేక్షకుడి
గుండెను
ఎంతవరకు
హత్తుకుంది?
చూద్దాం.
కథ:
రిషి
(హరీష్
ధనుంజయ్),
సింధు
(అవంతిక),
అన్వీ
(అతుల్య
చంద్ర)
ఒకే
ఆఫీస్‌లో
పనిచేసే
యువతీ
యువకులు.
రిషి,
సింధును
తొలిచూపులోనే
అమితంగా
ప్రేమిస్తాడు.
అయితే,
అదే
సమయంలో
అన్వీ
కూడా
రిషిని
ఎంతగానో
ఆరాధిస్తుంది.
కానీ
రిషి
మనసు
సింధు
దగ్గర
ఉందని
తెలిసి
తన
ప్రేమను
మనసులోనే
దాచుకుంటుంది.
సింధు
ప్రేమలో
మునిగి
తేలుతున్న
రిషికి
ఊహించని
పరిస్థితులు
ఎదురై,
ఆమె
నుంచి
ఎందుకు
విడిపోవలసి
వచ్చింది?
ఆ
తర్వాత
మళ్లీ
సింధు
ఎందుకు
తిరిగి
వచ్చింది?
అన్వీ
తన
ప్రేమ
విషయాన్ని
రిషితో
చెప్పగలిగిందా?
రిషి
తల్లి
(రోహిణి)
చెప్పిన
జీవిత
సత్యం
ఏమిటి?
ఈ
భావోద్వేగ
ప్రేమకథ
ఎలాంటి
మలుపులు
తిరిగి
ముగిసింది
అనేది
వెండితెరపై
ఆసక్తికరంగా
చూడదగిన
అంశం.
విశ్లేషణ:
ట్రయాంగిల్
లవ్
స్టోరీస్
ఎప్పుడూ
యూత్
ఆడియన్స్‌కి
ఫేవరెట్
జోనర్.
ఈ
కథనాన్ని
పాత
ఫార్ములాకి
కట్టుబడి
ఉండకుండా,
సహజత్వంతో,
రియలిస్టిక్
టచ్‌తో
నడిపించడంలో
దర్శకుడు
చైతన్య
వర్మ
విజయం
సాధించారు.
ఫస్టాఫ్:
కథాపరంగా
పెద్దగా
మలుపులు
లేకపోయినా,
ప్రతి
సన్నివేశంలో
పంచులతో
కూడిన
సంభాషణలు,
సహజమైన
కామెడీతో
కథనాన్ని
బోర్
కొట్టకుండా
నడిపించారు.
రిషి,
అతని
స్నేహితుల
మధ్య
వచ్చే
సన్నివేశాలు,
ఆఫీస్
వాతావరణం
యూత్‌ని
బాగా
కనెక్ట్
చేస్తాయి.
పాటలు
కథకు
తగ్గట్టుగా
వచ్చి,
వినసొంపుగా
అనిపించాయి.
సెకండాఫ్:
అసలు
కథ,
భావోద్వేగాలు
ఈ
భాగంలోనే
ఉన్నాయి.
దర్శకుడు
ఇక్కడ
పూర్తిగా
కథనంపై
దృష్టి
పెట్టారు.
పాత్రల
మధ్య
సంఘర్షణ,
విడిపోవడం,
తిరిగి
కలవడం
వంటి
అంశాలు
ప్రేక్షకులను
ఎమోషనల్‌గా
కనెక్ట్
చేస్తాయి.
తెరపై
పాత్రలు
తమ
బాధను
వ్యక్తం
చేస్తుంటే,
ఇది
మన
స్నేహితుడి
జీవితంలో
జరిగినట్లే
ఉందే
అని
అనిపించడం
ఈ
సినిమా
బలమైన
పాయింట్.
ఇది
ప్రేక్షకుడిని
కథలో
లీనం
చేస్తుంది.
పరిచయం
ఉన్న
కథనే
తీసుకుని,
దానికి
అర్థవంతమైన
ముగింపుని,
యదార్థ
సంఘటనల
ఆధారంగా
ముడిపెట్టి
తీయడంలో
దర్శకుడు
సఫలమయ్యాడు.
నటీనటుల
ప్రతిభ
హరీష్
ధనుంజయ్:
రిషి
పాత్రకు
హరీష్
చక్కగా
సరిపోయాడు.
చూడడానికి
బాగున్న
హరీష్,
నటనలో
ఈజ్
చూపించాడు.
కొన్ని
సన్నివేశాల్లో
డైలాగ్
డెలివరీ,
హావభావాలు
బాగున్నాయి.
ఎమోషన్
సీన్స్
లో
ఇంకాస్త
పరిణితి
అవసరం.
సరైన
కథలు
ఎంచుకుంటే
హీరోగా
మంచి
గుర్తింపు
తెచ్చుకునే
అవకాశం
ఉంది.
సింధు
పాత్రలో
అవంతిక
చాలా
బాగా
నటించింది.
భావోద్వేగ
సన్నివేశాలను
చక్కగా
పండించింది.అతుల్య
చంద్ర
అన్వీ
పాత్ర
పరిధి
మేరకు
నటించి,
తన
ప్రేమను
వ్యక్తపరిచే
సందర్భంలో
మెప్పించింది.
రోహిణికి
ఇలాంటి
పాత్రలు
కొట్టిన
పిండి.
ఆమె
చెప్పే
డైలాగ్స్
సినిమాకే
హైలైట్‌గా
నిలిచాయి.
ఇక,
దినేష్
పాత్ర
చేసిన
నటుడు
హిలేరియస్‌గా
నవ్వించాడు.
సాంకేతిక
బలం
ఈ
సినిమాకు
ప్రధాన
బలం
సంగీతం.
విజయ్
బుల్గానిన్,
హరీష్
అందించిన
పాటలు,
నేపథ్య
సంగీతం
(BGM)
అద్భుతంగా
ఉన్నాయి.
ముఖ్యంగా
బీజీఎం
భావోద్వేగ
సన్నివేశాలను
మరింత
ఎలివేట్
చేసింది.
డైలాగ్స్
చాలా
రిలేటబుల్‌గా,
సహజంగా
ఉండటం
దర్శకుడి
సామర్థ్యాన్ని
తెలియజేస్తుంది.
సినిమాటోగ్రఫీ
పర్వాలేదు.
నిర్మాణ
విలువలు
కథకు
తగినట్లుగా
ఉన్నాయి.
తుది
తీర్పు
మరువ
తరమా
అనేది
మనకు
తెలిసిన
కథనే
ఎమోషన్స్,
రియలిస్టిక్
డైలాగ్స్,
మంచి
సంగీతంతో
అర్థవంతంగా
చెప్పిన
చిత్రం.
ప్రేమ
కథలు,
ఫీల్
గుడ్
సినిమాలను
ఇష్టపడేవారు
ఈ
సినిమాను
తప్పక
చూడవచ్చు.
రేటింగ్:
2.75\5


