Business
oi-Kannaiah
భారత
విమానయాన
రంగం
మునుపెన్నడూ
లేని
విధంగా
దూసుకుపోతోంది.
పెరుగుతున్న
ప్రయాణికుల
రద్దీకి
అనుగుణంగా
కేవలం
విదేశీ
విమానాలపై
ఆధారపడకుండా,
స్వదేశీ
గడ్డపైనే
విమాన
తయారీని
ప్రారంభించడం
ద్వారా
భారత్
సరికొత్త
చరిత్రకు
నాంది
పలికింది.
భారత
విమానయాన
రంగం
‘సేవల’
స్థాయి
నుంచి
‘తయారీ’
స్థాయికి
ఎదుగుతోంది.
ప్రయాణికుల
డిమాండ్
విపరీతంగా
పెరుగుతున్న
నేపథ్యంలో,కేంద్ర
ప్రభుత్వం’మేక్
ఇన్
ఇండియా’లో
భాగంగా
స్వదేశీ
విమాన
తయారీని
వేగవంతం
చేసింది.ఇందులో
భాగంగా
అదానీ
గ్రూప్,బ్రెజిల్‌కు
చెందిన
దిగ్గజ
సంస్థ
ఎంబ్రాయర్
(Embraer)తో
జత
కట్టి
భారత్‌లోనే
కమర్షియల్
విమానాలను
తయారు
చేసేందుకు
సిద్ధమైంది.
అదానీ-ఎంబ్రాయర్
ఒప్పందం:
ఒక
మైలురాయి
భారత
విమానయాన
చరిత్రలో
అదనీ
ఎంబ్రాయర్
ఒప్పందం
ఒక
సంచలన
మార్పుకు
నాంది
పలికిందని
చెప్పొచ్చు.ఇప్పటివరకు
మనం
ఎయిర్‌బస్
లేదా
బోయింగ్
వంటి
విదేశీ
విమానాలను
దిగుమతి
చేసుకునేవాళ్లం.
కానీ
ఇప్పుడు
అదానీ
గ్రూప్
సహకారంతో
ఎంబ్రాయర్
సంస్థకు
చెందిన
రీజినల్
జెట్స్
(70
నుంచి
146
సీట్ల
సామర్థ్యం
కలిగినవి)
భారత
గడ్డపై
తయారవనున్నాయి.ఈ
విమానాలు
తక్కువ,మధ్యస్థ
దూర
ప్రయాణాలకు
అత్యంత
అనుకూలమైనవి.దీనివల్ల
దేశంలోని
టైర్-2,
టైర్-3
నగరాల
మధ్య
విమాన
అనుసంధానం
మరింత
బలపడనుంది.ఈ
ప్రాజెక్టుకు
సంబంధించిన
అధికారిక
ప్రకటన
ఈ
నెల
చివర్లో
జరిగే
హైదరాబాద్
ఎయిర్
షోలో
వెలువడే
అవకాశం
ఉంది.
ఏటా
100
విమానాల
చేరిక!
కేంద్ర
పౌర
విమానయాన
శాఖ
మంత్రి
కింజరాపు
రామ్మోహన్
నాయుడు
వెల్లడించిన
వివరాల
ప్రకారం,
భారత
విమానయాన
సంస్థలు
రాబోయే
15
ఏళ్ల
పాటు
ప్రతి
ఏటా
సగటున
100
విమానాలను
తమ
విమానశ్రేణిలో
చేర్చుకోనున్నాయి.
అంటే
2040
నాటికి
భారత్
వద్ద
2,000
పైగా
విమానాలు
అందుబాటులో
ఉంటాయి.
ఎయిర్
ఇండియా,
ఇండిగో,
ఆకాశ
ఎయిర్
వంటి
సంస్థలు
ఇప్పటికే
భారీ
ఆర్డర్లను
ఇచ్చాయి.
కొత్త
ఎయిర్‌లైన్స్‌తో
పెరగనున్న
పోటీ
విమానయాన
రంగంలో
పోటీని
పెంచేందుకు
ప్రభుత్వం
ఇటీవల
మూడు
కొత్త
డొమెస్టిక్
ఎయిర్‌లైన్స్‌కు
(షాంక్
ఎయిర్,
అల్
హింద్
ఎయిర్,ఫ్లై
ఎక్స్
ప్రెస్)
గ్రీన్
సిగ్నల్
ఇచ్చింది.
మరోవైపు
రీజినల్
ఎయిర్‌లైన్
FLY91
తన
విమానశ్రేణిని
విస్తరిస్తూ
విజయవాడ,
రాజమండ్రి
వంటి
నగరాలకు
సేవలను
పెంచేందుకు
సిద్ధమైంది.
హై-వాల్యూ
విమాన
విడిభాగాల
తయారీ
కేవలం
అసెంబ్లీ
మాత్రమే
కాకుండా,
విమాన
విడిభాగాల
తయారీలోనూ
భారత్
వేగం
పెంచింది.
సింగ్యులారిటీ
AMC
సంస్థ
లోహియా
ఏరోస్పేస్
సిస్టమ్స్‌లో
భారీ
పెట్టుబడులు
పెట్టడం
ద్వారా
గ్లోబల్
సప్లై
చైన్‌లో
భారత్
తన
స్థానాన్ని
పదిలం
చేసుకుంటోంది.
విమానాల
దిగుమతులను
తగ్గించి,
స్వదేశీ
తయారీని
ప్రోత్సహించడం
ద్వారా
భారత్
ప్రపంచ
విమానయాన
మార్కెట్‌లో
మూడవ
అతిపెద్ద
శక్తిగా
ఎదగడమే
కాకుండా,
లక్షలాది
మందికి
ఉపాధి
కల్పించబోతోంది.
ఆకాశంలో
విమానాల
రొద
పెరగడమే
కాదు,
భారత
ఆర్థిక
వ్యవస్థ
కూడా
రెక్కలు
కట్టుకుని
ఎగురబోతోందని
ఈ
పరిణామాలు
స్పష్టం
చేస్తున్నాయి.


