Andhra Pradesh
oi-Sai Chaitanya
రాజధాని
కోసం
భూములు
ఇచ్చిన
రైతులకు
కీలక
హామీ
దక్కింది.
రుణాల
విషయంలో
వెసులు
బాటు
కలిగింది.
అమరావతి
ప్రాంతంలో
రైతుల
సమస్యలను
పూర్తి
స్థాయిలో
పరిష్కరిస్తామని
ప్రభుత్వం
హామీ
ఇచ్చింది.
అదే
విధంగా
కొత్తగా
పెన్షన్ల
మంజూరు..
హెల్త్
కార్డుల
పైన
స్పష్టత
లభించింది.
భూ
వివాదాలకు
సంబంధించి
త్వరలోనే
పరిష్కారం
చూపిస్తామని
రైతులకు
ప్రభుత్వం
నియమించిన
త్రిసభ్య
కమిటీ
హామీ
ఇచ్చింది.
రాజధాని
ప్రాంతంలో
జరుగుతున్న
అభివృద్ధి
పనులపై
త్రీ
మెన్
కమిటీ
ఈరోజు
(శనివారం)
సమీక్ష
నిర్వహించింది.
కేంద్ర
మంత్రి
పెమ్మసాని
కీలక
అంశాలను
వెల్లడించారు.
రాజధాని
కోసం
భూములు
ఇచ్చిన
రైతులకు
30
ఏళ్ల
పాటు
లింకు
డాక్యుమెంట్
లేకుండానే
రుణాలు
ఇచ్చేందుకు
బ్యాంకులు
అంగీకరించాయని
వెల్లడించారు.
రిటర్నబుల్
ప్లాట్లకు
సంబంధించి
సీఆర్డీఏ
ఇచ్చే
డాక్యుమెంట్
ఆధారంగానే
రుణాలు
ఇచ్చేందుకు
సమ్మతించాయని
ప్రకటించారు.
కాగా,
జరీబు
భూ
సమస్యలపై
సర్వే
పూర్తయిందన్నారు.
జరీబు
భూములపై
జెన్యూన్‌గా
ఎవరికి
ఇవ్వాలి
అనేదానిపై
కమిటీ
రిపోర్ట్
తర్వాత
నిర్ణయం
తీసుకోవడం
జరుగుతుందని
చెప్పారు.
పది
సెంట్లు
కంటే
తక్కువ
ప్లాట్లు
ఉన్నవాళ్లు
415
మంది
ఉన్నారని…
వారి
సమస్యలు
కూడా
పరిష్కరిస్తున్నామన్నారు.
2013
కంటే
ముందు
భూములు
ఇచ్చిన
రైతులు
కూడా
తమను
ల్యాండ్
పూలింగ్
కింద
పరిగణించమని
అడుగుతున్నారని…
కానీ
అవి
చట్టపరంగా
సాధ్యం
కావడం
లేదని
వివరించారు.
కాగా..వీధి
పోటు
భూములకు
సంబంధించి
సుమారు
150
ఉన్నాయని..
వీధి
పోటుకు
సంబంధించి
మరో
రెండు
అంశాలు
రైతుల
కోరుతున్నారని.
ఆ
అంశాలను
తర్వాత
పరిగణిస్తామని
స్పష్టం
చేశారు.
త్రీ
మెన్
కమిటీ
నిర్ణయం
ప్రకారం
తిరిగి
లంక
భూముల
విషయంలో
356కు
గాను
79
మంది
మాత్రమే
రిజిస్ట్రేషన్
చేయించుకున్నారని
చెప్పారు.
మిగిలిన
వారిని
కూడా
రిజిస్ట్రేషన్
చేయించుకోమని
కోరారు.
గన్నవరం
ఎయిర్పోర్ట్
సమస్యలపై
కూడా
ఈ
రివ్యూలో
చర్చించినట్లు
తెలిపారు.
లార్జ్
రిటర్నబుల్
ప్లాట్స్
విషయంలో
కొన్ని
ఇబ్బందులు
ఉన్నాయని..
పరిష్కారం
దిశగా
వర్క్
చేస్తున్నామన్నారు.
ఎవరెవరికి
పెన్షన్లు
మిస్
అయ్యాయో
వాటి
వివరాలు
సేకరిస్తున్నా
మని
చెప్పారు.
అలాగే
కొత్తగా
పెళ్లయిన
వారికి
కూడా
పెన్షన్లు
అందజేయాలని
చూస్తున్నామని
చెప్పారు.
భూమి
ఇచ్చిన
వారికి
బిలో
పావర్టీ
లైన్
తో
సంబంధం
లేకుండా
అందరికీ
హెల్త్
కార్డు
ఇవ్వడం
జరుగుతుందన్నారు.


