అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిలో అరుదైన నిర్మాణాల ప్రతి పాదనలకు ఆమోదం లభించింది. తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి దిశగా తాజా గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో రాజధానికి పెట్టుబడుల విషయంలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సీఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…’రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయని వివరించారు.

అమరావతిలో పెట్టుబడుల పై కీలక సూచనలు

కాగా, పర్యాటకంతో పాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలని… హోటళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలని అధికారు లకు నిర్దేశించారు. నీరుకొండలో చేపట్టే బోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. భవిష్యత్తులో క్రీడా రంగం అతి పెద్ద ఆదాయ వనరు కాబోతోందని… దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతి పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించామని చెప్పారు. అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలని స్పష్టం చేసారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని… ఇలాంటి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని నిర్దేశించారు. బ్రాండ్ మరింతగా పెరగాలని… అందుకే పెట్టుబడులు పెట్టే వారిని రెగ్యులరుగా ఫాలో అప్ చేస్తూనే ఉండాలని సూచించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

What Happened to Susan Lorincz, Ajike Owens

Where Is Susan Lorincz Now?Lorincz pleaded not guilty at...

What stock buybacks mean for investors

Greg Abel, the new CEO of Berkshire Hathaway, announced...