Andhra Pradesh
oi-Sai Chaitanya
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ఢిల్లీ
వెళ్లనున్నారు.
రేపు
(బుధవారం)
సీఎం
ఢిల్లీ
పర్యటన
ఖరారు
అయింది.
కేంద్ర
హోం
మంత్రి
అమిత్
షా
తో
చంద్రబాబు
భేటీ
కానున్నారు.
ఈ
నెల
31వ
తేదీ
నుంచి
పార్లమెంట్
బడ్జెట్
సమావేశాలు
ప్రారంభం
కానున్నాయి.
ఫిబ్రవరి
1న
అదివారం
2026-27
వార్షిక
బడ్జెట్
ను
ప్రవేశ
పెట్టనున్నారు.
ఇదే
సమయంలో
కీలక
బిల్లులను
సభలో
ప్రవేశ
పెట్టేందుకు
కేంద్రం
సిద్దమైంది.
ఈ
క్రమంలో
అమిత్
షా
తో
చంద్రబాబు
భేటీలో
అమరావతికి
చట్టబద్దత
పైన
తుది
నిర్ణయం
జరిగే
అవకాశం
ఉంది.
సీఎం
చంద్రబాబు
ఢిల్లీ
వెళ్లనున్నారు.
కేంద్ర
హోం
మంత్రి
అమిత్
షా
తో
భేటీ
కానున్నట్లు
తెలుస్తోంది.
బడ్జెట్
సమావేశాల
ప్రారంభం
వేళ..
2026-27
బడ్జెట్
పైన
కేంద్రం
కసరత్తు
చేస్తోంది.
ఈ
సమయంలో
ఏపీకి
కేంద్రం
నుంచి
మద్దతు
కోరుతూ
ఇప్పటికే
చంద్రబాబు
గత
ఢిల్లీ
పర్యటనలో
కేంద్ర
మంత్రులకు
వినతులు
ఇచ్చారు.
ఈ
భేటీలో
ఆర్దిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
తోనూ
సమావేశం
అయ్యారు.
ఏపీకి
కేంద్రం
అమలు
చేస్తున్న
ప్రాయోజిత
పథకాల్లో
ప్రాధాన్యత
పెరిగేలా
చంద్రబాబు
ప్రయత్నాలు
చేస్తున్నారు.
అదే
విధంగా
హౌసింగ్
తో
పాటుగా
రహదారులు,
రైల్
కనెక్టివిటీ
గురించి
ఈ
సమావేశంలో
కొత్త
ప్రతిపాదనలు
అందించే
అవకాశం
కనిపిస్తోంది.
ఇక,
కీలక
మైన
అమరావతికి
చట్టబద్దత
పైనా
చర్చించనున్నట్లు
సమాచారం.
ఇప్పటికే
2024
నుంచి
అమరావతి
ఏపీ
రాజధానిగా
కేంద్రం
చట్టబద్దత
కల్పిస్తూ
పార్లమెంట్
లో
చట్టం
చేసేందుకు
వీలుగా
ఏపీ
ప్రభుత్వం
కేంద్ర
హోం
శాఖకు
లేఖ
రాసింది.
2014-2024
వరకు
హైదరాబాద్
ఉమ్మడి
రాజధానిగా
ఉంది.
దీంతో..
2024
జూన్
2
నుంచి
అమరావతి
ఏపీ
శాశ్వత
రాజధానిగా
గుర్తిస్తూ
ఈ
పార్లమెంట్
లో
బిల్లు
ప్రతిపాదించేందుకు
కసరత్తు
జరుగుతోంది.
ఈ
అంశం
పైన
ప్రధానంగా
చర్చించి..
తుది
నిర్ణయం
తీసుకునే
అవకాశం
కనిపిస్తోంది.
అదే
విధంగా
కేంద్రం
ఈ
సమావేశాల్లో
కీలక
బిల్లులు
ప్రతిపాదించనుంది.
జమిలి
ఎన్నికల
పైన
బిల్లు
తీసుకొచ్చే
ఆలోచన
చేస్తోంది.
దీంతో..
మిత్రపక్షాలతోనూ
ఈ
అంశాల
పైన
బీజేపీ
నాయకత్వం
చర్చిస్తోంది.
దీంతో..
ఈ
సారి
ఢిల్లీ
పర్యటనలో
చంద్రబాబు
సమావేశాలు..
నిర్ణయాలు
కీలకంగా
మారనున్నాయి.


