అమిత్ షా తో చంద్రబాబు భేటీ, కీలక నిర్ణయం..!?

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది. అటు పార్లమెంట్ సమావేశాలు.. ఇటు ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఈ టూర్ ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో కొద్ది రోజులు గా రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ వివాదం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానుండటం మరింత ఉత్కంఠ పెంచుతోంది. పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారు. కీలక నిర్ణయం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు (మంగళవారం) ఐదుగురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపు పై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. కాగా.. ఏపీకి సంబంధించిన పలు పాలనా పరమైన అంశాలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు.

తాజా పరిణామాల పైన చర్చ

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ముగిసే లోగా కేంద్రంలోని కొన్ని శాఖల నుంచి దక్కించుకునే నిధుల పైన చంద్రబాబు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో వీటికి సంబంధించిన ప్రతిపాదనలతో కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ వివాదాలతో పాటుగా లడ్డూ వ్యవహారంలో సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్.. తాజా పరిణామాల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైనా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. ఏపీకి మరో మంత్రి పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది.

దీంతో.. మంత్రివర్గ విస్తరణలో ఏపీలోని కూటమి పార్టీల నుంచి ఎవరికి ఇవ్వాలనే అంశం పైన చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కేంద్రంలో నామినేటెడ్ పదవుల్లో ఏపీ మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. దీంతో… వీటి పైన ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related