International
oi-Jakki Mahesh
వెనిజులా
రాజధాని
కరాకస్‌పై
అమెరికా
జరిపిన
ఆకస్మిక
వైమానిక
దాడులు
ప్రపంచాన్న
మూడో
ప్రపంచ
యుద్ధం
ముంగిట
నిలబెట్టాయి.
జనవరి
3,
2026న
జరిగిన
ఈ
పరిణామం
రష్యా,
చైనా
వంటి
అగ్రరాజ్యాలను
తీవ్రంగా
ఆగ్రహానికి
గురిచేసింది.
లాటిన్
అమెరికాలో
మొదలైన
ఈ
చిచ్చు
ప్రపంచ
శాంతికి
సవాలుగా
మారింది.
కరాకస్‌పై
అమెరికా
దాడి..
ఎమర్జెన్సీ
విధింపు
జనవరి
3
శనివారం
తెల్లవారుజామున
కరాకస్‌లోని
సైనిక
స్థావరాలపై
అమెరికా
వైమానిక
దాడులకు
దిగింది.
ఈ
దాడుల
తర్వాత
వెనిజులా
అధ్యక్షుడు
నికోలస్
మదురో
దేశవ్యాప్తంగా
అత్యవసర
పరిస్థితి
ప్రకటించారు.
ఇది
అమెరికా
చేస్తున్న
“సామ్రాజ్యవాద
దురాక్రమణ”
అని
ఆయన
అభివర్ణించారు.
అమెరికా
తన
చమురు
నిక్షేపాలను
హస్తగతం
చేసుకునేందుకే
ఈ
దాడులకు
పాల్పడుతోందని
మదురో
ఆరోపిస్తూ..
దేశ
సైన్యాన్ని
యుద్ధానికి
సిద్ధం
కావాలని
ఆదేశించారు.
రష్యా,
చైనాలు
వార్నింగ్
వెనిజులాపై
అమెరికా
దాడిని
రష్యా,
చైనాలు
తీవ్రంగా
ఖండించాయి.
అమెరికా
నిప్పుతో
చెలగాటం
ఆడుతోందని
చైనా
హెచ్చరించింది.
వెనిజులా
సార్వభౌమాధికారాన్ని
దెబ్బతీస్తే
రష్యా
మౌనంగా
ఉండదని,
తమ
మిత్రదేశాన్ని
ఒంటరిని
చేయబోమని
మాస్కో
స్పష్టం
చేసింది.
వెనిజులా
వద్ద
ఉన్న
రష్యన్
తయారీ
S-300
క్షిపణి
వ్యవస్థలు
అమెరికా
విమానాలను
ఎదుర్కొనేందుకు
సిద్ధంగా
ఉన్నాయని
రష్యా
గుర్తుచేసింది.
వెనిజులా
చైనాకు
కీలక
చమురు
సరఫరాదారు.
ఈ
ప్రాంతంలో
అమెరికా
జోక్యం
చేసుకుంటే
తీవ్ర
ఆర్థిక,
భౌగోళిక
రాజకీయ
పరిణామాలు
ఎదుర్కోవాల్సి
ఉంటుందని
చైనా
హెచ్చరించింది.
అమెరికా
వాదన
–
‘డ్రగ్
కార్టెల్స్’
నిర్మూలనే
లక్ష్యం
ఈ
దాడులను
అమెరికా
సమర్థించుకుంది.
వెనిజులాలోని
డ్రగ్
కార్టెల్స్,
నార్కో-టెర్రరిజం
అమెరికా
భద్రతకు
ముప్పుగా
మారాయని,
వాటిని
అణచివేసేందుకే
ఈ
‘సర్జికల్
స్ట్రైక్స్’
చేపట్టినట్లు
అమెరికా
పేర్కొంది.
అయితే
డొనాల్డ్
ట్రంప్
ప్రభుత్వం
అక్కడ
‘పాలన
మార్పు’
కోసం
ప్రయత్నిస్తోందని
అంతర్జాతీయ
విశ్లేషకులు
భావిస్తున్నారు.
‘కోల్డ్
వార్
2.0’
మొదలైందా?
ఐక్యరాజ్యసమితి
(UN)
ఈ
పరిణామాలపై
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
చేస్తూ,
ఇరుపక్షాలు
సంయమనం
పాటించాలని
కోరింది.
ఒకవేళ
అమెరికా
తన
దాడులను
కొనసాగిస్తే..
రష్యా,
చైనా
నేరుగా
వెనిజులాకు
మద్దతుగా
రంగంలోకి
దిగే
అవకాశం
ఉంది.
అదే
జరిగితే
ఇది
ప్రపంచాన్ని
ఒక
పెను
సంక్షోభంలోకి
నెట్టే
ప్రమాదం
ఉంది.


