Cinema
oi-Korivi Jayakumar
నాలుగేళ్ల
క్రితం
చిత్ర
పరిశ్రమకు
ఎంట్రీ
ఇచ్చి
అరడజనుకు
పైగా
సినిమాల్లో
నటించినా
రాని
గుర్తింపు..
కేవలం
ఒక్క
సినిమా
పుణ్యమా
అని
ఓవర్
నైట్
స్టార్‌గా
మారిపోయింది.
ఇంతకీ
ఎవరా
ముద్దుగుమ్మ
అని
ఆలోచిస్తున్నారా
?
ఆమె
ఎవరో
కాదు
డ్రాగన్
సినిమాతో
కుర్రకారు
హృదయాలను
కొల్లగొట్టిన
“కయాదు
లోహర్”.
2000
ఏప్రిల్
11న
అస్సాంలోని
తేజ్‌పూర్‌లో
జన్మించింది.
ఒక్క
సినిమాతో
ఓవర్
నైట్
లోనే
స్టార్
హీరోయిన్
రేంజ్
కి
ఎదిగింది.
ఇప్పుడు
ఏకంగా
వరుస
ఆఫర్లతో
దూసుకుపోతూ
ఫుల్
బిజీగా
ఉంది.
ఫిల్మ్
కెరీర్..
2021లో
వచ్చిన
కన్నడ
చిత్రం
‘మొగిల్
పేట’
సినిమాతో
కయాదు
చిత్రపరిశ్రమలోకి
ఎంట్రీ
ఇచ్చింది.
ఆ
తర్వాత
2022లో
శ్రీవిష్ణు
హీరోగా
వచ్చిన
‘అల్లూరి’
సినిమాతో
టాలీవుడ్
ఇండస్ట్రీలోకి
కూడా
అడుగు
పెట్టింది.
ఆ
తర్వాత
పలు
భాషల్లో
అరడజనుకు
పైగా
చిత్రాల్లో
నటించినా
కానీ
అవేవీ
ఈ
అమ్మడుకు
అదృష్టాన్ని
తెచ్చిపెట్టలేకపోయాయి.
కానీ
ఇటీవల
డైరెక్టర్
కం
హీరో
ప్రదీప్
రంగనాథన్
హీరోగా
వచ్చిన
“డ్రాగన్”
సినిమాలో
హీరోయిన్
గా
నటించి
మెప్పించింది
ఈ
భామ.
ఆమె
గ్లామర్
తో
పాటు
నటనకు
ఫ్యాన్స్
ఫిదా
అయిపోవడంతో..
తెలుగు,
తమిళ్
భాషల్లో
వరుసగా
అవకాశాలతో
దూసుకుపోతుంది.
ఇప్పటికే
తమిళంలో
యంగ్
హీరోలు
అధర్వ,
జీవి
ప్రకాష్
సినిమాలలో
నటిస్తున్న
ఈమె
శింబుతో
పాటు
ఒక
ఇనిమాలో
నటించే
ఛాన్స్
కొట్టేసింది.
అలానే
ప్రస్తుతం
తెలుగులో
యంగ్
హీరో
విశ్వక్
సేన్
నటిస్తున్న
‘ఫంకీ’
సినిమాలో
కూడా
నటిస్తుంది.
దీంతో
భారీ
అంచనాలతో
రాబోతున్న
ఈ
చిత్రాల్లో
నటించే
ఛాన్స్
రావడం
పట్ల
ఆమె
ఫ్యాన్స్
ఫుల్
ఖుషి
అవుతున్నారు.
ఇక
ఈ
సినిమాల్లో
ఏది
హిట్
అయినా
మళ్లీ
ఈ
అమ్మడు
కెరీర్
ఫుల్
స్వింగ్
లో
దూసుకుపోవడం
గ్యారంటీ
అంటున్నారు.
అయితే
ఇటీవలి
కాలంలో
కయాదు
లోహర్
ఊహించని
చిక్కుల్లో
పడి
వార్తల్లో
నిలిచిన
విషయం
తెలిసిందే.
ఓ
స్కామ్‌తో
సంబంధం
ఉన్న
నిందితులు
నిర్వహించిన
నైట్
పార్టీలో
ఆమె
పాల్గొన్నట్లు
వార్తలు
హల్
చల్
చేశాయి.
ఆ
నైట్
పార్టీకి
హాజరవ్వడానికి
ఏకంగా
రూ.35
లక్షలు
తీసుకున్నారని
కూడా
జోరుగా
చర్చ
నడిచింది.
ఈ
ఆరోపణలపై
ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్
(ఈడీ)
గతంలో
ఆమెను
విచారించారు.
అయితే
రీసెంట్
గా
ఓ
ఇంటర్వ్యూలో
మాట్లాడుతూ..
ఈ
విషయాలపై
రియాక్ట్
అవుతూ
ఎమోషనల్
అవ్వడం
హాట్
టాపిక్
గా
మారింది.
ప్రజలు
తన
గురించి
చెడుగా
మాట్లాడటం
చాలా
బాధను
కలిగిస్తుందని
ఈ
భామ
ఆవేదన
వ్యక్తం
చేసింది.
పుకార్లను
ఎదుర్కోవడం
చాలా
కష్టమని..
ఇలాంటి
అనుభవాలు
తనకు
కొత్త
అని
వాపోయింది.
తన
గురించి
ఇతరులు
చెడుగా
మాట్లాడుతున్నారనే
ఆలోచన
నిద్ర
పట్టనివ్వడం
లేదని
చెప్పుకొచ్చింది.
ప్రపంచంలో
ఎవరి
గురించి
కూడా
తాను
అలా
అనుకోనని
తెలిపింది.
తాను
ఏం
తప్పు
చేశానో
తెలియడం
లేదని
వివరించింది.
తనను
ఎందుకు
టార్గెట్
చేస్తున్నారో
తెలియడం
లేదని
వెల్లడించింది.
కానీ
ఎప్పుడూ
ప్రేమను
పంచుతూనే
ఉంటానని
కయాదు
క్లారిటీ
ఇచ్చింది.


