Telangana
oi-Dr Veena Srinivas
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
వచ్చిన
తర్వాత
ఏది
నిజమైంది
ఏది
ఫేక్
అన్నది
అర్థం
కాని
పరిస్థితి
చోటుచేసుకుంది
.
ప్రస్తుతం
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
ఉచ్చులో
పడి
చాలామంది
ఇబ్బంది
పడుతున్నారు.
తాను
చేయనివి
చేసినట్టు
చూపిస్తున్న
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
డీప్
ఫేక్
వీడియోలు
కొన్ని
సందర్భాలలో
సెలబ్రిటీలను
ఇబ్బందులకు
గురిచేస్తున్నాయి.
ఇక
తాజాగా
అసదుద్దీన్
ఓవైసీ
కి
సంబంధించి
ఒక
డీప్
ఫేక్
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతుంది.
ఓవైసీ
హనుమంతునికి
హారతి
..
ఏఐ
వీడియో
పార్లమెంటు
సభ్యుడు
ఎంఐఎం
అధినేత
అసదుద్దీన్
ఓవైసీ
ఆంజనేయ
స్వామిని
దర్శించి
హారతి
ఇస్తున్నట్టు,
ఏఐ
డీప్
ఫేక్
వీడియోలు
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నాయి.
ఇక
ఈ
వీడియోలపైన
భిన్నాభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.
ఇది
కులమతాల
మధ్య
చిచ్చుపెట్టే
లాగా
ఉందన్న
అభిప్రాయం
వ్యక్తమవుతుంది.
నకిలీ
ఏఐ
వీడియోపై
పోలీసులకు
ఫిర్యాదు
అయితే
తాజాగా
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్న
నకిలీ
ఏఐ
జనరేటర్
వీడియో
పైన
ఏ
ఐ
ఎం
ఐ
ఎం
సోషల్
మీడియా
అడ్మిన్
మొహమ్మద్
ఇర్ఫాన్
ఖాన్
పోలీసులను
ఆశ్రయించారు.
సోషల్
మీడియాలో
ముస్లిం
సామాజిక
వర్గానికి
చెందిన
పార్లమెంటు
సభ్యుడు
అసదుద్దీన్
ఓవైసీ
ఆంజనేయ
స్వామికి
హారతి
ఇస్తున్నట్టు
ప్రచారం
చేయడం
పైన
ఫిర్యాదు
చేశాడు.
ఈ
వీడియో
ను
వైరల్
చేస్తున్న
వారిపైన
చర్యలు
తీసుకోవాలని
ఆయన
తన
ఫిర్యాదులో
పేర్కొన్నారు.
కేసు
నమోదు
చేసిన
పోలీసులు
హెచ్చరిక
దీంతో
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
ఎవరూ
ఆ
ఏఐ
జనరేటర్
వీడియోను
షేర్
చేయవద్దని,
ఫార్వర్డ్
చేయవద్దని
చెబుతున్నారు.
ఈ
ఏఐ
జనరేటెడ్
వీడియోను
ఒకవేళ
షేర్
చేస్తే
కఠిన
చర్యలు
తీసుకుంటారని
హెచ్చరిస్తున్నారు.
టెక్నాలజీ
ముసుగులో
చేసే
ఇటువంటి
చర్యలను
సహించేది
లేదని
ఎంఐఎం
నేతలు
తేల్చి
చెప్తున్నారు.
మత
విశ్వాసాలను
దెబ్బ
తీస్తున్నారని
భగ్గుమన్న
ఎంఐఎం
ఇటువంటి
వీడియోలు
తమ
మత
విశ్వాసాలను
దెబ్బతీస్తాయని
వారు
అసహనం
వ్యక్తం
చేస్తున్నారు.
ప్రముఖ
రాజకీయ
నాయకుడిని
ఇందులో
భాగం
చేయడం
సరి
కాదని
అంటున్నారు.
ఈ
వీడియో
పైన
సమగ్ర
దర్యాప్తు
చేసి
బాధ్యుల
పైన
చర్యలు
తీసుకోవాలని
ఎంఐఎం
నేతలు
డిమాండ్
చేస్తున్నారు.


