Entertainment
oi-Korivi Jayakumar
సమంత..
సమంత..
సమంత..
ప్రెజెంట్
ఏ
సోషల్
మీడియా
ప్లాట్‌ఫామ్
చూసినా,
ఏ
న్యూస్
చానెల్
చూసినా,
ఎవరి
నోటంట
విన్నా…
అంతా
సామ్
గురించే
డిస్కషన్
నడుస్తోంది.
బాలీవుడ్
డైరెక్టర్
రాజ్
నిడిమోరుతో
కలిసి
ఏడడుగులు
వేసి
కొత్త
జీవితం
జీవితం
మొదలుపెట్టింది.
వీళ్లిద్దరి
వివాహం
సోమవారం
ఉదయం
కోయంబత్తూర్‌లోని
ఈశా
ఫౌండేషన్
యోగా
సెంటర్‌లో
ఉన్న
లింగ
భైరవి
దేవాలయంలో
జరిగింది.
అందరికీ
సర్
ప్రైజ్
ఇస్తూ
బుట్టబొమ్మ
చేసిన
ఈ
అనౌన్స్
మెంట్
ప్రస్తుతం
ఫుల్
హాట్
టాపిక్
గా
మారింది.
కొన్నేళ్ల
క్రితం
హీరో
అక్కినేని
నాగ
చైతన్యతో
విడాకులు
తీసుకున్న
సామ్..
గత
కొంతకాలంగా
రాజ్
తో
డేటింగ్
లో
ఉన్నారనే
వార్తలు
వినిపిస్తున్నాయి.
మొత్తానికి
ఇప్పుడు
ఈ
వార్తలకు
ఫుల్
స్టాప్
పెడుతూ
ఆయనతో
నూతన
జీవితాన్ని
ప్రారంభించింది.
అయితే
ఈ
జంట
వివాహం
భూత
శుద్ధి
పద్దతిలో
జరగడం
సర్వత్రా
చర్చనీయాంశంగా
మారింది.
దాంతో
అంతా
అసలెంటీ
ఈ
భూత
శుద్ధి
పద్ధతి
అని
తెలుసుకునే
పనిలో
పడ్డారు.
అయితే
ఇదేదో
క్షుద్రపూజలు,
తాంత్రిక
పూజలు,
భూతాల
పూజలు
అనుకుంటే
పొరపాటే.
భూత
శుద్ధి
అనేది
అత్యంత
పవిత్రమైన
వివాహ
పద్ధతి
అని
చెబుతున్నారు.
భూత
శుద్థి
వివాహం
అంటే..
తమిళనాడులోని
కోయంబత్తూరులో
సద్గురు
స్థాపించిన
ఈశా
ఫౌండేషన్
ఈ
వివాహాలను
నిర్వహిస్తోంది.
భూత
శుద్థి
అనేది
పురాతన
వివాహ
ఆచారమని..
యోగ
సంప్రదాయ
విధానంలో
ఎన్నో
ఏళ్లుగా
కొనసాగుతోందని
వివరిస్తున్నారు.
పంచ
భూతాల
శుద్ధీకరణ
ద్వారా
ఇద్దరు
వ్యక్తులు
వివాహ
బంధంతో
ఒక్కటి
కావడమే
భూత
శుద్ధి
వివాహం
అని
తెలుస్తోంది.
అంతే
కాకుండా
ఇరువురి
ఆలోచనలు,
భావోద్వేగాలు,
భౌతికతకు
అతీతంగా
భార్యాభర్తల
మధ్య
లోతైన
బంధాన్ని
ఏర్పరిచేందుకు
ఈ
వివాహ
ప్రక్రియ
రూపొందించబడిందని
అంటున్నారు.
వారి
దాంపత్య
ప్రయాణంలో
సామరస్యం,
శ్రేయస్సు,
ఆధ్యాత్మికత
వెల్లివిరిసేలా
దేవీ
అనుగ్రహాన్ని
ప్రసాదిస్తుందని
నమ్ముతారు.
ఇటీవల
హిందీ
సీరియల్
స్టార్స్
జియా
మనేక్,
వరుణ్
జైన్
కూడా
ఇదే
పద్ధతిలో
పెళ్లి
చేసుకున్నారు.
ఇప్పుడు
సమంత
–
రాజ్
కూడా
భూత
శుద్ధి
విధానంలో
వివాహం
చేసుకోవడంతో
ఈ
పద్దతి
వివాహం
చర్చనీయాంశంగా
మారింది.
కాగా
స్వతహాగా
క్రిస్టియన్
అయిన
సమంత..
గత
కొన్నేళ్లుగా
హిందూ
సాంప్రదాయాలను
ఫాలో
అవుతూ
వస్తున్నారు.
ఇక
సామ్
సినిమాల
విషయానికి
వస్తే..
ప్రస్తుతం
‘రక్త్
బ్రహ్మాండ్’
అనే
వెబ్
సిరీస్
లో
నటిస్తున్నారు.
రాజ్,
డీకే
దర్శకత్వంలో
ఈ
సిరీస్
తెరకెక్కిస్తుండగా..
ఆదిత్య
రాయ్
కపూర్
లీడ్
రోల్
లో
నటిస్తున్నారు.
అలానే
ఒక
హాలీవుడ్
చిత్రంలో
కూడా
నటిస్తూ
బిజీగా
ఉన్నారు.
అంతే
కాకుండా
ప్రస్తుతం
మా
ఇంటి
బంగారం
అనే
సినిమా
షూటింగ్
పనులలో
సమంత
బిజీగా
ఉన్నారు.


