ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వైద్య కళాశాలలను పప్పుబెల్లాల తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం మరింత బరితెగించింది. పూర్తిగా ప్రైవేటుపరం చేసిన బోధనాస్పత్రులలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి వేతనాలను ఏకంగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేందుకు సిద్ధమైంది.


