ఆకాశాన్ని కమ్మేసిన యుద్ధ మేఘాలు.. విమానాలకు అమెరికా హెచ్చరికలు

Date:


International

oi-Lingareddy Gajjala

ఇటీవల
ప్రపంచ
రాజకీయాల్లో
పెరుగుతున్న
ఉద్రిక్తతలు
ఇప్పుడు
ఆకాశ
మార్గాలకూ
ముప్పుగా
మారుతున్నాయి.
లాటిన్
అమెరికా
ప్రాంతాన్ని
కేంద్రంగా
చేసుకుని
జరుగుతున్న
సైనిక
కదలికలు,
భద్రతా
ఆందోళనల
నేపథ్యంలో
అమెరికా
కీలక
హెచ్చరిక
జారీ
చేయడం
అంతర్జాతీయ
స్థాయిలో
కలకలం
రేపుతోంది.
సాధారణంగా
యుద్ధ
ప్రాంతాలకు
మాత్రమే
పరిమితమయ్యే

తరహా
అలర్టులు…
ఇప్పుడు
మెక్సికో,
సెంట్రల్
అమెరికా,
తూర్పు
పసిఫిక్
గగనతలం
వరకు
విస్తరించడం
పరిస్థితుల
తీవ్రతను
స్పష్టంగా
చూపిస్తోంది.

అమెరికా
ఫెడరల్
ఏవియేషన్
అడ్మినిస్ట్రేషన్
(FAA)
తాజాగా
అన్ని
అమెరికన్
విమానయాన
సంస్థలకు
అడ్వైజరీ
నోటీసులు
జారీ
చేసింది.
మెక్సికో,
సెంట్రల్
అమెరికా,
పనామా
సహా
తూర్పు
పసిఫిక్
మహాసముద్రంలోని
కొన్ని
కీలక
గగనతల
ప్రాంతాల్లో
ప్రయాణించే
సమయంలో
అత్యంత
జాగ్రత్తగా
వ్యవహరించాలని
ఆదేశించింది.
సైనిక
కార్యకలాపాల
కారణంగా
విమానాలకు
ముప్పు
ఏర్పడే
అవకాశం
ఉందని,
విమానాల
ఎత్తు
ఎంత
ఉన్నా-టేకాఫ్‌,
ల్యాండింగ్
దశల్లోనూ
ప్రమాదం
తలెత్తవచ్చని
ఎఫ్‌ఏఏ
స్పష్టంగా
హెచ్చరించింది.

నోటీసులు
కనీసం
60
రోజుల
పాటు
అమల్లో
ఉండనున్నాయి.


యుద్ధ
సమయాల్లో
ఇచ్చే
ఆదేశాలు

సాధారణంగా
యుద్ధాలు,
అంతర్జాతీయ
ఉద్రిక్తతలు
లేదా
సైనిక
దాడుల
భయం
ఉన్నప్పుడు
మాత్రమే

తరహా
హెచ్చరికలు
జారీ
చేస్తారు.
అందుకే

అడ్వైజరీలు
ఇప్పుడు
అనేక
అనుమానాలకు
తావిస్తున్నాయి.
ముఖ్యంగా
మెక్సికో,
లాటిన్
అమెరికా
దేశాలపై
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
ఇటీవలి
కాలంలో
చేసిన
తీవ్ర
వ్యాఖ్యలు

పరిణామాలకు
మరింత
బలం
చేకూర్చుతున్నాయి.
మాదకద్రవ్యాల
ముఠాలు,
అక్రమ
రవాణా
కేంద్రాలను
లక్ష్యంగా
చేసుకుని
కఠిన
చర్యలు
తీసుకుంటామని
ట్రంప్
ఇప్పటికే
బహిరంగంగానే
హెచ్చరించారు.


మరింత
కఠినంగా..

లాటిన్
అమెరికా
దేశాల
నుంచి
మాదకద్రవ్యాలు
అక్రమంగా
అమెరికాలోకి
ప్రవేశిస్తున్నాయన్న
ఆరోపణలతో
ట్రంప్
ప్రభుత్వ
వైఖరి
మరింత
కఠినంగా
మారింది.

క్రమంలో
వెనెజువెలాపై
గతంలో
జరిగిన
సైనిక
చర్యలు,

దేశ
రాజకీయ
పరిణామాలు
ఇప్పటికీ
ప్రపంచాన్ని
ఆలోచింపజేస్తున్నాయి.
ఇప్పుడు
అదే
తరహా
పరిస్థితులు
మెక్సికో
సహా
ఇతర
దేశాలపై
కూడా
ఉత్పన్నమవుతాయా?
అనే
ప్రశ్నలు
వినిపిస్తున్నాయి.

నేపథ్యంలోనే
FAA
విమానయాన
సంస్థలను
ముందస్తుగా
అప్రమత్తం
చేయడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.


ప్రయాణికుల్లో
ఆందోళన..

విమాన
ప్రయాణ
భద్రతపై

హెచ్చరికలు
ప్రయాణికుల్లోనూ
ఆందోళన
రేకెత్తిస్తున్నాయి.
అంతర్జాతీయ
విమాన
మార్గాలు
సాధారణంగా
రాజకీయాలకు
అతీతంగా
ఉంటాయన్న
నమ్మకానికి
ఇప్పుడు
గండిపడుతోంది.
గగనతలంలో
కూడా
జియోపాలిటిక్స్
ప్రభావం
చూపుతున్న

పరిణామాలు,
రాబోయే
రోజుల్లో
లాటిన్
అమెరికా
ప్రాంతంలో
పరిస్థితులు
మరింత
ఉద్రిక్తంగా
మారే
అవకాశాలను
సూచిస్తున్నాయని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి…
భూమిపైనే
కాదు,
ఆకాశంలోనూ
ముప్పు
మేఘాలు
కమ్ముకుంటున్న
వేళ,
ప్రపంచం
మరో
అస్థిర
దశలోకి
అడుగుపెడుతోందన్న
భావన
బలపడుతోంది.
FAA
హెచ్చరికలు
కేవలం
సాంకేతిక
సూచనలేనా?
లేక
రాబోయే
పెద్ద
పరిణామాలకు
సంకేతాలా?
అన్నది
కాలమే
తేల్చాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related