ఆదివారం నాడే నిర్మలమ్మ బడ్జెట్? ఆ తేదీపై కేంద్రం తర్జనభర్జన!

Date:


India

oi-Jakki Mahesh

Union
Budget
2026:
దేశ
ఆర్థిక
గమనాన్ని
నిర్దేశించే
కేంద్ర
బడ్జెట్
2026ను
పార్లమెంట్‌లో
ప్రవేశపెట్టే
తేదీపై
ప్రస్తుతం
సర్వత్రా
ఆసక్తి
నెలకొంది.
సాధారణంగా
ప్రతి
ఏటా
ఫిబ్రవరి
1వ
తేదీన
బడ్జెట్‌ను
ప్రవేశపెట్టడం
ఆనవాయితీ.
అయితే

సారి
ఫిబ్రవరి
1వ
తేదీ
ఆదివారం
కావడంతో

రోజున
బడ్జెట్‌ను
ప్రవేశపెడతారా
లేదా
అన్నది
చర్చనీయాంశంగా
మారింది.


నిర్మలమ్మ
రికార్డు..
తొమ్మిదోసారి

కేంద్ర
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
వరుసగా

సారి
తన
తొమ్మిదో
బడ్జెట్‌ను
సమర్పించబోతున్నారు.
ఇది
దేశ
చరిత్రలో

కీలక
మైలురాయి.
అయితే
ఆదివారం
సెలవు
దినం
కావడంతో
పాటు

రోజున
గురు
రవిదాస్
జయంతి
కూడా
ఉండటంతో
తేదీ
మార్పుపై
ఊహాగానాలు
మొదలయ్యాయి.
భారత
పార్లమెంటరీ
చరిత్రలో
బడ్జెట్‌ను
గతంలో
శనివారాల్లో
ప్రవేశపెట్టిన
సందర్భాలు
ఉన్నాయి
(ఉదాహరణకు
2020,
2025).
కానీ
ఆదివారం
నాడు
బడ్జెట్
ప్రవేశపెట్టడం
అత్యంత
అరుదు.
కొత్త
ఆర్థిక
సంవత్సరం
(ఏప్రిల్
1)
ప్రారంభానికి
ముందే
బడ్జెట్
ప్రక్రియను
పూర్తి
చేయాలనే
లక్ష్యంతో
2017
నుంచి
ఫిబ్రవరి
1ని
నిర్ణీత
తేదీగా
మార్చారు.

పార్లమెంటరీ
వ్యవహారాల
క్యాబినెట్
కమిటీ
(CCPA)
త్వరలోనే
సమావేశమై
దీనిపై
తుది
నిర్ణయం
తీసుకోనుంది.
ఒకవేళ
ఆదివారం
కుదరదు
అనుకుంటే..
జనవరి
31కి
లేదా
ఫిబ్రవరి
2కి
తేదీ
మారే
అవకాశం
ఉంది.


ముందస్తు
బడ్జెట్
వెనుక
అసలు
ఉద్దేశం

గతంలో
బడ్జెట్‌ను
ఫిబ్రవరి
చివరి
పని
దినాన
ప్రవేశపెట్టేవారు.
కానీ
అరుణ్
జైట్లీ
ఆర్థిక
మంత్రిగా
ఉన్న
సమయంలో
దీనిని
ఫిబ్రవరి
1కి
మార్చారు.
దీనివల్ల
ప్రభుత్వ
శాఖలకు
నిధుల
కేటాయింపులు,
పథకాల
అమలుకు
ఏప్రిల్
1
నాటికే
పూర్తి
సమయం
దొరుకుతుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related