oi
-Suravarapu Dileep
Aadhaar Mobile Number Update : ఆధార్ కొత్త యాప్ ను ఇటీవలే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని అనేక వివరాలను అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఆధార్ వివరాలను డిజిటల్ గా సేవ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ఉడాయ్ (UIDAI) నుంచి కీలక ప్రకటన వచ్చింది.
ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ :
ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను సులభంగా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అప్‌డేట్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఉడాయ్ డే సందర్భంగా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. జనవరి 28 వ తేదీ నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ వివరాల ఆధారంగా అనేక ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. ఆధార్ కార్డులో మార్పులు చేసేందుకు ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో అవకాశం ఉంది. అయితే ఫోటో, ఫోన్ నంబర్ సహా మరి కొన్ని వివరాలను ఆఫ్‌లైన్ సేవా కేంద్రాల్లోనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
రేపటి నుంచే :
అయితే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, దివ్యాంగులకు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి రావడం మరింత కష్టమవుతోంది. అయితే మొబైల్ నంబర్ ను అప్‌డేట్ చేసుకొనేందుకు ఉడాయ్ తీసుకొస్తున్న కొత్త విధానం అనేక మందికి మేలు చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
గత సంవత్సరం ఆధార్ కొత్త యాప్ :
గత సంవత్సరం నవంబర్ లో ఆధార్ కొత్త యాప్ లాంచ్ అయింది. mAadhaar యాప్ అప్పటికే అందుబాటులో ఉండగా.. మరో యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ కొత్త వెర్షన్ రేపు (జనవరి 28) విడుదల కానుంది. అయితే ఇప్పటికే యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
కాగిత రహితంగా :
ఆధార్ వివరాలను కాగిత రహితంగా నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఉడాయ్ తెలిపింది. ఈ యాప్ లో ఆధార్ వివరాలను డిజిటల్ రూపంలో స్టోర్ చేయవచ్చు. దీంతోపాటు ఇతరులకు ఈ వివరాలను స్టోర్ చేయవచ్చు.
కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్, అప్పటికే అందుబాటులో ఉన్న mAadhaar యాప్ కు ప్రత్యామ్నాయం కాదని గతంలోనే తెలిపింది. మరియు పాత యాప్‌లోనే అనేక ఫీచర్లు ఉన్నాయని ఉడాయ్ తెలిపింది. అయితే కొత్త యాప్ లో కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేల్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
గరిష్ఠంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను స్టోర్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఆధార్ వివరాలు ఒకే ఫోన్ నంబర్ తో లింక్ కావాల్సి ఉంటుంది. ఈ వివరాలను 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆధార్ యాప్ తో ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
Best Mobiles in India


