India
oi-Jakki Mahesh
బీజేపీ
నూతన
జాతీయాధ్యక్షుడిగా
బీహార్‌కు
చెందిన
నితీన్
నవీన్
మంగళవారం(జనవరి
20)
బాధ్యతలు
స్వీకరించారు.
ఢిల్లీలోని
బీజేపీ
ప్రధాన
కార్యాలయంలో
జరిగిన
ఈ
వేడుకలో
ప్రధాన
నరేంద్ర
మోదీ
నూతన
అధ్యక్షుడిని
కొనియాడుతూ
చేసిన
కామెంట్స్
రాజకీయ
వర్గాల్లో
చర్చనీయాంశమయ్యాయి.
బిజెపి
చరిత్రలోనే
అత్యంత
పిన్న
వయస్కుడైన
(45
ఏళ్లు)
అధ్యక్షుడిగా
బాధ్యతలు
చేపట్టిన
నితిన్
నవీన్‌ను
ప్రధాని
మోదీ
హృదయపూర్వకంగా
స్వాగతించారు.
ఈ
సందర్భంగా
ఆయన
పార్టీ
క్రమశిక్షణను,
నూతన
నాయకత్వంపై
తనకున్న
నమ్మకాన్ని
చాటుతూ
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.
నితిన్
నవీన్
నా
బాస్:
ప్రధాని
మోదీ
“పార్టీ
విషయానికి
వస్తే
నితిన్
నవీన్
నా
బాస్,
నేను
కేవలం
ఒక
పార్టీ
కార్యకర్తను
మాత్రమే”
అని
ప్రధాని
ప్రకటించారు.
ఇది
పార్టీలో
పదవి
కంటే
సంస్థాగత
గౌరవమే
ముఖ్యమని
చాటిచెప్పింది.
నితిన్
నవీన్‌ను
మోదీ
ఒక
‘మిల్లేనియల్’
నాయకుడిగా
అభివర్ణించారు.
రేడియో
ద్వారా
సమాచారం
విన్న
తరం
నుంచి
నేడు
కృత్రిమ
మేధస్సు
(AI)ను
వినియోగిస్తున్న
తరం
వరకు
జరిగిన
సామాజిక,
సాంకేతిక
మార్పులను
ఆయన
ప్రత్యక్షంగా
చూశారని
కొనియాడారు.
యువ
ఉత్సాహంతో
పాటు
సుదీర్ఘ
సంస్థాగత
అనుభవం
ఉన్న
నితిన్
నవీన్
నాయకత్వం
పార్టీ
కార్యకర్తలందరికీ
గొప్ప
మేలు
చేస్తుందని
మోదీ
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
నితిన్
నవీన్
ప్రస్థానం:
మాజీ
ఎమ్మెల్యే
నవీన్
కిషోర్
ప్రసాద్
సిన్హా
కుమారుడైన
నితిన్..
బీహార్‌లోని
బాంకీపూర్
నియోజకవర్గం
నుంచి
ఐదుసార్లు
ఎమ్మెల్యేగా
గెలుపొందారు.
గతంలో
బీహార్
ప్రభుత్వంలో
రోడ్డు
నిర్మాణం,
గృహనిర్మాణ
శాఖ
మంత్రిగా
పనిచేశారు.
జేపీ
నడ్డా
వారసుడిగా
నితిన్
నవీన్
ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు.
జనవరి
19న
ఆయన
నామినేషన్‌పై
ప్రధాని
మోదీ
స్వయంగా
సంతకం
చేయడం
విశేషం.
బీజేపీ
ఒక
సంస్కృతి,
ఒక
కుటుంబం
బీజేపీ
అనేది
కేవలం
ఒక
పార్టీ
మాత్రమే
కాదని,
అది
ఒక
సంస్కృతి,
కుటుంబమని
ప్రధాని
పేర్కొన్నారు.
ఇక్కడ
అధ్యక్షులు
మారినా
లక్ష్యాలు
మారవని,
ప్రాంతీయ
ఆకాంక్షలకు
జాతీయ
వేదికను
కల్పించడంలో
బీజేపీ
ఎప్పుడూ
ముందుంటుందని
ఆయన
స్పష్టం
చేశారు.


