Andhra Pradesh
oi-Korivi Jayakumar
ప్రముఖ
సినీ
నిర్మాత
బండ్ల
గణేష్
ను
టీడీపీ
జాతీయ
ప్రధాన
కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్
మంత్రి
నారా
లోకేష్
పరామర్శించారు.
తిరుమల
శ్రీవారికి
మొక్కు
తీర్చుకునేందుకు
చేపట్టిన
సంకల్ప
పాదయాత్రలో
భాగంగా
కాలి
నొప్పితో
ఇబ్బంది
పడుతున్నారు.
ఈ
విషయం
తెలుసుకున్న
లొకేష్
వెంటనే
స్పందించి
ఆయనకు
ఫోన్
చేశారు.
గణేష్
ఆరోగ్య
పరిస్థితిని
అడిగి
తెలుసుకొని..
పాదయాత్రలో
తీసుకోవాల్సిన
జాగ్రత్తలు,
విశ్రాంతి
గురించి
సూచనలు
చేసినట్టు
సమాచారం.
ఆరోగ్యాన్ని
నిర్లక్ష్యం
చేయకుండా
జాగ్రత్తగా
ప్రయాణం
కొనసాగించాలని..
త్వరగా
కోలుకుని
మొక్కును
పూర్తి
చేయాలని
ఆకాంక్షించారని
టిడిపి
వర్గీయులు
స్పష్టం
చేశారు.
చంద్రబాబు
కోసం
మొక్కు..
కాగా
గత
వైసీపీ
ప్రభుత్వ
హయాంలో
టీడీపీ
అధినేత,
ప్రస్తుత
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
అరెస్టు
అయిన
విషయం
తెలిసిందే.
ఆ
సమయంలో
ఆయన
త్వరగా
బయటకు
రావాలని
తిరుమల
వెంకన్నకు
మొక్కుకున్నట్లు
బండ్ల
గణేష్
తెలిపారు.
ఆ
తర్వాత
చంద్రబాబు
జైలు
నుంచి
విడుదల
కావడం,
ఎన్నికల్లో
ఘన
విజయం
సాధించి
మరోసారి
ముఖ్యమంత్రి
పదవిని
చేపట్టడం
తన
విశ్వాసాన్ని
మరింత
బలపరిచిందని
పేర్కొన్నారు.
అందుకే
తాను
చేసిన
మొక్కును
తీర్చుకునేందుకే
ఈ
నెల
19న
తెలంగాణలోని
షాద్‌నగర్‌లో
తన
నివాసం
నుంచి
‘సంకల్ప
యాత్ర’
పేరుతో
పాదయాత్రను
ప్రారంభించారు.
కర్నూలు
జిల్లాలో
కొనసాగుతున్న
పాదయాత్ర..
ప్రస్తుతం
బండ్ల
గణేశ్
పాదయాత్ర
కర్నూలు
జిల్లా
పరిధిలో
కొనసాగుతోంది.
ప్రతిరోజూ
ఎన్నో
కిలోమీటర్లు
నడుస్తూ
ముందుకు
సాగుతున్న
ఆయనకు
మార్గమధ్యంలో
టీడీపీ
అభిమానులు,
కార్యకర్తలు,
స్థానిక
నేతలు
ఘన
స్వాగతం
పలుకుతున్నారు.
పూలమాలలు,
నినాదాలతో
ఆయనకు
మద్దతు
తెలుపుతూ
ఉత్సాహం
నింపుతున్నారు.
ఈ
క్రమంలోనే
ఈ
పాదయాత్ర
వ్యవహారం
ఆధ్యాత్మికతతో
పాటు
రాజకీయంగా
కూడా
ప్రాధాన్యం
సంతరించుకుంటోంది.
చంద్రబాబుపై
తన
అభిమానాన్ని,
నమ్మకాన్ని
బండ్ల
గణేశ్
ఈ
సంకల్ప
యాత్ర
ద్వారా
చాటుకుంటున్నారని
టీడీపీ
శ్రేణులు
వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక
తెలుగు
ప్రేక్షకులకు
బండ్ల
గణేష్
గురించి
కొత్తగా
పరిచయం
అక్కర్లేదు.
నటుడిగా,
నిర్మాతగా
తెలుగు
చిత్ర
పరిశ్రమలో
ప్రత్యేక
గుర్తింపు
తెచ్చుకున్నారు.
కమెడియన్
గా
టాలీవుడ్
కి
ఎంట్రీ
ఇచ్చి
పలు
సినిమాల్లో
నటించి
గుర్తింపు
తెచ్చుకున్నారు.
రవితేజ
నటించిన
ఆంజనేయులు
మూవీతో
నిర్మాతగా
మారగా..
ఆ
తర్వాత
పవన్
కళ్యాణ్,
ఎన్టీఆర్
వంటి
స్టార్
హీరోలతో
కూడా
సినిమాలు
చేసి
హిట్స్
అందుకున్నారు.
గత
కొంతకాలంగా
సినిమాలకు,
రాజకీయాలకు
దూరంగా
ఉన్నప్పటికీ
సోషల్
మీడియా
వేదికగా
తనదైన
శైలిలో
రెస్పాండ్
అవుతూనే
ఉంటున్నారు.
అంతే
కాకుండా
గణేష్
సినిమాలకే
కాకుండా
స్పీచ్
లకు
కూడా
సపరేట్
ఫాలోయింగ్
ఉంటుంది
అనడంలో
సందేహం
అక్కర్లేదు.


