ఆ అదృష్టం – బాధ్యత నాదే, ఉగాది వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది అంతా మంచి జరగాల ని అందరం కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు.

విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. తెలుగు సంస్కృతి వినూత్నమైనది, పండుగలు విభిన్నమైనవి.. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందన్నారు సీఎం. మన పండుగలు ఆరోగ్యకర జీవన శైలిని ప్రతిబింబిస్తాయని.. నేల, ప్రకృతి, నీటిని పూజిస్తామని చెప్పారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. నీటి పరిరక్షణ కోసం ‘నీటి భద్రత’ విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, పర్యావరణం కోసం నీరు అవసరమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయన్నారు. మే 15 నుంచే సాగుకు నీరు విడుదల చేస్తామని, నారు మళ్లు వేసుకోవాలని ముందుగానే చెప్పిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ

స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. తాను మీ అందరి వాడిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. దుష్టులు ఏమారుస్తారు వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నానన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని యువతకు హామీ ఇచ్చింది.. ఉద్యోగాల కల్పన కోసం సంకల్పించామని చెప్పారు. 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశామని తెలిపారు. అదే విధంగా 15,940 మంది టీచర్లకు మెగాడీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించాం, 5757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలు చేశామని వివరించారు. 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని హామీ ఇచ్చాం.. దానిని నెరవేరుస్తామన్నారు. మే 15 నుంచి అక్టోబరు 15 వరకూ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 2047 నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలని ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పేలా సంకల్పం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related