Telangana
oi-Sai Chaitanya
బీఆర్ఎస్
వర్కింగ్
ప్రెసిడెంట్
కేటీఆర్
సంచలన
వ్యాఖ్యలు
చేసారు.
ఫోన్
ట్యాపింగ్
కేసులో
మాజీ
సీఎం
కేసీఆర్‌కు
నోటీసులు
ఇచ్చినా
భయపడేది
లేదన్నారు.
ఇంకో
వెయ్యి
సెట్‌లు
వేసినా
ఎదుర్కోవటానికి
రెడీగా
ఉన్నామని
స్పష్టం
చేశారు.
హరీశ్‌రావును
జైలుకు
పంపాలని
రేవంత్‌రెడ్డి
తహతహలాడుతున్నారని
ఎద్దేవా
చేశారు.
ఫోన్
ట్యాపింగ్
కేసులో
విచారణలో
పాల్గొన్న
అధికారుల
ను
రిటైర్
అయిన
తర్వాత
కూడా
వదిలిపెట్టమని
కేటీఆర్
హెచ్చరించారు.
మాజీ
మంత్రి
కేటీఆర్..
సీఎం
రేవంత్
పై
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
ప్రజా
సమస్యలు
పరిష్కరించక
పోతే
రేవంత్
రెడ్డిని
వదిలేది
లేదని
హెచ్చరించారు.
సుప్రీంకోర్టు
కంటే
రేవంత్‌రెడ్డి
సిట్
పెద్దదా?
అని
ప్రశ్నించారు.
బొగ్గు
కుంభకోణంలో
సీఎం
బావమరిది
సృజన్
రెడ్డి
కింగ్
పిన్
అని
ఆరోపణలు
చేశారు.
బొగ్గు
కుంభకోణంపై
సుప్రీంకోర్టు
సిట్టింగ్
జడ్జితో
న్యాయ
విచారణ
జరిపించాలని
డిమాండ్
చేశారు.
బొగ్గు
కుంభకోణంలో
కేంద్రమంత్రి
కిషన్
రెడ్డికి
కూడా
భాగస్వామ్యం
ఉందని
కేటీఆర్
ఆరోపించారు.
అందుకే
కోల్
మినిస్టర్
కిషన్..
ఈ
విషయంలో
మౌనంగా
ఉన్నారని
చెప్పుకొచ్చారు.
రేవంత్‌రెడ్డి
బావమరిది
కుంభకోణం
బయట
పెట్టినందుకే
హరీశ్‌రావును
విచారణపేరుతో
వేధిస్తున్నారని
ధ్వజమెత్తారు.
కాంగ్రెస్
లొసుగులు
బయటపెట్టిన
ప్రతిసారీ
డైవర్షన్
పాలిటిక్స్
చేస్తున్నారని
ఎద్దేవా
చేశారు.
వాటాల
పంచాయితీ
వల్లే
నైనీ
బ్లాక్
టెండర్లను
మల్లు
భట్టి
విక్రమార్క
రద్దు
చేశారని
ఆరోపించారు.
సైట్
విజిట్
సర్టిఫికెట్
పెద్ద
తప్పు
అని
కేటీఆర్
తెలిపారు.
టెండర్లు
వేస్తోన్న
వారిపై
సృజన్
రెడ్డి
బెదిరింపులకు
దిగుతున్నారని
విమర్శించారు.
నైనీ
ఒక్కటే
రద్దు
చేస్తే
సరిపోదని..
సృజన్
రెడ్డి
దక్కించుకున్న
టెండర్లనూ
రద్దు
చేయాలని
డిమాండ్
చేశారు.
అసెంబ్లీలో
రేవంత్
కేబినెట్‌ను
హరీశ్‌రావు
ఫుట్‌బాల్
ఆడుకున్నారని
సెటైర్లు
వేశారు.
ఫోన్
ట్యాపింగ్
కేసుపై
ఎందుకు
ఒక్క
అధికారిక
ప్రెస్‌మీట్
పెట్టరని
నిలదీశారు.
విచారణ
పేరుతో
బీఆర్ఎస్
నాయకత్వాన్ని
రేవంత్
సర్కార్
వేధిస్తోందని
విమర్శించారు.
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస్‌రెడ్డి
కొడుకు
భూ
అరాచకాలపై
సిట్
ఎందుకు
వేయటం
లేదని
ఆయన
ప్రశ్నించారు.
ఫోన్
ట్యాపింగ్
కేసులో
భాగస్వామ్యమైన
అధికారులు
నిష్పక్షపాతంగా
విచారణ
చేయాలని
సూచించారు.
రేపు
అధికారంలోకి
వచ్చేది
బీఆర్ఎస్సేనని..
రేవంత్‌రెడ్డి
ఆడే
రాజకీయ
క్రీడలో
అధికారులు
బలి
కావొద్దని
హితవు
పలికారు.
బీఆర్ఎస్
జెండా
గద్దెలను
ముట్టుకుంటే
చూస్తూ
ఊరుకోమన్నారు.
పేమెంట్
కోటాలో
రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి
అయ్యారని..
ఇంకా
ఆయనను
సీఎంగా
గుర్తించటం
లేదని
సెటైర్లు
వేశారు.


