Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఏపీ
సీఎం
చంద్రబాబు
రాష్ట్రంలో
అన్ని
రంగాల
పురోగతి
పైన
దృష్టి
సారించారు.
ముఖ్యంగా
ఏపీలో
రాష్ట్ర
మంత్రివర్గ
సమావేశంలో
ఏపీ
పురోగతి
కోసం
ముఖ్యంగా
పర్యాటక
రంగ
అభివృద్ధి
కోసం
పలు
కీలక
నిర్ణయాలను
తీసుకున్నారు.
ఈ
భేటీలో
పలు
కీలక
అంశాలపైన
చర్చించిన
అనంతరం
సీఎం
చంద్రబాబు
తాజా
రాజకీయ
పరిణామాలపైన
మంత్రులతో
సంభాషించారు.
పర్యాటక
రంగం
ఒక
గేమ్
చేంజర్
ఈ
సందర్భంగా
మాట్లాడిన
చంద్రబాబు
జలరవాణాను
పెంపొందించుకోవటం
ద్వారా
లాజిస్టిక్స్
లో
ప్రపంచ
స్థాయిలో
పోటీ
పడాలని
చంద్రబాబు
అన్నారు.
దీనివల్ల
రాష్ట్రం
అభివృద్ధి
పథంలో
దూసుకుపోతుందని
పేర్కొంటూ,
అన్ని
తీర
ప్రాంత
జిల్లాలలో
ఒక్కో
పోర్టు
ఏర్పాటు
చేయాలని
అధికారులను
ఆదేశించారు.అంతేకాదు
పర్యాటక
రంగాన్ని
గేమ్
చేంజర్
అని
అభివర్ణించిన
చంద్రబాబు
చీరాలలో
పర్యాటకాన్ని
మరింత
ప్రోత్సహించి
సూర్యలంక
లో
మూడు
కొత్త
హోటల్స్
కు
ఆమోదం
తెలిపారు.
ఫెర్రో
అల్లాయిస్
యూనిట్లకు
ఏడాది
పాటు
విద్యుత్
రాయితీ
రాష్ట్రంలో
70
వేల
మందికి
ఉపాధి
కల్పిస్తున్న
ఫెర్రో
అల్లాయిస్
యూనిట్లకు
ఏడాది
పాటు
విద్యుత్
రాయితీలను
ప్రకటించారు.
గతంలో
వైయస్
జగన్మోహన్
రెడ్డి
పాలనలో
విధించిన
4490
కోట్ల
రూపాయల
ట్రూ
అప్
చార్జీల
భారం
ప్రజల
పైన
పడకుండా
ప్రభుత్వమే
భరిస్తుందని
సీఎం
చంద్రబాబు
హామీ
ఇచ్చారు.
యూనిట్
విద్యుత్
చార్జీని
ఐదు
రూపాయల
19
పైసల
నుంచి
నాలుగు
రూపాయల
90
పైసలకు
తగ్గించామని
ఆయన
వెల్లడించారు.
ప్రత్యామ్నాయ
పంటల
సాగుకు
ప్రోత్సాహం
బార్లు,
లిక్కర్
షాపులకు
ఏ
ఈ
ఆర్
టి
చార్జీలను
సమం
చేయాలని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
అధికారులను
ఆదేశించారు.
సముద్రంలో
వృధాగా
కలిసే
జలాలను
తెలుగు
రాష్ట్రాల
సద్వినియోగం
చేసుకోవాలని,
నీరు
వృధా
కాకుండా
చూసుకుంటే
కొత్త
పంటలకు
వీలవుతుందని
చంద్రబాబు
తెలిపారు.
ప్రభుత్వం
అన్ని
రకాల
పంటలను
కొనుగోలు
చేస్తుందని,
రైతులను
ప్రత్యామ్నాయ
పంటల
సాగు
వైపు
కూడా
ప్రోత్సహించాలని
చంద్రబాబు
సూచించారు.
ప్రతి
ప్రాజెక్టును
అధికారులు
సమన్వయంతో
గ్రౌండ్
చేయాలి
పోలవరం
ప్రాజెక్టు
పూర్తయితే
కృష్ణా
జలాలను
విశాఖపట్నం
తీసుకు
వెళ్లవచ్చని
సీఎం
పేర్కొన్నారు.
గత
ప్రభుత్వ
హయాంలోనే
రాయలసీమ
లిఫ్ట్
ఇరిగేషన్
ప్రాజెక్ట్
ఆగిపోయిందని,
ఇప్పుడు
తమపై
నిందలు
వేయడం
సరికాదని
చంద్రబాబు
మండిపడ్డారు.
రాష్ట్రంలో
చేపట్టిన
ప్రతి
ప్రాజెక్టును
అధికారులు
సమన్వయంతో
గ్రౌండ్
చేయాలని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
సూచించారు.


