International
oi-Bomma Shivakumar
చైనాతో
ట్రేడ్
డీల్
కుదుర్చుకుంటే
100
శాతం
సుంకాలు
విధిస్తామని
కెనడాకు
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
వార్నింగ్
ఇచ్చారు.
కెనడా-
చైనా
మధ్య
ప్రాథమికంగా
డీల్
కుదిరినట్లు
తెలుస్తోంది.
ఇరు
దేశాల
మధ్య
టారిఫ్
లు
తగ్గించుకోవడం,
వీసా
రూల్స్
సడలింపు
తదితర
అంశాలపై
చర్చలు
నడుస్తున్నాయి.
ఈ
క్రమంలో
కెనడాకు
ట్రంప్
వార్నింగ్
ఇచ్చారు.
చైనాతో
వాణిజ్య
ఒప్పందం
చేసుకుంటే
కెనడాపై
100
శాతం
పన్నులు
విధిస్తామని
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తాజాగా
హెచ్చరికలు
జారీ
చేశారు.
చైనాతో
కెనడా
జరిపిన
వాణిజ్య
ఒప్పందంపై
ట్రంప్
తీవ్రంగా
స్పందించారు.
చైనా-
కెనడా
మధ్య
ట్రేడ్
డీల్
ఓకే
అయితే..
కెనడా
నుంచి
అమెరికాకు
వచ్చే
అన్ని
వస్తువులపై
100
శాతం
టారిఫ్
లు
విధిస్తామని
స్పష్టం
చేశారు.
మరోవైపు
అమెరికాతో
వాణిజ్య
ఉద్రిక్తతల
నేపథ్యంలో
అగ్రరాజ్యంపై
ఆధారపడటాన్ని
కెనడా
తగ్గించుకుంటున్నట్లు
తెలుస్తోంది.
ఈ
క్రమంలోనే
అమెరికాకు
ప్రత్యామ్నాయంగా
చైనాతో
వాణిజ్య
ఒప్పందాలు
కుదుర్చుకుంటున్నట్లు
సమాచారం.
చైనాతో
వాణిజ్య
ఒప్పందం
చేసుకుంటే
కెనడాపై
100
శాతం
పన్నులు
విధిస్తామని
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తన
అధికారిక
సోషల్
మీడియా
ట్రూత్
సోషల్
ద్వారా
పోస్టు
చేశారు.
చైనాతో
ట్రేడ్
వల్ల
కెనడా
పూర్తిగా
దెబ్బతింటుందని
సూచనలు
చేశారు.
కెనడా
తన
ఆర్థిక
వ్యవస్థను
పూర్తిగా
కోల్పోతుందని
వార్నింగ్
ఇచ్చారు
ట్రంప్.
మరోవైపు
ఇటీవల
చైనా-
కెనడా
ప్రాథమిక
ఒప్పందానికి
వచ్చాయి.
ఈ
ట్రేడ్
డీల్
ప్రకారం..
చైనా
నుండి
వచ్చే
ఎలక్ట్రిక్
వాహనాలపై
కెనడా
పన్నులు
తగ్గించనుంది.
అలాగే
కెనడా
వ్యవసాయ
ఉత్పత్తులపై
పన్నులను
తగ్గించేందుకు
చైనా
అంగీకరించింది.
ఇక
అమెరికాపై
ఆధారపడటాన్ని
తగ్గించుకునేందుకే
కెనడా..
చైనాతో
భాగస్వామ్యం
అవుతున్నట్లు
తెలుస్తోంది.
మరోవైపు
కెనడా
ప్రధాని
మార్క్
కార్నే
ఇటీవల
దావోస్
లో
జరిగిన
వరల్డ్
ఎకనామిక్
ఫోరమ్
వేదికగా
మాట్లాడుతూ
అమెరికాపై
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
కెనెడియన్ల
వల్లనే
అమెరికా
అభివృద్ధి
చెందుతోందని
అన్నారు.
ఆయన
వ్యాఖ్యలు
ట్రంప్
నకు
ఆగ్రహం
తెప్పించిన
నేపథ్యంలో
‘బోర్డ్
ఆఫ్
పీస్’
(శాంతి
మండలి)
నుండి
కార్నేకు
ఇచ్చిన
ఆహ్వానాన్ని
రద్దు
చేశారు.


