Andhra Pradesh
oi-Sai Chaitanya
స్పైడర్‌మ్యాన్
వంటి
సూపర్
హీరోల
కంటే
మన
పురాణాల
గురించి
పిల్లలకు
చెప్పాలని
ఏపీ
సీఎం
చంద్రబాబు
సూచించారు.
భారతీయులు
భవిష్యతుల్లో
ప్రపంచాన్ని
శాసిస్తారనడంలో
సందేహం
లేదని
ధీమా
వ్యక్తం
చేసారు.
2047
నాటికి
అతిపెద్ద
ఆర్థిక
వ్యవస్థగా
ఎదుగుతామని
చెప్పారు.మన
దేశంలో
నాలెడ్జ్‌కు
కొదవలేదని
అలానే
దేశాభివృద్ధిలో
అనేక
రంగాలు
మిళితమై
ఉన్నాయని
చెప్పారు.
తిరుపతిలో
నిర్వహించిన
భారతీయ
విజ్ఞాన
సమ్మేళంలో
చంద్రబాబు
కీలక
ప్రసంగం
చేసారు.
పేద
రికం
లేని
దేశంగా
భారత్
అభివృద్ధి
చెందాలని
ఆకాంక్షించారు.
1991లో
ఆర్థిక
సంస్కరణల
తర్వాత
అత్యంత
కీలక
మార్పులు
చోటు
చేసుకున్నాయని
ఇంకా
మన
దేశంలో
ప్రధాని
మోదీ
నాయకత్వంలో
స్థిరమైన
ప్రభుత్వం
ఉందని
సీఎం
చంద్రబాబు
అన్నారు.
2038
నాటికి
మూడో
అతిపెద్ద
ఆర్థిక
వ్యవస్థగా
భారత్
అవతరించనుందని
2047
నాటికి
ప్రపంచ
శక్తిగా
ఆవిర్భవిస్తుంద
తెలిపారు.
మన
దేశం
పేరు
మార్మోగిపోతుందని,
ఇప్పటికే
ప్రపంచంలో
ఎక్కడికి
వెళ్లినా
భారతీయులే
ఉన్నారని
కొనియాడారు.
దశాబ్ద
కాలంగా
చాలా
దేశాల్లో
జనాభా
తగ్గుతుండగా
భారత్‌లో
మాత్రమే
పెరుగుతోందని
వెల్లడించారు.
హాలీవుడ్‌లో
హీరోల
కంటే
మన
పురాణాల్లోని
పురుషులు
గొప్ప
వారని
మన
పిల్లలకు
చెప్పాల్సిన
అవసరం
ఉందన్నారు.
సూపర్
మ్యాన్,
స్పైడర్
మ్యాన్
కంటే
మన
హనుమంతుడు
బలవంతుడని
వారికి
చెప్పాల్సిన
బాధ్యత
మనపై
ఉందని
నొక్కి
చెప్పారు.
బ్యాట్
మ్యాన్,
ఐరన్
మ్యాన్
కంటే
మహాభారతంలో
అర్జునుడు
మహాయోధుడని
వివరించి
చెప్పాల్సిన
అవసరం
ఉందన్నారు.
కృష్ణుడు,
మహాశివుడి
మహత్యాల
గురించి
పిల్లలకు
వివరించాలని
తెలిపారు
చంద్రబాబు.
శ్రీరాముడిని
మించిన
మర్యాద
పురుషోత్తముడు
లేడని
వారికి
అర్థమయ్యేలా
వివరించాలన్నారు.
అవతార్
సినిమా
కంటే
మన
మహాభారతం
గొప్పదని
మన
పిల్లలకు
చెప్పాల్సి
ఉందని
సూచించారు.
కంసుడు
లాంటి
రాక్షసుల
గురించి
కూడా
వారికి
తెలియాల్సి
ఉందన్నారు.
అప్పుడే
మన
పిల్లలు
మంచికి,
చెడుకి
మధ్య
ఉన్న
వ్యత్యాసం
తెలుసుకోగలరని
ఈ
సందర్భంగా
ఆయన
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
మైథాలజీ
గురించి
అందరూ
మరిచిపోయే
సమయంలో
ఎన్టీఆర్
పోషించిన
పాత్రలో
మళ్లీ
విలువల
గురించి
సమాజానికి
తెలియజేసిందని
సీఎం
చంద్రబాబు
పేర్కొన్నారు.
మానసిక
ఒత్తిడిని
అధిగమించడంలో
యోగాది
కీలకపాత్రని
చెప్పారు.
యోగా
ద్వారా
భారతదేశం
యూనివర్సల్
హెల్త్‌ను
అందించిందన్నారు.
జీరోను
భారతీయులే
కనిపెట్టారని
గుర్తు
చేశారు.
చెస్
ఆట
సైతం
మనదేనని
వివరించారు.
భారతీయ
కుటుంబ
జీవితం
మన
దేశంలో
మాత్రమే
ఉందన్నారు.
ఇది
భద్రతతో
పాటు
జీవితాల్లో
వెలుగునిస్తోందని
పేర్కొన్నారు.
ప్రతి
జంట
ముగ్గురు
పిల్లలను
కనేలా
ప్రణాళిక
చేసుకోవాలని
సూచించారు.
సౌర,
పవన
విద్యుత్తుపై
అధికంగా
దృష్టి
పెడుతున్నామని
వివరించారు.
ఆరు
నెలల్లో
క్వాంటమ్
కంప్యూటర్
అమరావతి
నుంచి
ఆపరేట్
చేయబోతున్నామని
ఈ
సందర్భంగా
సీఎం
చంద్రబాబు
ప్రకటించారు.
క్వాంటమ్
కంప్యూటర్‌ను
తయారు
చేయడానికీ
చర్యలు
చేపడుతున్నామని
తెలిపారు.
ప్రపంచంలో
అత్యధిక
వేతనాలను
భారతీయులు
పొందుతున్నారని
చెప్పారు.


