India
oi-Sai Chaitanya
విమాన
ప్రయాణీకులకు
ఇండిగో
అదిరిపోయే
ఆఫర్
ఇచ్చింది.
ప్రయాణీకులను
ఆకట్టుకొనేందుకున్యూ
ఇయర్
సేల్‌ను
ప్రారంభించింది.
ఈ
సేల్‌కు
Sail
Into
2026
అని
పేరు
పెట్టారు.
ఈ
ఆఫర్
కింద
డొమెస్టిక్,
ఇంటర్నేషనల్
ఫ్లైట్
టిక్కెట్లపై
భారీ
డిస్కౌంట్లను
ప్రకటించింది.
ఈ
ఆఫర్
లో
భాగంగా
డొమెస్టిక్
వన్-వే
ఛార్జీలు
కేవలం
రూ.1,499
నుండి
ప్రారంభం
కానున్నాయి.
అదే
వెంగా
అంతర్జాతీయ
ఛార్జీలు
రూ.4,499
నుండి
ప్రారంభమవుతాయని
ప్రకటించింది.
ఇండిగో
ప్రకటించి
ప్లాన్
ప్రకారం
ఈ
ఆఫర్
జనవరి
13
నుండి
జనవరి
16
వరకు
ఓపెన్
ఉంటుందని
వెల్లడించింది.
కాగా,
ఈ
ఆఫర్
కింద
బుక్
చేసుకున్న
టిక్కెట్లు
జనవరి
20
నుంచి
ఏప్రిల్
30
మధ్య
ప్రయాణానికి
చెల్లుబాటు
కానున్నాయి.
ఆఫర్
లో
భాగంగా
డొమెస్టిక్
ఫ్లైట్
వన్-వే
ఛార్జీలు
రూ.1,499,
ఇంటర్నేషనల్
మార్గాలలో
వన్-వే
ఛార్జీలు
రూ.4,499
నుండి
ప్రారంభం
కానున్నాయి.
ఎక్కువ
లెగ్‌రూమ్
సౌకర్యాన్ని
అందించే
ఇండిగో
స్ట్రెచ్
సీట్లు
ఎంపిక
చేసిన
డొమెస్టిక్
రూట్లలో
రూ.9,999
నుండి
ప్రారంభమవుతాయి.
ఇక..
చిన్న
పిల్లలతో
ప్రయాణించే
తల్లిదండ్రు
లకు
బ్రహ్మండమైన
ఆఫర్
ఇచ్చింది.
రెండేళ్లు
అంతకంటే
తక్కువ
ఉన్నవారికి
దేశీయ
విమాన
టికెట్‌ను
కేవలం
రూ.1కి
బుక్
చేసుకోవచ్చని
ప్రకటించింది.
ఇక..
ఈ
న్యూ
ఇయర్
సేల్
టిక్కెట్లపై
మాత్రమే
కాకుండా
అదనపు
సౌకర్యాలపై
కూడా
డిస్కౌంట్లు
అందిస్తున్నట్లు
వెల్లడించింది.
కొన్ని
6E
యాడ్-ఆన్‌లు
70
శాతం
వరకు
తగ్గింపుతో
లభిస్తాయి.
ప్రీపెయిడ్
అదనపు
బ్యాగేజీపై
50
శాతం
వరకు
తగ్గింపుతో
పాటు,
ఎంపిక
చేసిన
రూట్‌లలో
స్టాండర్డ్
సీట్
సెలెక్షన్‌లపై
15
శాతం
వరకు
తగ్గింపుతో
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
ఎమర్జెన్సీ
XL
సీట్లు
కూడా
ఎంపిక
చేసిన
దేశీయ
రూట్‌లలో
రూ.500
నుండి
ప్రారంభమవుతాయి.
ఆఫర్
వినియోగించుకొనే
వారు
తమ
టిక్కెట్లను
ఇండిగో
అధికారిక
వెబ్‌సైట్,
మొబైల్
యాప్,
AI
అసిస్టెంట్
6ESkai
తో
పాటుగా
ఎంపిక
చేసిన
ట్రావెల్
పార్టనర్
ప్లాట్‌ఫామ్‌ల
ద్వారా
టిక్కెట్లను
బుక్
చేసుకోవచ్చని
సూచించింది.


