ఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే, సమీక్షకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ను పీఎంవో పిలవలేదని సమాచారం.


