Cinema
oi-Korivi Jayakumar
చిత్రపరిశ్రమలో
ప్రస్తుతం
తీవ్రవివాదాస్పదంగా
మారిన
విషయం
పని
గంటలు.
బాలీవుడ్
స్టార్
హీరోయిన్
దీపికా
పదుకొణే
ఇటీవల
“రోజుకు
ఎనిమిది
గంటల
పని’
అంటూ
చేసిన
వ్యాఖ్యలు
ఇప్పుడు
దేశవ్యాప్తంగా
పెద్ద
చర్చకు
దారి
తీశాయి.
ప్రసవం
తర్వాత
వర్క్-లైఫ్
బ్యాలెన్స్
ఎంతో
కష్టమని..
ఆరోగ్యం
ముఖ్యమైతే
ఎనిమిది
గంటల
పని
సరిగా
చేస్తే
చాలు.
అతిగా
వర్క్
చేయడం
మంచిది
కాదు
అని
స్పష్టం
చేశారు.
ఈ
కారణం
వల్లే
ఆమెను
స్పిరిట్,
కల్కి
2
చిత్రాల
నుంచి
మేకర్స్
తొలగించారు.
దీంతో
మిగతా
రంగాల
తరహాలోనే
ఇండస్ట్రీలోనూ
నిర్ణీత
పని
గంటలు
ఉండాలనే
అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.ఈ
క్రమంలోనే
దీపికా
వ్యాఖ్యలకు
పలువురు
హీరోయిన్స్
సైతం
మద్దతు
తెలుపుతూ
మాట్లాడారు.
మరికొందరు
మాత్రం
ఆమె
కామెంట్స్
ఖండిస్తున్నారు.
ఇప్పుడు
లేటెస్ట్
గా
టాలీవుడ్
యంగ్
హీరో
రానా
దగ్గుబాటి
ఈ
వ్యవహారంపై
పరోక్షంగా
స్పందించారు.
ఈ
క్రమంలోనే
హాట్
కామెంట్స్
చేయడం
సినీవర్గాల్లో
కొత్త
చర్చకు
తెరలేపింది.
రానా
ఏమన్నారంటే..
మిగతా
రంగాలతో
పోలిస్తే
సినిమా
రంగం
భిన్నమైందని
రానా
గుర్తుచేశారు.
నటన
అంటే
ఉద్యోగం
కాదని..
ఇన్ని
గంటలే
చేయాలని
నిర్వచించడం
కష్టమని
రానా
చెప్పుకొచ్చారు.
రోజుకు
8
గంటలు
కదలకుండా
కూర్చొని
పనిచేస్తే
అద్భుతమైన
ఔట్
పుట్
రావడానికి
యాక్టింగ్
అనేది
ప్రాజెక్ట్
కాదని
వ్యాఖ్యానించారు.
నటన
అనేది
ఓ
లైఫ్
స్టైల్
అని..
నటులు
దీనిని
నిత్యజీవితంలో
భాగంగా
చేసుకోవాలని
అన్నారు.
ఈ
లైఫ్
స్టైల్
కొనసాగించాలా?
వద్దా?
అనేది
పూర్తిగా
ఎవరికి
వారు
నిర్ణయించుకోవాల్సిందేనని
చెప్పారు.
అంతే
కాకుండా
సినిమా
ఒక
టీమ్
కట్టుబాటుపై
ఆధారపడి
ఉంటుందని..
అందరూ
కలిసి
అంకితభావంతో
పనిచేయాల్సిన
అవసరం
ఉందని
స్పష్టం
చేశారు.
ఒక
గొప్ప
సీన్
రావాలంటే
కెమెరా
నుంచి
లైటింగ్
వరకు,
నటీనటుల
నుంచి
టెక్నీషియన్ల
వరకూ
అందరూ
సమయం
పట్టించుకోకుండా
పనిచేయాలన్నారు.
ఇక్కడ
8
గంటల
రూల్
పెట్టేయడం
ప్రాక్టికల్‌గా
కరెక్ట్
కాదని
రానా
అభిప్రాయపడ్డారు.
దుల్కర్
సల్మాన్
రియాక్షన్..
అలానే
మలయాళ
స్టార్
హీరో
దుల్కర్
సల్మాన్
కూడా
ఈ
విషయంపై
ఓపెన్
అయ్యారు.
తెలుగు,
మలయాళం,
తమిళ
ఇండస్ట్రీలో
తన
వర్క్
ఎక్స్
పీరియన్స్
గురణచి
చెబుతూ..
మళయాళంలో
ఉదయం
షూటింగ్
ప్రారంభమయ్యాక
ఎప్పుడు
పూర్తవుతుందో
ఎవరికీ
తెలియదన్నారు.
తమిళ
ఇండస్ట్రీలో
మాత్రం
నటీనటులకు
ప్రతి
నెలా
రెండు
ఆదివారాలు
సెలవు
ఇస్తారని
వివరించారు.
తెలుగు
ఇండస్ట్రీ
విషయానికి
వస్తే..
మహానటి
సినిమా
షూటింగ్
సమయంలో
కొన్నిసార్లు
తాను
సాయంత్రం
6
గంటలకే
ఇంటికి
వెళ్లిన
సందర్భాలు
ఉన్నాయని
గుర్తుచేసుకున్నారు.
ఒకేరోజు
అతిగా
పనిచేయడం
కంటే..
రోజూ
కొంచెం
అదనంగా
పనిచేయడం
బెస్ట్
అని
వెల్లడించారు.


