ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రిక మార్పులు తీసుకువస్తున్నారు. అధిక సంతానం కనే దంపతులకు బంపర్ బహుమతులను ప్రకటించారు. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ దిశగా కీలక అడుగులు వేస్తున్న వేళ చంద్రబాబు శాసనసభలో సంచలన ప్రకటన చేశారు.

ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ.25 వేలు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్న నూతన విధానం ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యత అంశం కాగా ఇప్పుడు జనాభా పెరగడం అవసరంగా భావించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఏపీలో పడిపోయిన సంతానోత్పత్తి రేటు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం ఏపీలో సంతాన ఉత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయింది. సుస్థిర అభివృద్ధికి ఇది 2.1 శాతంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 2004 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23 శాతానికి చేరుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన భారం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడవ బిడ్డ పుడితే తండ్రికి రెండు నెలల పాటు పెయిడ్ లీవ్

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులకు కాన్పు సమయంలో 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా ఇవ్వనున్నారు.అంతేకాదు రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒక నెల రోజులు, మూడవ బిడ్డ పుడితే తండ్రికి రెండు నెలల పాటు పెయిడ్ లీవ్ మంజూరు చేస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా జనాభా పెరుగుదల కోసం అందిస్తున్న ఈ పథకం ఏపీ పురోగతికి దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆలోచన

దక్షిణ భారత రాష్ట్రాలలో జనాభా తగ్గడం వలన భవిష్యత్తులో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే నెల రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ డ్రాఫ్ట్ పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు.

జనాభా నిర్వహణలో దేశంలోనే రోల్ మోడల్ గా ఏపీ

జనాభా నిర్వహణలో దేశంలోనే ఏపీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని చంద్రబాబు సర్కార్ ఆశిస్తున్న క్రమంలో తాజాగా అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇది భవిష్యత్తుపై ముందు చూపుతోనే చేశారని భావిస్తున్నారు. మరి ప్రజల నుండి చంద్రబాబు ఇచ్చిన బంపర్ ఆఫర్ కు రెస్పాన్స్ ఎలా వస్తుందో వేచి చూడాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Interpol Debut New Song “See Out Loud” at São Paulo Concert: Watch

Well, that didn’t take long at all: Mere weeks...

Jorginho Frello Calls Out Chappell Roan for Leaving His Daughter in Tears

Italian football star Jorginho Frello publicly criticized Chappell Roan...

Olivia Rodrigo says “experimental” new album is full of “sad love songs”

Olivia Rodrigo has teased that her “experimental” new album...