ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్‌ చాటింగ్‌ చేస్తుంటారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌..!

Date:


oi
-Suravarapu Dileep

సోషల్‌ మీడియా చిన్నారులపై చెడు ప్రభావం చూపుతోందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా 16 ఏళ్లలోపు చిన్నారులకు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో తొలిసారి కర్ణాటక ఈ తరహా ప్రకటన చేసింది. 16 ఏళ్లలోపు చిన్నారులకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా 13 ఏళ్లలోపు చిన్నారులు సోషల్‌ మీడియా వినియోగించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 90 రోజుల గడువు విధిస్తున్నట్లు చెప్పారు. అయితే 13 నుంచి 16 ఏళ్ల వయస్కుల విషయంలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కీలక నిర్ణయం :
దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో అసభ్యకర కంటెంట్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక మధ్యమాల్లో చెడు కంటెంట్‌ వ్యాప్తిని కట్టడి చేయాలని ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, నిపుణుల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మెటా నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కీలక నిర్ణయం తీసుకుంది.

మే 8 వ తేదీన :
తాజాగా తన బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (E2EE) సపోర్టును నిలిపేస్తామని తెలిపింది. డిసెంబర్ 2023 లో ఈ ఫీచర్‌ను ఇన్‌స్టా తీసుకొచ్చింది. అయితే కొత్త నిర్ణయం మే 8 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

చాట్‌ డౌన్‌లోడ్‌ :
ఈ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును నిలిపేసిన అనంతరం యూజర్ల చాట్‌ను మెటా చూసేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై మెటా సంస్థ ఇన్‌స్టా యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఫీచర్‌ తొలగింపుతో ప్రభావితమయ్యే యూజర్లకు.. చాట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని మెటా తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ పాత వెర్షన్‌ను వినియోగిస్తుంటే.. చాట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు వీలుగా యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఇన్‌స్టాలో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను ఎందుకు తొలగిస్తారనే అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇన్‌స్టాలో E2EE ఫీచర్‌ తొలగింపు నేపథ్యంలో ఫేస్‌బుక్ మెసేంజర్‌లో ఈ ఫీచర్‌ ఉంటుందా లేదా తొలగిస్తారనే అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. యూజర్లకు ప్రైవసీ ప్రొటెక్షన్‌ కోసం తీసుకొచ్చిన E2EE ఫీచర్‌ను అసలు ఎందుకు తొలగిస్తున్నారు.?

వ్యక్తిగత చాట్‌ యాక్సెస్‌ :
ప్రస్తుతం అసభ్యకర కంటెంట్‌ అధికంగా వ్యాప్తి చెందుతోంది. ఇన్‌స్టాలో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును తొలగిస్తే.. యూజర్ల వ్యక్తిగత చాట్‌ను విశ్లేషించేందుకు యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థకు అవకాశం ఉంటుంది. ఫలితంగా అసభ్యకర, చిన్నారులను వేధింపులకు గురి చేసే కంటెంట్‌ను సులభంగా గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.

హానికర, అభ్యంతరకర కంటెంట్‌పై నిఘా పెట్టి, తొలిగించేందుకు అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ (EU) వంటి దేశాలు సామాజిక మధ్యమ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. EU ప్రతిపాదించిన చాట్‌ కంట్రోల్‌ రెగ్యులేషన్‌, బ్రిటన్‌ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ సేఫ్టీ యాక్ట్ 2023 వంటి బిల్లులు చట్టాలుగా మారితే.. యూజర్ల ప్రైవేట్ చాట్‌పై నిఘా పెట్టేలా ఆదేశాలు చేసేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది.

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ సపోర్టును తొలగిస్తే.. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం లేదా హ్యాకర్లు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. డేటా లీక్‌లకు కూడా అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related