India
oi-Oneindia Staff
మనం
పనిచేసేచోట
మేనేజర్
లు
ఒక్కో
విధంగా
ప్రవర్తిస్తుంటారు.
కొందరు
ఉద్యోగులతో
కోపంగా,
చీటికిమాటికి
చిరాకుపడుతూ
తమకు
తామే
కంపెనీ
సీఈఓ,
ఫౌండర్
అన్న
రేంజ్
లో
ఫీల్
అవుతుంటారు.
మరికొందరు
ఉద్యోగులను
అర్థం
చేసుకుంటూ,
వారి
మీద
జోకులు
వేస్తూ
స్నేహపూర్వకంగా
వ్యవహరించే
బాస్
లేదా
మేనేజర్
దొరకడం
చాలా
అరుదు.
అయితే
బెంగళూరులో
ఒక
బాస్
చేసిన
చిన్న
పని
అక్కడి
ఉద్యోగులను
ఎంతో
సంతోషపెట్టింది.అంతేకాదు,
ఇలాంటి
బాస్
ఉంటే
బాగుంటుందని
నెటిజన్లు
కూడా
అభిప్రాయపడుతున్నారు.
ఆ
బాస్
ఎవరు?
ప్రస్తుతం
వైరల్
అవుతున్న
ఆ
వీడియోలో
ఏముంది?
బెంగళూరులోని
ఒక
కంపెనీ
యజమాని
ఉద్యోగులకు
ఇచ్చిన
చిన్న
సర్ప్రైజ్
అందరి
మనసులను
గెలుచుకుంది.
ఆ
కంపెనీ
ఉద్యోగులే
కాకుండా,
వివిధ
కార్పొరేట్
రంగాల్లో
పనిచేసే
ఉద్యోగులు
కూడా
ఈ
ఘటనను
అభినందిస్తున్నారు.
ఒక
ఉద్యోగి
ఇన్స్టాగ్రామ్
ఖాతాకు
2,000
మంది
ఫాలోవర్లు
చేరుకున్న
సందర్భంగా,
బాస్
ఆమెకు
కేక్
ఇచ్చి
ప్రత్యేకంగా
అభినందించారు.
ఆ
ఉద్యోగిని
సోషల్
మీడియాలో
షేర్
చేసిన
వీడియోను
చూసిన
నెటిజన్లు,
కంపెనీలో
ఉన్న
సానుకూల
వాతావరణం,
మంచి
వైబ్‌ను
ఇది
అద్భుతంగా
తెలియజేస్తుందని
చెప్తున్నారు.
Credits:
dentist_in_corporate
Instagram
వైరల్
గా
మారిన
వీడియోలో,
ఐశ్వర్య
కంపెనీ
మీటింగ్
హాల్
లోకి
వస్తుండగా
తన
ఎంట్రీని
రికార్డ్
చేస్తున్నవారిని
చూసి
ఆమె
ఆశ్చర్యపోయింది.
ఆమె
బాస్,
టీమ్
మెంబెర్స్
లోపల
కూర్చుని
ఉన్నారు.
టేబుల్
మీద
ఒక
కేక్
ఉంచారు.
బోర్డు
మీద,
“2k
ఫాలోవర్స్
రీచ్
అయ్యినందుకు
సంతోషంగా
ఉంది.
అభినందనలు
ఐషు”
అని
రాసి
ఉంది.
ఈ
వీడియో
సోషల్
మీడియాలో
బాగా
వైరల్
అయ్యింది.
ఇది
చిన్న
సెలబ్రేషన్
అయినప్పటికీ,
ఇలాంటి
సానుకూల
వాతావరణం
ఉండే
కంపెనీలో
ఉంటే
ఎలాంటి
చికాకు
ఉండదని
నెటిజన్లు
అభిప్రాయపడుతున్నారు.
అలాంటి
కార్యాలయాల్లో
ఉద్యోగులు
ఆనందంగా
పని
చేస్తూ,
తమ
పనిని
మరింత
ఆసక్తితో
చేయగలుగుతారని
వారు
వ్యాఖ్యానించారు.
ఈ
వైరల్
వీడియోపై
నెటిజన్లు
మిశ్రమ
స్పందనలు
వ్యక్తం
చేస్తున్నారు.
కొందరు
“మీరు
నిజంగా
అదృష్టవంతులు,
మనందరికీ
ఇలాంటి
బాస్
దొరకరు”
అంటూ
వ్యాఖ్యానించగా,
మరికొందరు
“మా
కంపెనీ
ఈ
వీడియో
చూస్తే
ఇది
AIతో
చేసిన
వీడియో
అంటుంది”
అంటూ
సరదాగా
కామెంట్లు
చేస్తున్నారు.


