ఇరాన్ లో షాకింగ్.. నోబెల్ గ్రహీతకు ఆరేళ్ల జైలు శిక్ష..

Date:


International

oi-Bomma Shivakumar

ఇరాన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇరాన్ లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గిస్ మొహమ్మదికి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం.. దేశ భద్రతకు కలిగించారనే ఆరోపణలతో ఈ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె జైలులోనే ఉండగా.. అనారోగ్యం దృష్ట్యా ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల సంఘాలు నినదిస్తున్నాయి.

ఇరాన్ కోర్టు నోబెల్ శాంతి బహుమతి విజేత నార్గెస్ మొహమ్మదీకి ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె తరపు న్యాయవాది ఆదివారం పేర్కొన్నారు. ‘నేరాలు చేయడానికి గుమిగూడటం, కుట్ర పన్నడం వంటి ఆరోపణలపై ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష పడినట్లు’న్యాయవాది మోస్తఫా నిలీ తెలిపారు. దీనితో పాటు ఆమెపై రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా నిషేధం కూడా విధించినట్లు పేర్కొన్నారు.

ప్రచార కార్యకలాపాలకు పాల్పడినందుకు మొహమ్మదీకి మరో ఒకటిన్నర సంవత్సరం జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే తూర్పు ప్రావిన్స్‌ లోని ఖోస్ఫ్ నగరానికి రెండేళ్లపాటు బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఇరాన్ లోని చట్టం ప్రకారం.. జైలు శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆమెకు చికిత్స అందించడానికి తాత్కాలికంగా ‘బెయిల్‌ పై విడుదల’ చేస్తారని ఆశిస్తున్నట్లు నిలీ పేర్కొన్నారు. ఈ తీర్పు ఇంకా తుది నిర్ణయం కాదని.. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

గత పాతికేళ్లుగా మొహమ్మదీ ఇరాన్‌ లో మరణశిక్షలకు వ్యతిరేకంగా అలాగే మహిళల డ్రెస్ కోడ్‌ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె పలుమార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. 2023 లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించినప్పుడు కూడా ఆమె జైలులోనే ఉండటం గమనార్హం. ఆ సమయంలో ఆమె పిల్లలు మొహమ్మదీ తరపున అవార్డును అందుకున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Harry Styles’ ‘Kiss All the Time. Disco, Occasionally’ Is Number One

Kiss All the Time. Disco, Occasionally. marks the pop...

Corinne Bailey Rae, Ravyn Lenae Appear During Billboard House @ SXSW

Singers Corinne Bailey Rae and Ravyn Lenae joined Billboard‘s...