International
oi-Bomma Shivakumar
రష్యా
మరోసారి
ఉక్రెయిన్
పై
దాడులకు
పాల్పడింది.
డ్రోన్
లు,
మిసైల్స్
తో
ఉక్రెయిన్
లోని
పలు
ప్రాంతాలపై
విరుచుకుపడింది.
ఉక్రెయిన్
లోని
కీవ్,
ఖార్ఖివ్
నగరాల్లో
ఈ
దాడులు
చేపట్టింది
రష్యా.
మరోవైపు
అమెరికా-
ఉక్రెయిన్-
రష్యా
మధ్య
త్రి
సభ్య
సమావేశం
జరుగుతున్న
నేపథ్యంలో
ఈ
దాడులు
జరగడం
గమనార్హం.
అధికారులు
తెలిపిన
వివరాల
ప్రకారం..
రష్యా
దాడుల్లో
ఒకరు
మృతి
చెందగా
మరో
15
మందికి
గాయాలయ్యాయి.
మూడేళ్లకుపైగా
భీకర
యుద్ధం
రష్యా-
ఉక్రెయిన్
మధ్య
మూడేళ్లకుపైగా
భీకర
యుద్ధం
కొనసాగుతూనే
ఉంది.
ఇరు
దేశాల
మధ్య
చర్చలు
జరుగుతున్నా
మరోవైపు
దాడులు
కొనసాగుతూనే
ఉన్నాయి.
తాజాగా
ఉక్రెయిన్
పై
రష్యా
మరోసారి
విరుచుకుపడింది.
ఉక్రెయిన్
లోని
ప్రధాన
నగరాలైన
కీవ్,
ఖార్ఖివ్
నగరాల్లో
ఈ
దాడులు
చేపట్టింది
రష్యా
సైన్యం.
ఈ
డ్రోన్
దాడుల్లో
ఒకరు
మృతి
చెందగా
మరో
15
మందికి
గాయాలయ్యాయి.
ఇక
ఈ
దాడులపై
ఉక్రెయిన్
విదేశాంగ
మంత్రి
ఆండ్రీ
సిబిహా
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ఓ
పక్క
శాంతి
చర్చలు
జరుగుతున్నా..
త్రిసభ్య
సమావేశం
జరుగుతున్నా..
ఉక్రెయిన్
ప్రజలకు
మాత్రం
మరో
నిద్ర
లేని
రాత్రిగా
ఈ
రోజు
మిగిలింది..
అని
పేర్కొన్నారు.
త్రైపాక్షిక
సమావేశం
ఇదిలాఉండగా
యూఏఈలో
జనవరి
23నుండి
అమెరికా,
రష్యా,
ఉక్రెయిన్
దేశాల
మధ్య
తొలి
త్రైపాక్షిక
సమావేశం
జరగనుంది.
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్
స్కీ
దావోస్
అంతర్జాతీయ
సదస్సు
వేదికగా
ఈ
విషయాన్ని
ఇటీవల
ప్రకటించారు.
ఈ
మేరకు
రెండు
రోజుల
పాటు
ఈ
త్రైపాక్షిక
సమావేశం
జరగనుంది.
2022లో
రష్యా-
ఉక్రెయిన్
మధ్య
యుద్ధం
ప్రారంభమైన
తర్వాత
మొదటిసారిగా
అమెరికా,
రష్యా,
ఉక్రెయిన్
ప్రతినిధులు
ఒకే
వేదికపై
చర్చలు
నిర్వహించనున్నారు.
మరోవైపు
రష్యా-
ఉక్రెయిన్
యుద్ధం
నేపథ్యంలో
దావోస్
సదస్సులో
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్,
జెలెన్
స్కీలు
భేటీ
అయ్యారు.
ఈ
సమావేశం
అనంతరం
ట్రంప్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ఇరు
దేశాల
మధ్య
ముడేళ్లకుపైగా
కొనసాగుతున్న
యుద్ధం
ముగియాలని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
వేలాది
మంది
ప్రాణాలు
కోల్పోయారని
పేర్కొన్నారు.


