Telangana
oi-Sai Chaitanya
ఉచిత
బస్సు
ప్రయాణం
పైన
ప్రభుత్వం
మరో
కీలక
నిర్ణయం
తీసుకుంది.
తెలంగాణలో
ఉచిత
బస్సు
ప్రయాణం
పథకానికి
ఆదరణ
పెరుగుతోంది.
పెద్ద
సంఖ్యలో
మహిళలు
ఈ
పథకాన్ని
సద్వినియోగం
చేసుకుంటున్నారు.
ఇప్పటి
వరకు
ప్రయాణ
సమయంలో
ఆధార్
కార్డును
ఎక్కువ
మంది
గుర్తింపు
కార్డుగా
వినియోగిస్తున్నారు.
కాగా,
ఇప్పుడు
ప్రయాణీకులకు
ఇక
నుంచి
ఆధార్
తో
అవసరం
లేకుండా
కొత్త
విధానం
అమల్లోకి
తెచ్చేందుకు
కసరత్తు
జరుగుతోంది.
దీని
ద్వారా
టికెట్..
ఆధార్
లేకుండా
ఈ
కొత్త
నిర్ణయం
మేరకు
ఉచిత
ప్రయాణం
కొనసాగించే
వెసులుబాటు
మహిళా
ప్రయాణీకులకు
దక్కనుంది.
తెలంగాణలో
ఉచిత
బస్సు
ప్రయాణ
పథకం
అమలు
ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా
భావిస్తోంది.
నిరంతరం
సమీక్ష
చేస్తోంది.
పథకాన్ని
మరింత
విస్తరించేలా
కార్యాచరణ
అమలు
చేస్తోంది.
ఇప్పటి
వరకు
మహిళలు
ఆధార్
కార్డు
చూపించిన
తర్వాత
కండక్టర్
నుంచి
జీరో
టికెట్
తీసుకుని
ఆర్టీసీ
బస్సుల్లో
ఫ్రీగా
ప్రయాణించవచ్చు.
అయితే
కొంతమంది
మహిళల
ఆధార్
కార్డుల్లో
పాత
ఫొటోలు
ఉండటంతో
కండక్టర్లు
అలాంటి
వారిని
నిర్ధారించుకోవడం
కష్టంగా
మారింది.దీంతో
ఈ
సమస్యను
తొలగించేందుకు
ప్రభుత్వం
కీలక
నిర్ణయం
తీసుకుంది.
ఇందుకోసం
సెంటర్
ఫర్
గుడ్
గవర్నెన్స్‌తో
కీలక
ఒప్పందం
చేసుకుంది.
ఈ
సంస్థ
సహాకరంతో
ప్రతీ
మహిళకు
ప్రత్యేక
కార్డులు
పంపిణీ
చేయనున్నారు.
ఈ
కార్డును
రాష్ట్రంలోని
మహిళలందరికీ
వీలైనంత
త్వరగా
పంపిణీ
చేయాలని
ప్రభుత్వం
నిర్ణయించింది.
ప్రభుత్వం
తీసుకొచ్చే
ఈ
స్మార్ట్
కార్డు
చూపించి
మహిళలు
ఇకపై
ఆర్టీసీ
బస్సుల్లో
ప్రయణం
చేసే
విధంగా
నిర్ణయం
తీసుకున్నారు.
దీని
ద్వారా
ఇక
నుంచి
ఆధార్
కార్డు
చూపించి
టికెట్
తీసుకునే
అవసరం
ఉండదు.
టికెట్
లేకుండానే
ఈ
కార్డు
చూపించి
ఎక్కడికైనా
వెళ్లోచ్చు.
తాజాగా
ఆర్టీసీ
అధికారులతో
డిప్యూటీ
సీఎం
భట్టి
విక్రమార్క,
మంత్రి
పొన్నం
ప్రభాకర్
భేటీ
అయ్యారు.
ఈ
సందర్భంగా
అర్హులైన
మహిళలందరికీ
త్వరగా
స్మార్ట్
కార్డులు
చేరేలా
చర్యలు
తీసుకోవాలని
ఆర్టీసీ
అధికారులను
ఆదేశించారు.
అలాగే
త్వరలో
పీఎం
ఈ
డ్రైవ్
కార్యక్రమంలో
భాగంగా
హైదరాబాద్‌కు
2,800
ఎలక్ట్రిక్
బస్సులు
రానున్నాయి.
మహిళలకు
ఉచిత
బస్సు
ప్రయాణంతో
ఆర్టీసీకి
రూ.255
కోట్ల
లాభం
వచ్చిందని
వివరించారు.
ప్రస్తుతం
బెంగళూరు,
ముంబయి,
లక్నో
నగరాల్లోని
బస్సుల్లో
స్మార్ట్‌కార్డు
విధానాల్లో
ఎలాంటి
ఫీచర్లు
అమలు
చేస్తున్నారనే
అంశం
పైన
అధికారులు
అధ్యయనం
చేస్తున్నారు.
త్వరలోనూ
ఇక్కడా
అమల్లోకి
తేనున్నారు.


