International
oi-Bomma Shivakumar
పహల్గాం
ఉగ్రదాడి,
ఆపరేషన్
సింధూర్
తర్వాత
భారత్,
పాకిస్థాన్
మధ్య
ఉద్రిక్త
వాతావరణం
నెలకొంది.
ఇరు
దేశాల
మధ్య
సత్సంబంధాలు
క్షీణించాయి.
ఈ
నేపథ్యంలో
భారత్
–
పాకిస్థాన్
తమ
అణు
శక్తి
కేంద్రాల
సమాచారాన్ని
పంచుకున్నాయి.
దాదాపు
మూడు
దశాబ్దాలగా
వస్తున్న
ఒప్పందం
ప్రకారం
వార్షిక
అణు
కేంద్రాల
జాబితాను
ఇరు
దేశాలు
ఇచ్చి
పుచ్చుకున్నాయి.
ఇరు
దేశాలు
ఒకదాన్నొకటి
అణ్వాయుధాలతో
దాడులు
చేసుకోవడాన్ని
నిషేధిస్తూ
భారత్-
పాకిస్థాన్
మధ్య
ఈ
ఒప్పందం
జరిగింది.
భారత్-
పాకిస్థాన్
మధ్య
ఇటీవలి
కాలంలో
సంబంధాలు
క్షీణించిన
విషయం
తెలిసిందే.
ఈ
క్రమంలో
తాజాగా
ఇరు
దేశాలు
తమ
వార్షిక
అణ్వాయుధ
సమాచారాన్ని
ఇచ్చిపుచ్చుకున్నాయి.
దాదాపు
మూడు
దశాబ్దాలగా
వస్తున్న
ఒప్పందం
ప్రకారం
ఈ
దేశాలు
తమ
అణ్వాయుధాల
సమాచారాన్ని
ట్రాన్స్
ఫర్
చేసుకున్నాయి.
ఈ
విషయాన్ని
భారత
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ
స్పష్టం
చేసింది.
ఇదే
విషయంపై
భారత్-
పాకిస్థాన్
మధ్య
డిసెంబర్
31,
1988లో
ఒప్పందం
జరిగింది.
ఆ
విధానం
జనవరి
27,
1991
నుంచి
అమల్లోకి
వచ్చింది.
ఇలా
రెండు
దేశాలు
తమ
అణుశక్తి
కేంద్రాల
సమాచారాన్ని
ఇచ్చి
పుచ్చుకోవడం
ఇది
వరుసగా
35వ
సారి
అని
భారత
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ
స్పష్టం
చేసింది.
జనవరి
1,
1992
నుంచి
ఈ
విధానం
కొనసాగుతోందని
పేర్కొంది.
ఈ
ఒప్పందంలో
భాగంగా
పవర్
ప్లాంట్స్,
రీసెర్చ్
రియాక్టర్స్,
ఫ్యూయల్
ఫ్యాబ్రికేషన్
యూనిట్స్,
ఎన్
రిచ్
మెంట్
ఫెసిలిటీస్,
ఐసోటోప్
సెపరేషన్
ప్లాంట్స్,
రీ
ప్రాసెసింగ్
యూనిట్స్,
స్టోరేజీ
సైట్స్
,
రేడియోయాక్టివ్
మెటీరియల్స్
డీటెయిల్స్..
తదితర
పూర్తి
సమాచారాన్ని
భారత్-
పాకిస్థాన్
ఇచ్చిపుచ్చుకున్నాయి.
ఇక
జమ్మూ
కాశ్మీర్
అనంత్
నాగ్
జిల్లాలోని
పహల్గామ్
లోయలో
గతేడాది
ఏప్రిల్
22న
ఉగ్రవాదులు
జరిపిన
మారణ
హోమంలో
26
మంది
అమాయక
టూరిస్టులు
ప్రాణాలు
కోల్పోయిన
విషయం
తెలిసిందే.
ఉగ్రవాదాన్ని
పెంచి
పోషిస్తున్న
పాకిస్థాన్
ఈ
ఘటన
వెనకున్నట్లు
తేలడంతో
పాకిస్థాన్,
పాకిస్థాన్
ఆక్రమిత
కాశ్మీర్
లోని
9
కీలక
స్థావరాలాపై
భారత్
ఆపరేషన్
సింధూర్
చేపట్టింది.
వాటిని
ధ్వంసం
చేసింది.
వందలాది
మంది
ఉగ్రవాదులను
హతమార్చింది.
వాటిలో
ముజఫరాబాద్
లోని
సవాయ్
నాలా
క్యాంప్,
ముజఫరాబాద్
లోని
సిడ్నా
బిలాల్
క్యాంప్,
కోట్లీలోని
గుల్
పూర్
క్యాంప్,
భీంబర్
లోని
బర్నాలా
క్యాంప్,
కోట్లీలోని
అబ్బాస్
క్యాంప్,
సియాల్
కోట్
లోని
సర్జాల్
క్యాంప్,
సియాల్
కోట్
లోని
మెహమూనా
జోయా
క్యాంప్,
మురిడ్
కే
లోని
మార్కాజ్
టైబా
క్యాంప్,
బహావల్
పుర్
లోని
మార్కజ్
సుభానల్లా
క్యాంప్..
ఉన్నాయి.
వీటిని
భారత
సైన్యం
పూర్తిగా
ధ్వంసం
చేసింది.


