Business
oi-Lingareddy Gajjala
2025
సంవత్సరం
ప్రజలను
ఎలక్ట్రిక్
వాహనాల
(electric
vehicle)
వైపు
మళ్లేలా
చేసింది.
ఈ
క్రమంలోనే
ఈవీ
మార్కెట్
ఊహించని
మలుపు
తిరిగింది.
మరోవైపు
వినియోగదారులు
ఎలక్ట్రిక్
వాహనం
కొనుగోలు
సమయంలో
బ్రాండ్,
రీసేల్,
విశ్వసనీయత,
సర్వీసింగ్
వంటి
అంశాలకు
అధిక
ప్రాధాన్యత
ఇచ్చారు.
అందువలనే
2025
క్యాలెండర్
ఇయర్
లో
ఎలక్ట్రిక్
ద్విచక్ర
వాహనాల
అమ్మకాల
ఎలా
జరిగాయో,
ఏ
కంపెనీ
బైక్స్
ఎక్కువగా
అమ్ముడు
పోయాయో
చూడండి.
గణాంకాల
ప్రకారం
2025
లో
టీవీఎస్
(TVS)
మోటార్
కంపెనీ
భారతదేశంలో
నంబర్
1
ఎలక్ట్రిక్
ద్విచక్ర
వాహన
తయారీదారుగా
అవతరించింది.
గడిచిన
ఏడాదిలో
టీవీఎస్
దాదాపు
2.95
లక్షల
ఎలక్ట్రిక్
ద్విచక్ర
వాహనాలను
విక్రయించి,
మార్కెట్‌లో
తన
ఆధిపత్యాన్ని
చాటుకుంది.24.2
శాతం
మార్కెట్
షేర్
తో
టీవీఎస్
అగ్రస్థానంలో
నిలిచింది.
టీవీఎస్
ఐక్యూబ్
(iQube)
ఎలక్ట్రిక్
స్కూటర్
సిరీస్
ఎంట్రీ
ఈ
సంస్థకు
ఊహించని
లాభాలను
తెచ్చిపెట్టింది.
రెండో
స్థానంలో
బజాజ్..
2025లో
ఈవీ
స్కూటర్స్
సేల్స్
లో
బజాజ్
(Bajaj)
సంస్థ
రెండో
స్థానంలో
నిలిచింది.
బజాజ్
సుమారు
21.9
శాతం
మార్కెట్
వాటాను
దక్కించుకుని,
టీవీఎస్
తర్వాతి
కొనుగోలుదారులు
బజాబ్
వైపు
మొగ్గు
చూపారు.
ముఖ్యంగా
బజాజ్
ప్రసిద్ధ
చేతక్
ఎలక్ట్రిక్
స్కూటర్
ఈ
విజయానికి
ప్రధాన
ఆధారంగా
నిలిచింది.
కొత్త
వేరియంట్లను
తీసుకురావడంతో,
వినియోగదారుల
నుంచి
మంచి
స్పందన
లభించింది.
డీలా
పడిన
ఓలా
2024లో
ఈవీ
మార్కెట్
ను
షేక్
చేసిన
ఓలా
(OLA
Bike)
2025లో
మాత్రం
తీవ్ర
ప్రతికూల
పరిస్థితిని
ఎదుర్కొంది.
వరుసగా
బైక్స్
అగ్నిప్రమాదాలకు
గురికావడంతో
ఆ
సంస్థ
ప్రజల
విశ్వాసాన్ని
పోగొట్టుకుంది.
2025
చివరి
నాటికి
ఓలా
తన
మార్కెట్
వాటాలో
సగానికి
పైగా
కోల్పోయి
కేవలం
16.1
శాతానికి
పరిమితమైంది.
అమ్మకాల
పరంగా
చూస్తే,
2025లో
ఓలా
దాదాపు
1.97
లక్షల
యూనిట్లను
మాత్రమే
విక్రయించింది
విశ్వాసాన్ని
గెలుచుకున్న
ఏథర్..
తీవ్రమైన
పోటీ
ఉన్నప్పటికీ,
వినియోగదారుల
విశ్వాసాన్ని
గెలుచుకుంటూ
ఏథర్(Ather
scooter).
2025లో
మంచి
గ్రోత్
చూపించింది.
ఏథర్
ఎనర్జీ
తన
మార్కెట్
వాటాను
2025
సంవత్సరంలో
11.3
శాతం
నుంచి
16.2
శాతానికి
పెంచుకుంది.


