Entertainment
oi-Bomma Shivakumar
యంగ్
టైగర్,
మాన్
ఆఫ్
మాసెస్
ఎన్టీఆర్
–
బ్లాక్
బస్టర్
డైరెక్టర్
ప్రశాంత్
నీల్
కాంబినేషన్
లో
ఓ
మూవీ
తెరకెక్కుతున్న
విషయం
తెలిసిందే.
కేజీఎఫ్,
సలార్
చిత్రాలతో
తనకంటూ
ప్రత్యేకమైన
గుర్తింపు
తెచ్చుకున్న
ప్రశాంత్
నీల్
ఈ
చిత్రాన్ని
ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కిస్తున్నారు.
దాంతో
ఈ
మూవీపై
అటు
నందమూరి
అభిమానులతోపాటు
యావత్
సినీ
ప్రపంచం
ఆసక్తిగా
ఉంది.
ప్రస్తుతం
చిత్రీకరణలో
ఉన్న
ఈ
చిత్రానికి
డ్రాగన్
అనే
టైటిల్
ప్రచారంలో
ఉంది.
త్వరలోనే
అధికారిక
టైటిల్
ప్రకటించే
అవకాశం
ఉంది.
అయితే
వివిధ
కారణాల
వల్ల
పలుమార్లు
షూటింగ్
కు
బ్రేక్
పడిన
విషయం
తెలిసిందే.
ఇక
ఈ
డ్రాగన్
మూవీలో
చాలామంది
ప్రముఖ
నటులు
కీలక
పాత్రల్లో
నటిస్తున్నారు.
అయితే
తాజాగా
ఓ
వార్త
సామాజిక
మాధ్యమాల్లో
చక్కర్లు
కొడుతోంది.
ఈ
మూవీలో
విలన్
పాత్రలో
ఓ
స్టార్
హీరో
నటిస్తున్నట్లు
వార్తలు
వస్తున్నాయి.
మలయాళ
నటుడు
టొవినో
థామస్..
డ్రాగన్
మూవీలో
కీలక
పాత్రలో
నటిస్తున్నట్లు
తెలుస్తోంది.
ఇదే
విషయంపై
ఆయన్ను
కొందరు
మీడియా
మిత్రులు
అడగ్గా
ఆయన
పరోక్షంగా
చేసిన
కామెంట్స్
ఇప్పుడు
వైరల్
అవుతున్నాయి.
గోవాలో
జరుగుతున్న
ఇంటర్నేషనల్
ఫిల్మ్
ఫెస్టివల్
ఆఫ్
ఇండియా
ప్రోగ్రాం
కోసం
టొవినో
అక్కడకు
వెళ్లారు.
అయితే
అక్కడ
స్పెషల్
ఇంటరాక్షన్
సందర్భంగా
ఎన్టీఆర్-
నీల్
చిత్రంలో
మీరు
నటిస్తున్నారా..?
అని
అడగ్గా
దానికి
అతను..
ప్రస్తుతం
నేను
దాని
గురించి
ఏమీ
స్పందించలేను
అని
కామెంట్స్
చేశాడు.
అవి
కాస్తా
వైరల్
అయ్యాయి.
ఇక
టోవినో
థామస్..
మిన్నల్
మురళి,
2018,
ఏఆర్ఎమ్
లాంటి
సినిమాలతో
వరుసగా
బ్లాక్
బస్టర్
హిట్స్
కొట్టాడు.
మిన్నల్
మురళి
సినిమాను
తెలుగు
ప్రేక్షకులు
కూడా
ఆదరించారు.
ఏఆర్ఎమ్
మూవీ
కూడా
తెలుగులో
హిట్
అయింది.
దాంతో
టోవినో..
ఎన్టీఆర్-
ప్రశాంత్
నీల్
మూవీలో
ఫిక్స్
అయినట్లు
తెలుస్తోంది.
అలాగే
బాలీవుడ్
నటుడు
అనిల్
కపూర్
కూడా
ఈ
సినిమాలో
నటిస్తున్నట్లు
వార్తలు
వచ్చాయి.
కానీ
ఇందులో
నిజమెంతో
తెలియదు.
చిత్ర
యూనిట్
కూడా
అధికారిక
ప్రకటన
చేయలేదు.
ఇక
ఈ
మూవీలో
ఎన్టీఆర్
సరసన,
కన్నడ
బ్యూటీ
రుక్మిణి
వసంత్
హీరోయిన్
గా
నటిస్తోంది.
ఇక
యంగ్
టైగర్
ఎన్టీఆర్
కెరీర్
లోనే
అత్యుత్తమ
సినిమాగా
దీన్ని
తీర్చి
దిద్దేందుకు
ప్రశాంత్
నీల్
ప్రయత్నిస్తున్నట్లు
సినీ
వర్గాల
నుంచి
టాక్
వినిపిస్తోంది.


