India
oi-Jakki Mahesh
గాంధీ
కుటుంబంలో
త్వరలో
పెళ్లి
బాజాలు
మోగనున్నాయి.
ప్రియాంక
గాంధీ,
రాబర్ట్
వాద్రా
దంపతుల
కుమారుడు
రెహాన్
వాద్రా
వివాహం
తన
చిరకాల
స్నేహితురాలు
అవీవా
బేగ్‌తో
నిశ్చయమైంది.
గత
ఏడేళ్లుగా
ప్రేమలో
ఉన్న
రెహాన్-అవీవా
బేగ్
ఇటీవల
రాజస్థాన్‌లో
అత్యంత
సన్నిహితుల
మధ్య
ఎంగేజ్మెంట్
చేసుకున్నారు.
ఈ
వేడుకకు
సంబంధించిన
ఫోటోలను
రెహాన్
తన
ఇన్‌స్టాగ్రామ్‌లో
షేర్
చేయగా..
తాజాగా
తండ్రి
రాబర్ట్
వాద్రా
ఈ
బంధాన్ని
అధికారికంగా
ధ్రువీకరించారు.
ఈ
విషయాన్ని
రాబర్ట్
వాద్రా
స్వయంగా
ధ్రువీకరిస్తూ
సోషల్
మీడియాలో
ఎమోషనల్
పోస్ట్
చేశారు.
రాబర్ట్
వాద్రా
ఎమోషనల్
పోస్ట్:
“నా
కుమారుడికి
తన
జీవిత
భాగస్వామి
దొరికింది.
రెహాన్
తన
జీవితంలో
ఓ
కొత్త
అధ్యాయాన్ని
ప్రారంభిస్తున్నందుకు
నేను
చాలా
సంతోషిస్తున్నాను.
వారిద్దరి
బంధం
ఎల్లప్పుడూ
అన్యోన్యంగా,
ప్రేమతో
సాగిపోవాలని
మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను.
భవిష్యత్తులో
ఈ
జంట
సంతోషంగా
వర్ధిల్లాలని
దేవుడిని
ప్రార్థిస్తున్నాను”
అని
రాబర్ట్
వాద్రా
రాసుకొచ్చారు.
ఏడేళ్ల
ప్రేమ..
రాజస్థాన్‌లో
నిశ్చితార్థం:
డిసెంబర్
29న
రాజస్థాన్‌లో
జరిగిన
ఓ
ప్రైవేట్
వేడుకలో
వీరిద్దరూ
ఉంగరాలు
మార్చుకున్నారు.
రెహాన్,
అవీవా
గత
ఏడేళ్లుగా
ప్రేమలో
ఉన్నారు.
వీరి
వివాహానికి
ఇరు
కుటుంబాల
వారు
పచ్చజెండా
ఊపడంతో
ఈ
వేడుక
ఘనంగా
జరిగింది.రెహాన్
వాద్రా
విజువల్
ఆర్టిస్ట్,
ఫోటోగ్రాఫర్‌గా
కెరీర్
ను
ఎంచుకున్నాడు.
ఢిల్లీ,
డెహ్రాడూన్,
లండన్లలో
విద్యాభ్యాసం
పూర్తి
చేసిన
రెహాన్..
‘డార్క్
పర్సెప్షన్’
పేరుతో
సోలో
ఎగ్జిబిషన్‌ను
కూడా
నిర్వహించారు.
నేచర్
ఫోటోగ్రఫీ,
ట్రావెలింగ్
అంటే
ఆయనకు
చాలా
ఇష్టం.
గాంధీ
కుటుంబపు
కాబోయే
కోడలు
‘అవీవా
బేగ్’
ఎవరు?
అవీవా
బేగ్
కూడా
కళారంగానికి
చెందిన
వ్యక్తి.
ఆమె
ఒక
ఫైన్
ఆర్ట్
ఫోటోగ్రాఫర్,
ప్రొడ్యూసర్.
ఆమె
‘అటెలియర్
11’
(Atelier
11)
అనే
ఫోటోగ్రాఫిక్
స్టూడియో,
ప్రొడక్షన్
కంపెనీకి
కో-ఫౌండర్.
దేశవ్యాప్తంగా
ఉన్న
ప్రముఖ
బ్రాండ్‌లు,
ఏజెన్సీలతో
ఆమె
కంపెనీ
కలిసి
పనిచేస్తోంది.


