Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
జిల్లాల
పునర్విభజన
కసరత్తు
పూర్తయి
కేబినెట్
ఆమోదం
కూడా
లభించడంతో
కొత్త
ఏడాదిలో
కొత్త
జిల్లాల
ఏర్పాటుకు
ప్రభుత్వం
ఇవాళ
నోటిఫికేషన్
జారీ
చేసింది.
దీని
ప్రకారం
నిన్న
కేబినెట్
లో
ఆమోదించిన
విధంగా
రెండు
కొత్త
జిల్లాలు
మార్కాపురం,
పోలవరాన్ని
ఏర్పాటు
చేస్తూ
ప్రకటన
జారీ
చేసింది.
దీంతో
ఈ
రెండు
జిల్లాలు
రేపటి
నుంచి
అమల్లోకి
రాబోతున్నాయి.
వీటితో
కలిపి
జిల్లాల
సంఖ్య
28
కానుంది.
దీంతో
పాటు
రాష్ట్రంలోని
ఇతర
జిల్లాల్లోనూ
మార్పులు
చోటు
చేసుకోబోతున్నాయి.
ప్రభుత్వం
ఇవాళ
జారీ
చేసిన
నోటిఫికేషన్
ప్రకారం
రంపచోడవరం
కేంద్రంగా
పోలవరం
జిల్లా,
మార్కాపురం
కేంద్రంగా
మార్కాపురం
జిల్లా
ఏర్పాటు
చేస్తున్నట్లు
తెలిపారు.
వీటితో
పాటు
రాష్ట్రంలో
కొత్తగా
ఐదు
డివిజన్లను
కూడా
ఏర్పాటు
చేశారు.
తాజా
మార్పుల్లో
శ్రీకాకుళం
జిల్లాలో
నందిగామ
మండలం
పలాస
రెవెన్యూ
డివిజన్
నుంచి
టెక్కలి
డివిజన్‌కు
మారింది.
అలాగే
సామర్లకోట
మండలం
కాకినాడ
డివిజన్
నుంచి
పెద్దాపురం
డివిజన్‌కు
మారింది.
పాడేరు
కేంద్రంగా
అల్లూరి
సీతారామరాజు
జిల్లా
మార్పు
జరిగింది.
పెనుగొండ
కాస్తా
వాసవీ
పెనుగొండగా
మారింది.
అలాగే
అనకాపల్లి
జిల్లాలో
అడ్డరోడ్డు
జంక్షన్‌తో
రెవెన్యూ
డివిజన్
ఏర్పాటైంది.
వీటితో
పాటు
మరికొన్ని
మార్పులు
కూడా
ఉన్నాయి.
ప్రభుత్వ
నోటిఫికేషన్
ప్రకారం
రేపటి
నుంచి
కొత్త
జిల్లాలు,
రెవెన్యూ
డివిజన్లు,
మండలాల
సరిహద్దుల
మార్పులు
అమల్లోకి
వస్తాయి.
దీంతో
ప్రభుత్వ
కార్యాలయాలు,
సరిహద్దు
రాళ్లు,
బోర్డులు
కూడా
మారబోతున్నాయి.
అలాగే
అధికారిక
రికార్డుల్లోనూ
మార్పలు
చోటుచేసుకోబోతున్నాయి.
కాబట్టి
ప్రజలు
కూడా
వీటికి
అనుగుణంగా
తమ
కార్యకలాపాల్లో
మార్పులు
చేసుకోవాల్సి
ఉంటుంది.
కొత్త
ఏడాది
సందర్భంగా
అమల్లోకి
వచ్చే
ఈ
మార్పులతో
పాలన
మరింత
సజావుగా
జరుగుతుందని
ప్రభుత్వం
భావిస్తోంది.


