Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
తిరుమల
లడ్డూకు
వాడిన
కల్తీ
నెయ్యి
వివాదంపై
సిట్
రిపోర్ట్
తర్వాత
కూటమికీ,
వైఎస్సార్సీపీ
(ysrcp)కి
మధ్య
తీవ్ర
మాటల
యుద్దం
సాగుతోంది.
ఇది
కాస్తా
నిన్న
దాడుల
వరకూ
వచ్చేసింది.
చంద్రబాబుపై
వ్యాఖ్యల
నేపథ్యంలో
నిన్న
గుంటూరులో
మాజీ
మంత్రి
అంబటి
రాంబాబు
ఇంటిపై
టీడీపీ
నేతలు
దాడికి
దిగితే..
ఇవాళ
లోకేష్
పై
వ్యాఖ్యలతో
ఇవాళ
ఇబ్రహీంపట్నంలో
మరో
మాజీ
మంత్రి
జోగి
రమేశ్
ఇంటిపై
దాడి
జరిగింది.
ఈ
రెండు
దాడులతో
వైసీపీ
భగ్గుమంటోంది.
రాష్ట్రంలో
బీహార్
తరహా
పాలనకు
కూటమి
ప్రభుత్వం
తెరతీసిందని
మాజీ
మంత్రి
వెల్లంపల్లి
శ్రీనివాస్
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
చంద్రబాబు
పాలనలో
అభివృద్ది
పూర్తిగా
కుంటుపడగా…
శాంతిభద్రతలు
అదుపు
తప్పాయని
ఆయన
మండిపడ్డారు.
వరుసగా
వైయస్సారీపీకి
చెందిన
ముగ్గురు
మాజీ
మంత్రుల,
మాజీ
ఎమ్మెల్యేల
ఇంటిపై
అధికార
పార్టీ
శ్రేణులు
దాడికి
పాల్పడ్డాన్ని
తీవ్రంగా
ఖండించారు.
లా
అండ్
ఆర్డర్
నాశనం
చేస్తున్న
వారిని
అదుపుచేయాల్సిన
బాధ్యత
పోలీసులదే.
చంద్రబాబు,
లోకేష్
అండదండలతో
రాష్ట్రంలో
టీడీపీ
గూండాలు
రౌడీయిజంతో
విచ్చలవిడిగా
ప్రవర్తిస్తున్నారని
తెలిపారు.
రాష్ట్రంలో
జరుగుతున్న
దారుణాలపై
కేంద్ర
ప్రభుత్వం
తక్షణమే
జోక్యం
చేసుకుని..
రాష్ట్రపతి
పాలన
విధించాలన్నారు
మరో
మాజీ
మంత్రి
పేర్నినాని
కూడా
రెండు
రోజులుగా
తన
సహచర
నేతలు,
మాజీ
మంత్రుల
ఇళ్లపై
జరుగుతున్న
దాడులపై
ఫైర్
అయ్యారు.
గత
కొన్ని
రోజులుగా
ఆంధ్రరాష్ట్రంలో
పరిస్థితులు
ఘోరంగా
తయారయ్యాయని
ఆరోపించారు.
చంద్రబాబు
ఆదేశాలు
ఇస్తారు,
లోకేష్,
డీజీపీ,
ఇతర
అధికారులు
అమలుచేస్తున్నారన్నారు.
ఇవాళ
జోగి
రమేశ్
ఇంటిపై
టీడీపీ
గుండాలు
కర్రలు,
రాళ్లు
చేతపట్టి
ఆటవిక
మూకల
మాదిరిగా
దాడులు
చేశారన్నారు.
పోలీసులు
ప్రేక్షక
పాత్ర
వహించారని,
దాడులు
జరుగుతున్నా
చూస్తూ
ఉండిపోయారని
విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
లో
శాంతిభద్రతలు
పూర్తిగా
దిగజారాయని,
వెంటనే
రాష్ట్రపతి
పాలన
విధించాలని
డిమాండ్
చేశారు.


