Andhra Pradesh
oi-Syed Ahmed
ఓవైపు
పొరుగు
రాష్ట్రం
తెలంగాణ
సినిమా
టికెట్ల
రేట్లు
పెంచేది
లేదని
తేల్చేసిన
నేపధ్యంలో
ఏపీలో
మాత్రం
కూటమి
సర్కార్
దీనిపై
కీలక
నిర్ణయం
తీసుకునేందుకు
సిద్దమవుతోంది.
ప్రతీ
సినిమా
విడుదలైనప్పుడల్లా
చిత్ర
నిర్మాతలు
వచ్చి
టికెట్
రేట్ల
పెంపుకు
అనుమతి
ఇవ్వాలని
కోరడం,
ఆ
మేరకు
వారి
బడ్జెట్లను
బట్టి
అనుమతులు
ఇవ్వడం
జరుగుతోంది.
అయితే
ఆ
మేరకు
ఏపీకి
అయితే
ఏమాత్రం
మేలు
జరగడం
లేదు.
దీంతో
కొన్ని
షరతులతో
టికెట్
రేట్లు
పెంచుకునేందుకు
ఒకేసారి
అనుమతి
ఇచ్చేందుకు
ప్రభుత్వం
సిద్దమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో
సినిమా
టికెట్
ధరల
విషయంలో
నెలకొన్న
గందరగోళానికి
తెరదించాలని
భావిస్తున్న
ప్రభుత్వం..
ఇకపై
అన్ని
సినిమాలకు
వర్తించేలా
ఒకే
సమగ్ర
జీవోను
తీసుకురావాలని
నిర్ణయించిందని
సినిమాటోగ్రఫీ
మంత్రి
కందుల
దుర్గేష్
తెలిపారు.
ఇవాళ
సచివాలయంలో
జరిగిన
సినిమా
టికెట్
ధరల
హేతుబద్దీకరణ
కమిటీ
సమీక్ష
అనంతరం
దుర్గేష్
దీనిపై
స్పందించారు.
ప్రతి
సినిమా
బడ్జెట్ను
బట్టి
విడివిడిగా
జీవోలు
ఇచ్చే
పద్ధతికి
స్వస్తి
పలికి,
ఒకే
విధానం
కింద
టికెట్
ధరలు
ఉండేలా
చర్యలు
తీసుకుంటామన్నారు.
సినిమా
పరిశ్రమ
మనుగడ
సాగించడంతో
పాటు,
సామాన్య
ప్రేక్షకుడిపై
భారం
పడకుండా
సమతుల్యత
పాటిస్తామని
మంత్రి
తెలిపారు.
నిర్మాతలు,
డిస్ట్రిబ్యూటర్లు,
ఎగ్జిబిటర్ల
అభిప్రాయాలను
పరిగణనలోకి
తీసుకొని
సినీ
పరిశ్రమకు
మేలు
జరిగేలా
నిర్ణయం
ఉంటుందన్నారు.
పెద్ద
బడ్జెట్
సినిమా,
ఆర్టిస్టుల
రెమ్యూనరేషన్
పైనా
చర్చించి
ఒక
నిర్ణయానికి
వస్తామన్నారు.
అన్నింటికీ
కేటగిరీ
ప్రకారం
సమానంగా
టికెట్ల
ధరలు
పెంచే
విధానం
పరిశీలిస్తున్నామన్నారు.
త్వరలోనే
డిస్ట్రిబ్యూటర్లు,
నిర్మాతలతో
భేటీ
అవుతామన్నారు.
సినీ
పరిశ్రమ
సమస్యలు
కూడా
విని
పరిష్కరిస్తామని
హామీ
ఇచ్చారు.
పాన్
ఇండియా
సినిమా
వల్ల
నిర్మాతలకు
బడ్జెట్
విపరీతంగా
పెరుగుతోందన్నారు.
వీటన్నింటిని
దృష్టిలో
ఉంచుకొని
ఏపీలో
సినిమా
టికెట్ల
రేట్ల
హేతుబద్దీకరణపై
చర్చించామన్నారు.
మల్టీఫ్లెక్స్
లు,
సింగిల్
స్క్రీన్ల
టికెట్
ధరల
హేతుబద్దీకరణపై,
హై
బడ్జెట్
సినిమా
టికెట్ల
పెంపునకు
అనుసరించాల్సిన
విధానాలపై
కమిటీ
చర్చించిందన్నారు.
దీనిపై
త్వరలో
కమిటీ
ప్రభుత్వానికి
సిఫారసులు
చేస్తుందన్నారు.
ఇప్పటివరకు
పాత
జీవో
ప్రకారం
హోం
శాఖ
ద్వారా
సినిమా
టికెట్
రేట్లు
పెంచుతున్నామని,
ప్రస్తుతం
లో
బడ్జెట్,
హై
బడ్జెట్
సినిమాలకు
ఎంత
ధర
ఉండాలనే
అంశంపై
కమిటీ
చర్చిస్తోందన్నారు.
ఎంత
శాతం
ఏపీలో
చిత్రీకరణ
జరపాలన్న
అంశంపై
నిబంధనలు
నిర్ణయిస్తామన్నారు.


