Andhra Pradesh
oi-Jakki Mahesh
Viral
Video:
నంద్యాల
జిల్లా
ఆత్మకూరు
అటవీ
డివిజన్
పరిధిలో
ఓ
అరుదైన
దృశ్యం
వెలుగుచూసింది.
శ్రీశైలం
బ్యాక్
వాటర్‌లో
ఓ
పెద్దపులి
గజ
ఈత
కొడుతూ
కొడుతూ
నదిని
దాటిన
వీడియో
ఇప్పుడు
సోషల్
మీడియాలో
విపరీతంగా
వైరల్
అవుతోంది.
సాధారణంగా
పులులు
నీటిలో
ఈదడం
సహజమే
అయినా..
ఏకంగా
2
కిలోమీటర్ల
మేర
కృష్ణానది
బ్యాక్
వాటర్‌లో
అలవోకగా
ఈదుకుంటూ
వెళ్లడం
అందరినీ
ఆశ్చర్యానికి
గురి
చేస్తోంది.
ఆత్మకూరు
అటవీ
డివిజన్
నుంచి
తెలంగాణలోని
అమ్రాబాద్
అభయారణ్యానికి
వెళ్లే
క్రమంలో
ఈ
పులి
నదిని
దాటింది.
ఏపీ
నుంచి
తెలంగాణలోకి..
మత్స్యకారుల్లో
భయాందోళన
అటవీ
శాఖ
అధికారులు
వెల్లడించిన
వివరాల
ప్రకారం..
ఈ
పులిని
టీ65
(T65)
గా
గుర్తించారు.
నంద్యాల
జిల్లా
సంగమేశ్వరం
సమీప
ప్రాంతం
నుంచి
బయలుదేరిన
ఈ
పులి
కృష్ణానదిని
ఈదుకుంటూ
వెళ్లి
తెలంగాణ
సరిహద్దుల్లోని
కొల్లాపూర్
అడవుల్లోకి
ప్రవేశించింది.
నదిలో
పులి
ఈదుకుంటూ
వెళ్తుండటాన్ని
చూసిన
స్థానిక
మత్స్యకారులు
భయాందోళనకు
గురయ్యారు.
పులి
కదలికలను
గమనించిన
కొందరు
తమ
ఫోన్లలో
వీడియో
తీయగా..
అది
కాస్తా
నెట్టింట
వైరల్‌గా
మారింది.
అప్రమత్తమైన
అటవీ
శాఖ
ఈ
ఘటనపై
ఆత్మకూరు
అటవీ
శాఖ
డిప్యూటీ
డైరెక్టర్
విగ్నేష్
అపావ్
స్పందించారు.
పులి
కదలికలపై
అటవీ
శాఖ
సిబ్బంది
ప్రత్యేక
నిఘా
ఉంచారని
తెలిపారు.
నది
పరివాహక
ప్రాంతంలోని
మత్స్యకారులు,
ప్రజలు
అప్రమత్తంగా
ఉండాలని
హెచ్చరించారు.
పులి
క్షేమంగా
అటవీ
ప్రాంతంలోకి
వెళ్లే
వరకు
నిరంతరం
పర్యవేక్షణ
కొనసాగుతుందని
ఆయన
వెల్లడించారు.


