Telangana
oi-Bomma Shivakumar
ఐ-బొమ్మ
నిర్వాహకుడు
రవి
కేసులో
పోలీసుల
కస్టడీ
నేటితో
ముగిసింది.
సోమవారం
సైబర్
క్రైమ్
పోలీసులు
అతడ్ని
నాంపల్లి
కోర్టులో
హాజరు
పరిచారు.
అనంతరం
మీడియా
అడిగిన
ప్రశ్నకు
ఇమంది
రవి
షాకింగ్
రిప్లై
ఇచ్చారు.
నా
పేరు
రవినా..?
ఐ
బొమ్మ
రవినా..?
ఐ
బొమ్మ
నాదే
అనడానికి
ఆధారాలు
ఉన్నాయా..?
ఆధారాలు
లేకుండా
ఎలా
మాట్లాడతారు..?
అని
ప్రశ్నించాడు.
అంతేకాక
ఏదైనా
కోర్టులో
తేల్చుకుంటా
అంటూ
వెళ్లిపోయారు.
ప్రస్తుతం
ఆయన
వ్యాఖ్యలు
ఆసక్తికరంగా
మారాయి.
తెలుగు
చిత్ర
పరిశ్రమంలో
అలజడి
సృష్టించిన
ఐ
బొమ్మ
రవి
12
రోజుల
పోలీస్
కస్టడీ
నేటితో
ముగిసింది.
దాంతో
అతడ్ని
పోలీసులు
నాంపల్లి
కోర్టులో
హాజరు
పరిచారు.
ఈ
క్రమంలో
కోర్టు
నుంచి
బయటకు
వస్తూ
రిపోర్టర్
అడిగిన
పలు
ప్రశ్నలకు
విసుక్కుంటూ
సమాధానం
ఇచ్చారు.
నా
పేరు
ఐ
బొమ్మ
రవినా..?
ఐ
బొమ్మ
నాదే
అనడానికి
ఆధారాలు
ఉన్నాయా..?
ఆధారాలు
లేకుండా
ఎలా
మాట్లాడతారు..?
అని
సవాల్
విసిరారు.
కోర్టులో
చూసుకుంటా
అంటూ
వెళ్లిపోయారు.
మరో
ప్రశ్నకు
సమాధానం
చెప్తూ..
‘మీ
మీడియాకి
చెప్పడం
వల్ల
ఉపయోగం
ఏంటి..?
మీరేమైనా
కోర్టులా
అంటూ
ఇమంది
రవి
ఫైర్
అయ్యారు.
“నేను
ఎక్కడికీ
పారిపోలేదు.
ఇన్నాళ్లూ
కూకట్
పల్లిలోనే
ఉన్నా..
నాపై
వస్తున్న
ఆరోపణలు
అవాస్తవం..
బెట్టింగ్
యాప్స్
తో
సంబంధాలున్నాయని
ఎవరు
చెప్పారు..?
పోలీసులు
చెబితే
నేరం
చేసినట్టేనా..
ఏదైనా
కోర్టులోనే
తేల్చుకుంటా..
నేను
కూకట్
పల్లిలోనే
ఉన్నా..
కేవలం
వేరే
దేశపు
సిటిజెన్
షిప్
మాత్రమే
తీసుకున్నా..”
అని
ఐ
బొమ్మ
రవి
పేర్కొన్నారు.
ఇక
ఐ
బొమ్మ
రవిని
నవంబర్
18న
సైబర్
క్రైమ్
పోలీసులు
అరెస్ట్
చేశారు.
సినిమాల
పైరసీతో
పాటు
బెట్టింగ్
యాప్
ల
ప్రమోషన్
కు
పాల్పడిన
నేపథ్యంలో
అతడిపై
మొత్తం
5
కేసులు
నమోదు
చేశారు.
పైరసీ
సెల్
ఇచ్చిన
ఫిర్యాదుతో
ఒక
కేసు..
అలాగే
బెట్టింగ్
యాప్
ప్రమోషనల్
వ్యవహారంలో
మరో
కేసు
నమోదు
చేశారు.
అలాగే
తాజాగా
ఐ
బొమ్మ
రవి
కేసులో
మరొకరి
పేరు
బయటకు
రావడం
సంచలనంగా
మారింది.
ప్రహ్లాద్
వెల్లేల
పేరిట
ఇమ్మడి
రవి
పాన్
కార్డు,
డ్రైవింగ్
లైసెన్స్
తీసుకున్నట్లు
పోలీసుల
విచారణలో
తేలింది.
ప్రస్తుతం
ఇందుకు
సంబంధించిన
విషయాలపై
పోలీసులు
దర్యాప్తు
చేస్తున్నారు.


