International
oi-Jakki Mahesh
దాయాది
దేశాలైన
భారత్,
పాకిస్థాన్
దేశాల
మధ్య
గతేడాది
మే
నెలలో
జరిగిన
4
రోజుల
తీవ్ర
సైనిక
ఘర్షణను
ఆపడంలో
తామే
కీలక
పాత్ర
పోషించామని
చైనా
చేసిన
ప్రకటన
ఇప్పుడు
అంతర్జాతీయ
స్థాయిలో
చర్చనీయాంశమైంది.
విశేషమేమిటంటే
నిన్నటివరకు
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్‌ను
శాంతి
దూత
అని
పొగిడిన
పాకిస్థాన్..
ఇప్పుడు
చైనా
వాదనను
కూడా
సమర్థిస్తూ
ప్లేటు
ఫిరాయించింది.
చైనా
విదేశాంగ
మంత్రి
వాంగ్
యీ
ఇటీవల
మాట్లాడుతూ..
గతేడాది
భారత్-పాక్
సరిహద్దుల్లో
ఉద్రిక్తతలు
పెరిగినప్పుడు
తమ
ప్రభుత్వం
మధ్యవర్తిత్వం
వహించిందని..
దీనివల్లే
కాల్పుల
విరమణ
సాధ్యమైందని
అన్నారు.
దీనిపై
పాక్
విదేశాంగ
శాఖ
ప్రతినిధి
తాహిర్
అంద్రాబీ
స్పందిస్తూ..
“మే
6
నుంచి
10వ
తేదీ
వరకు
జరిగిన
ఘర్షణ
సమయంలో
చైనా
నాయకత్వం
మాతో
నిరంతరం
సంప్రదింపులు
జరిపింది.
భారత్‌తో
కూడా
చర్చలు
జరిపి
ఉద్రిక్తతలను
తగ్గించడంలో
చైనా
దౌత్యం
కీలక
పాత్ర
పోషించింది”
అని
చైనా
వాదనను
బలపరిచారు.
ట్రంప్
వర్సెస్
చైనా..
పాక్
అయోమయం
అయితే
ఇక్కడే
పాకిస్థాన్
ద్వంద్వ
వైఖరి
బయటపడింది.
అంతకుముందు
డొనాల్డ్
ట్రంప్
తాను
టారిఫ్
బాంబులతో
బెదిరించడం
వల్లే
భారత్-పాక్
యుద్ధం
ఆగిందని
దాదాపు
50
సార్లు
చెప్పుకున్నారు.
అప్పట్లో
పాకిస్థాన్
కూడా
ట్రంప్‌కు
‘నోబెల్
శాంతి
బహుమతి’
ఇవ్వాలని
డిమాండ్
చేసింది.
ఇప్పుడు
చైనా
మేము
ఆపాము
అనగానే..
పాక్
వారు
కూడా
‘అవును’
అంటూ
వంత
పాడుతోంది.
ఒకే
కాల్పుల
విరమణకు
ఇద్దరు
‘క్రెడిట్’
తీసుకుంటుంటే,
పాకిస్థాన్
అందరికీ
వంత
పాడుతుండటం
చూస్తుంటే,
ఆ
దేశానికి
ఒక
స్థిరమైన
స్టాండ్
లేదని
స్పష్టమవుతోంది.
భారత్
స్పష్టమైన
వైఖరి
భారత్
మాత్రం
మొదటి
నుంచి
ఒకటే
మాటపై
ఉంది.
ఈ
ఘర్షణలో
ఏ
మూడో
దేశం
జోక్యం
లేదని..
పాకిస్థాన్
స్వయంగా
చేసిన
విజ్ఞప్తి
మేరకు
మాత్రమే
కాల్పుల
విరమణ
జరిగిందని
భారత్
స్పష్టం
చేసింది.
భారత్
చేపట్టిన
‘ఆపరేషన్
సిందూర్’
విఫలమవడంతోనే
వారు
తోక
ముడిచారని
భారత
దౌత్య
వర్గాలు
భావిస్తున్నాయి.


