Andhra Pradesh
oi-Lingareddy Gajjala
రాయలసీమ
లిఫ్ట్
ఇరిగేషన్
పై
సీఎం
చంద్రబాబు
ఘాటుగా
స్పందించారు.
ఓ
అబద్దాన్ని
వందసార్లు
చెబితే
నిజం
అవుతుందా.?
అంటూ
తనని
టార్గెట్
చేసిన
వారిపై
పరోక్షంగా
విమర్శలు
గుప్పించారు.
ప్రాజెక్టులను
నిర్వీర్యం
చేస్తున్నారని
ప్రతిపక్షంలో
ఉండగా
తాను
పర్యటనలు
చేస్తుంటే…
వైసీపీ
ప్రభుత్వం
అరెస్ట్
చేసిందని
ఆవేదన
వ్యక్తం
చేశారు.
ఇప్పుడున్న
వాళ్లకి
ప్రాజెక్టులు
అర్థం
కావని..
కానీ
రాజకీయం
మాత్రం
చేస్తారని
మండిపడ్డారు.
తెలుగుజాతి
అంతా
ఒకటేనన్న
సీఎం
చంద్రబాబు.
ఇచ్చి
పుచ్చుకునే
ధోరణితో
వ్యవహరించాలనీ
కోరుతున్నానాని
తెలంగాణ
ప్రభుత్వానికి
విజ్ఞప్తి.
పోలవరం
ప్రాజెక్టు
పర్యటన
అనంతరం
ఏర్పాటు
చేసిన
మీడియా
సమావేశంలో
సీఎం
చంద్రబాబు
పలు
కీలక
విషయాలను
వెల్లడించారు.
సాగునీటి
రంగంలో
గత
ప్రభుత్వాల
పనితీరుపై
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
తీవ్ర
విమర్శలు
చేశారు.
2014
నుంచి
2019
మధ్యకాలంలో
తమ
ప్రభుత్వం
సాగునీటి
ప్రాజెక్టుల
కోసం
రూ.
65
వేల
కోట్లు
ఖర్చు
చేస్తే,
వైసీపీ
ప్రభుత్వం
కేవలం
రూ.
12
వేల
కోట్లు
మాత్రమే
ఖర్చు
పెట్టిందని
తెలిపారు.
ముఖ్యంగా
రాయలసీమ
ప్రాంతానికి
తమ
హయాంలో
రూ.
12
వేల
కోట్లు
వెచ్చిస్తే,
తర్వాతి
ప్రభుత్వం
కేవలం
రూ.
2
వేల
కోట్లతో
సరిపెట్టిందని
పేర్కొన్నారు.
నన్ను
అరెస్ట్
చేశారు..
తాను
ప్రతిపక్షంలో
ఉండగా
ప్రాజెక్టులు
నిర్వీర్యం
అవుతున్నాయని
ప్రశ్నిస్తూ
పర్యటనలు
చేస్తే
అప్పటి
ప్రభుత్వం
తనను
అరెస్ట్
చేసిందని
సీఎం
గుర్తుచేశారు.
పోలవరం
ప్రాజెక్టు
స్టాండ్‌అలోన్
ప్రాజెక్టు
కాదని,
ఇది
రాష్ట్రానికి
నెర్వ్
సెంటర్
లాంటిదని
వ్యాఖ్యానించారు.
పోలవరం
ద్వారా
రాష్ట్రం
నలుమూలలకు
నీటిని
అందించేలా
సమగ్ర
ప్రణాళిక
రూపొందించుకోవచ్చని
చెప్పారు.
గోదావరి-కృష్ణా
డెల్టాల
అనుసంధానం
అత్యంత
కీలకమని
చంద్రబాబు
స్పష్టం
చేశారు.
ప్రస్తుతం
రాయలసీమ
రిజర్వాయర్లలో
368
టీఎంసీల
నీరు
నిల్వ
ఉండటం
ఎంతో
ఆనందంగా
ఉందన్నారు.
గతంలో
ఒక
పంటకే
నీళ్లు
అందని
నెల్లూరు
జిల్లాలో
ఇప్పుడు
రెండు
పంటలకు
నీరు
ఇవ్వగలుగుతున్నామని
తెలిపారు.
తెలుగుజాతి
కోసం..
రెండు
రాష్ట్రాల
ప్రయోజనాల
విషయంలో
రాజకీయాలు
చేయడం
సరికాదని
చంద్రబాబు
సూచించారు.
తెలంగాణలో
దేవాదుల,
కల్వకుర్తి,
మాధవరెడ్డి
లిఫ్ట్
ప్రాజెక్టులను
తానే
ప్రారంభించానని
చెప్పారు.
కృష్ణా
డెల్టా
ఆధునీకరణ
ద్వారా
20
టీఎంసీల
నీటిని
పొదుపు
చేసి
బీమా
లిఫ్ట్‌ను
పూర్తి
చేశామని
వివరించారు.
ఆర్డీఎస్‌కు
నీళ్లు
అందని
సమయంలో
జూరాల
నుంచి
లింక్
కెనాల్
ద్వారా
మహబూబ్‌నగర్
జిల్లాలో
40
వేల
ఎకరాలకు
నీళ్లు
అందించామన్నారు.
గోదావరి
నదిపై
తెలంగాణలో
అలీసాగర్,
గుత్ప
ప్రాజెక్టులు
చేపట్టామని,
హైదరాబాద్
నగరానికి
సాగర్
జలాలు
అందించిన
ఘనత
కూడా
తమదేనని
చంద్రబాబు
పేర్కొన్నారు.
తెలుగుజాతి
కోసం
హైదరాబాద్‌ను
అభివృద్ధి
చేశామని,
గోదావరిలో
పుష్కలంగా
నీళ్లు
ఉన్నాయని,
దేవాదుల
ప్రాజెక్టును
విస్తరిస్తే
ఇబ్బంది
ఏమీ
ఉండదన్నారు.
తెలంగాణకు
కూడా
నీళ్లు
ఇవ్వవచ్చు
పోలవరం
నీళ్లను
ఉపయోగించుకుంటే
అభ్యంతరం
చెప్పడం
ఎంతవరకు
సమంజసం
అని
ప్రశ్నించిన
సీఎం,
పోలవరం
నీటిని
వినియోగించి
కృష్ణా
జలాలను
పొదుపు
చేస్తున్నామని
చెప్పారు.
ఈ
విధంగా
పొదుపు
చేసిన
నీటిని
రాయలసీమకు
మళ్లిస్తున్నామని,
అవసరమైతే
తెలంగాణకు
కూడా
నీళ్లు
ఇవ్వవచ్చని
వ్యాఖ్యానించారు.
రాయలసీమ
లిఫ్ట్
ప్రాజెక్టుపై
కొందరు
ఇష్టానుసారంగా
మాట్లాడుతున్నారని
చంద్రబాబు
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ఓ
అబద్ధాన్ని
వందసార్లు
చెప్పితే
నిజం
కాదని
స్పష్టం
చేశారు.
రాయలసీమ
లిఫ్ట్
ప్రాజెక్టుకు
రూ.
3,528
కోట్లు
మంజూరు
చేశారని,
అయితే
సరైన
అనుమతులు
లేకుండానే
పనులు
ప్రారంభించి,
జరిమానాలు
పడిన
తర్వాత
ఎన్జీటీ
ఆదేశాలతో
పనులు
నిలిచిపోయాయని
గుర్తు
చేశారు.
అయినప్పటికీ
రూ.
900
కోట్లు
కాంట్రాక్టర్లకు
చెల్లించారని,
మొత్తం
రూ.
2,500
కోట్లకు
పైగా
అనుమతుల్లేని
ప్రాజెక్టులకు
ఖర్చు
చేశారని
ఆరోపించారు.
కుప్పం
వరకు
నీటిని
తీసుకెళ్లాం..
మచ్చుమర్రి
ప్రాజెక్టు
ద్వారా
సీమకు
నీరు
తరలించే
అవకాశం
ఉన్నప్పటికీ,
అదనంగా
మరో
ప్రాజెక్టు
చేపట్టి
34
టీఎంసీల
నీటిని
తరలిస్తామని
చెప్పడం
అర్థరహితమని
వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం
సీమలోని
అన్ని
రిజర్వాయర్లను
నీటితో
నింపామని,
ఎప్పుడూ
నీళ్లు
చేరని
బ్రహ్మసాగర్‌కు
కూడా
నీటిని
అందించామని
చెప్పారు.
హంద్రీ-నీవా
ప్రాజెక్టు
ద్వారా
అన్ని
చెరువులకు
నీళ్లు
ఇచ్చి,
కుప్పం
వరకు
నీటిని
తీసుకెళ్లామని
తెలిపారు.
వ్యవస్థలను
సరిచేస్తే
కొందరు
బురదజల్లుతున్నారని,
అయితే
తనపై
బురదజల్లితే
నష్టం
వారికే
జరుగుతుందన్నారు.
అవగాహన
లేని
రాజకీయాలు..
దేశవ్యాప్తంగా
నదుల
అనుసంధానం
జరగాలన్నది
తన
దీర్ఘకాల
కోరిక
అని
చంద్రబాబు
స్పష్టం
చేశారు.
సముద్రంలోకి
వృథాగా
పోయే
నీటిని
వినియోగించుకుంటే
అభివృద్ధి
ఆటోపైలట్
విధానంలో
సాగుతుందని
వ్యాఖ్యానించారు.
తన
రాజకీయ
జీవితంలో
అనేక
ప్రాజెక్టులకు
శంకుస్థాపన
చేసి,
వాటిని
పూర్తి
చేసిన
అనుభవం
ఉందని
చెప్పారు.
ప్రస్తుతం
ఏపీలో
ఉన్న
90
శాతం
ప్రాజెక్టులు
తెలుగుదేశం
హయాంలో
ప్రారంభమైనవేనని
పేర్కొన్నారు.
ఇప్పటి
నాయకులకు
ప్రాజెక్టుల
అవగాహన
లేకపోయినా
రాజకీయాలు
మాత్రం
చేస్తున్నారని
విమర్శించిన
సీఎం,
తెలుగుజాతి
అంతా
ఒకటే
అని,
ఇచ్చి
పుచ్చుకునే
ధోరణితో
ముందుకు
సాగాలని
కోరారు.


