Andhra Pradesh
oi-Korivi Jayakumar
రాష్ట్రంలో
ఇప్పుడు
పెద్ద
నేరస్తుడు
ఓ
ప్రత్యర్ధిగా
తయారయ్యాడు
అని
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ఫైర్
అయ్యారు.
బాబాయ్
హత్య
వ్యవహారంలో
వాస్తవాలను
పక్కదారి
పట్టించారని
మండిపడ్డారు.
ఈ
మేరకు
మీడియాతో
మాట్లాడుతూ
పలు
అంశాలపై
వ్యాఖ్యానించారు.
శ్రీవేంకటేశ్వర
స్వామి
దర్శనానికి
డిక్లరేషన్
కూడా
ఇవ్వని
వ్యక్తులు
మద్యం
బాటిళ్లను
తిరుమల
కొండపై
వేసి
అపవాదు
వేసే
ప్రయత్నం
చేస్తున్నారని
ఆరోపించారు.
అంతే
కాకుండా
ముఖ్యమంత్రి
ఎక్కడ
ఉంటే
అదే
రాజధాని
అని
మాజీ
సీఎం
జగన్
చేసిన
వ్యాఖ్యలపై
చంద్రబాబు
మండిపడ్డారు.
బుద్ధి
జ్ఞానం
ఉండే
వ్యక్తులు
ఇలాంటి
మాటలు
మాట్లాడరని
అన్నారు.
మొన్నటివరకు
మూడు
రాజధానులు
అన్నారని..
ఇప్పుడు
రాజ్యాంగంలో
ఎక్కడా
రాజధాని
పేరు
లేదని
అంటున్నారని
అన్నారు.
ముఖ్యమంత్రి
ఎక్కడ
కూర్చుంటే
అదే
రాజధాని
అంటే
ఇడుపులపాయ
రాజధాని
అవుతుందా?
బెంగుళూరులో
కూర్చుంటే
అదే
రాజధాని
అవుతుందా
అని
ప్రశ్నించారు.
విష
ప్రచారాలపై
ఫైర్..
అమరావతిని
దెబ్బతీసేందుకే
ఇలాంటి
విష
ప్రచారాలు
చేస్తున్నారని
చంద్రబాబు
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ఈ
చాదస్తం
ఏంటో
తనకు
అర్థం
కావడం
లేదని..
అమరావతి
నది
పక్కన
ఉందని
అంటున్నారన్నారు.
ఢిల్లీ,
లండన్,
చెన్నై,
ముంబై
ఎక్కడ
ఉన్నాయని
ప్రశ్నించారు.
కనీసం
ఇంగిత
జ్ఞానం
లేనివాళ్లు
ఇలా
మాట్లాడితే
ఏం
రాజకీయాలు
చేయాలని
చెప్పారు.
2027
మార్చిలోగా
పోలవరం
పూర్తి..
అలానే
గత
పాలకులు
వరదల్లో
ప్రాజెక్టులు
ముంచేసి
ధ్వంసం
చేశారని
సీఎం
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
2027
మార్చిలోగా
పోలవరం
పూర్తి
చేసి
జాతికి
అంకితం
చేస్తామని
తెలిపారు.
ఏటా
3
వేల
టీఎంసీల
నీళ్లు
సముద్రం
పాలవుతున్నాయని..
ఇందులో
200
టీఎంసీలు
వాడుకుంటే
వచ్చే
నష్టం
ఏమీ
లేదన్నారు.
ధవళేశ్వరం
బ్యారేజీ
కట్టిన
కాటన్
మహాశయుడ్ని
ఇప్పటికీ
ఆరాధిస్తున్నామని..
మన
దేశం
కాకపోయినా
మనకు
మంచిచేసిన
వారిని
గుర్తుంచుకోవటం
మన
సంప్రదాయం
అంటూ
చెప్పుకొచ్చారు.
పోలవరాన్ని
ఒక
యజ్ఞంగా
భావించి
ప్రాజెక్టును
పూర్తి
చేస్తున్నామని
అన్నారు
జగన్
ఏమన్నారంటే..?
అంతకు
ముందు
మాజీ
సీఎం
జగన్
మీడియా
సమావేశంలో
మాట్లాడుతూ..
రాజ్యాంగంలో
అసలు
రాజధాని
అనే
పదం
లేదని
అన్నారు.
ముఖ్యమంత్రి
ఎక్కడ
నుండి
పనిచేస్తే
అదే
రాజధాని
అని
తెలిపారు.
అమరావతి
నది
పక్కన
ఉందని
అందువల్ల
వరద
ముప్పు
ఉందని
వ్యాఖ్యానించారు.


