Andhra Pradesh
oi-Dr Veena Srinivas
సహజంగా
ఎవరైనా
ప్రమాదంలో
ఉంటే
ఏం
చేస్తాం..
సహాయం
చేయాలనే
విషయాన్ని
పక్కనపెట్టి,
ముందు
ఏమీ
అర్థం
కాక
అయోమయానికి
గురవుతాం..
టెన్షన్
పడిపోతాం.
సరిగ్గా
ఊహించని
ఉపద్రవం
వస్తే
సమయస్ఫూర్తితో
ఆలోచించాల్సిన
మనం,
ఆ
పని
చేయలేక
పోతాం.
ఫలితంగా
జరగకూడని
నష్టం
జరిగిపోతుంది.
ఒక్కోసారి
వివిధ
సందర్భాలలో
పెద్దవాళ్ళకే
సరిగ్గా
మైండ్
పని
చేయకపోతే,
ఇక
పిల్లల
పరిస్థితి
ఎలా
ఉంటుంది.
సమయస్పూర్తితో
వ్యవహరించిన
బుడతడు
అంత
నార్మల్
గా
ఉన్నప్పుడు,
అందరం
ప్లాన్డ్
గానే
పని
చేసుకుంటాం.
కానీ
ఏదో
తేడా
జరిగినప్పుడే
కదా
సమయానుకూలంగా
స్పందించాలి..
అటువంటి
స్పందన
ఒక
10
ఏళ్ల
బుడతడి
నుంచి
వస్తే
ఆ
బుడతడు
గురించి
ఖచ్చితంగా
చెప్పుకోవాల్సిందే..
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి
చెందిన
పదేళ్ల
వయసున్న
దీక్షిత్
అనే
బుడతడి
కథ
ఇది.
కరెంట్
షాక్
కు
గురైన
తల్లి
పశ్చిమగోదావరి
జిల్లా
భీమవరం
మండలం
జొన్నలగరువు
గ్రామంలో
ప్రభుత్వ
పాఠశాలలో
ఐదో
తరగతి
చదువుకుంటున్నాడు.
తాజాగా
పేరెంట్స్
టీచర్స్
మీటింగ్
నిర్వహించగా
దీక్షిత్
తల్లి
సమావేశానికి
వస్తానని
చెప్పి
రాలేదు.
దీంతో
స్కూల్
కి
దగ్గరలోనే
ఉన్న
దీక్షిత్
ఇంటికి
అమ్మని
తీసుకు
వస్తానని
చెప్పి
వెళ్ళాడు.
తీరా
అక్కడికి
వెళ్లేసరికి
తల్లి
విద్యుత్
షాక్
తో
కొట్టుమిట్టాడుతోంది.
కరెంట్
షాక్
నుండి
తల్లిని
కాపాడిన
తనయుడు
ఆ
పరిస్థితిని
చూసిన
దీక్షిత్
వెంటనే
సమయస్ఫూర్తితో
వ్యవహరించాడు.
తల్లి
విద్యుత్
షాక్
కు
కారణమైన
మోటార్
స్విచ్
ను
వేగంగా
ఆఫ్
చేశాడు.
అనంతరం
తల్లి
పై
పడిన
కరెంటు
తీగను
ఒక
కర్ర
సహాయంతో
పక్కకు
తొలగించి
తల్లి
ప్రాణాలను
కాపాడాడు.
ఆపై
వెంటనే,
ఇరుగుపొరుగు
వారిని
పిలిచి
తన
తల్లిని
తీసుకొని
సమీపంలోని
ఆసుపత్రికి
వెళ్ళాడు.
తల్లి
ప్రాణాలు
కాపాడిన
దీక్షిత్
ను
కొనియాడిన
టీచర్స్
ఆమెకు
ప్రథమ
చికిత్స
చేసిన
తర్వాత
తల్లి
కొడుకు
ఇద్దరు
పాఠశాలలో
జరిగిన
పేరెంట్స్
టీచర్స్
మీటింగ్
కు
వెళ్లారు.
అక్కడ
జరిగింది
చెప్పారు.
దీంతో
తల్లికి
కరెంటు
షాక్
కొడుతున్న
సమయంలో,
ఏమాత్రం
భయపడకుండా
సమయస్ఫూర్తితో
వ్యవహరించి
తల్లి
ప్రాణాలు
కాపాడిన
దీక్షిత్
ను
టీచర్లు
కొనియాడారు.
తల్లికి
పునర్జన్మనిచ్చిన
తనయుడు
అందరూ
దీక్షిత్
లా
సమయస్ఫూర్తితో
ఉండాలని,
సమస్య
వచ్చినప్పుడు
భయపడకుండా,
తెలివిగా
ఆలోచించాలని
టీచర్లు
విద్యార్థులకు
చెప్పారు.
ఇక
ఈ
విషయం
తెలిసిన
స్థానికులు
తల్లికి
పునర్జన్మను
ఇచ్చిన
తనయుడు
అంటూ
దీక్షిత్
ను
కొనియాడుతున్నారు.


