India
oi-Chandrasekhar Rao
కర్ణాటకలో
ఘోర
రోడ్డు
ప్రమాదం
సంభవించింది.
ఈ
ఘటనలో
17
మందికి
ప్రయాణికులు
సజీవదహనం
అయ్యారు.
పలువురికి
తీవ్ర
గాయాలయ్యాయి.
సమాచారం
అందిన
వెంటనే
పోలీసులు,
అగ్నిమాపక
సిబ్బంది
హుటాహుటిన
సంఘటన
స్థలానికి
చేరుకున్నారు.
సహాయక
చర్యలను
చేపట్టారు.
ఈ
ఘటనపై
కేసు
నమోదు
చేశారు.
సీబర్డ్
ట్రావెల్స్
కు
చెందిన
ఈ
స్లీపర్
కోచ్
బస్సు
అది.
30
మంది
ప్రయాణికులతో
బుధవారం
8:25
గంటలకు
బెంగళూరులోని
గాంధీనగర్
నుంచి
గోకర్ణకు
బస్సు
బయలుదేరింది.
బస్సులో
ఉన్న
ప్రయాణికుల్లో
25
మంది
గోకర్ణ,
ఇద్దరు
శివమొగ్గ,
ఇద్దరు
కుమటాకు
చేరుకోవాల్సి
ఉంది.
వేకువజామున
సుమారు
2:45
నిమిషాల
ప్రాంతంలో
చిత్రదుర్గ
జిల్లాలో
ప్రమాదానికి
గురైంది.
జాతీయ
రహదారి
48పై
హిరియూర్
సమీపంలోని
జవనగొండనహళ్లి-గోరట్లు
క్రాస్
వద్ద
అదుపు
తప్పింది.
ఓ
భారీ
కంటైనర్
ను
అతివేగంగా
ఢీ
కొట్టింది.
ఆ
వెంటనే
బస్సులో
మంటలు
చెలరేగాయి.
ఈ
ఢీకొన్న
తీవ్రతకు
క్షణాల్లోనే
మంటలు
చెలరేగి
బస్సు
మొత్తం
వ్యాపించాయి.
కనీసం
తప్పించుకునే
అవకాశం
కూడా
లేకపోయింది.
కంటైనర్
సైతం
మంటలబారిన
పడింది.
ఈ
ఘటనలో
17
మంది
ప్రయాణికులు
సజీవదహనం
అయ్యారు.
పలువురు
తీవ్రంగా
గాయపడ్డారు.
ప్రమాద
సమయంలో
చాలామంది
ప్రయాణికులు
నిద్రలో
ఉండటంతో
బయటపడే
అవకాశమే
వారికి
లభించలేదు.
అకస్మాత్తుగా
చెలరేగిన
మంటల
నుండి
10
మంది
కాలిన
గాయాలతో
కిటికీ
అద్దాలను
పగులగొట్టి
బయటికి
రాగలిగారు.
మంటల
ఉధృతికి
బస్సులోని
17
మందికి
పైగా
ప్రయాణికులు
కాలి
బూడిదయ్యారు.
మృతుల
సంఖ్య
మరింత
పెరిగే
అవకాశం
ఉందని
అధికారులు
తెలియజేశారు.
సమాచారం
అందిన
వెంటనే
చిత్రదుర్గ
జిల్లా
పోలీసులు,
అగ్నిమాపక
దళం
సిబ్బంది
వేగంగా
ఘటనా
స్థలానికి
చేరుకున్నారు.
మంటలను
అదుపులోకి
తీసుకురావడానికి,
సహాయక
చర్యలు
చేపట్టడానికి
తీవ్రంగా
శ్రమించారు.
గాయపడిన
ప్రయాణికులను
తక్షణమే
అంబులెన్స్‌ల
సాయంతో
చిత్రదుర్గ
జిల్లా
ఆసుపత్రికి
తరలించి,
అత్యవసర
వైద్య
సేవలు
అందిస్తున్నారు.
ప్రస్తుతం
సహాయక
చర్యలు
పూర్తి
స్థాయిలో
కొనసాగుతున్నాయి.
ఈ
దుర్ఘటన
కారణంగా
జాతీయ
రహదారి
48పై
జవనగొండనహళ్లి
వద్ద
తీవ్ర
ట్రాఫిక్
అంతరాయం
ఏర్పడింది.
శిరా
మరియు
హిరియూర్
మధ్య
సుమారు
20
కిలోమీటర్ల
మేర
వాహనాల
రాకపోకలు
స్తంభించాయి.
దీనితో
సహాయక
బృందాలు
సంఘటనా
స్థలానికి
చేరుకోవడంలో
జాప్యం
జరిగింది.
పోలీసులు
కేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తు
ప్రారంభించారు.
ప్రమాద
సమాచారం
అందిన
వెంటనే
జిల్లా
పోలీస్
సూపరింటెండెంట్
రంజిత్
సంఘటనా
స్థలాన్ని
సందర్శించి
పరిశీలించారు.
హిరియూర్
రూరల్
పోలీస్
స్టేషన్‌లో
కేసు
నమోదైంది.
పోలీసులు
పూర్తి
వివరాలను
సేకరించి,
దర్యాప్తు
కొనసాగిస్తున్నారు.


