Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రాష్ట్రంలో
రోడ్డు
ప్రమాదాల
కట్టడి
కోసం
ట్రాఫిక్
పోలీసులు
బాగా
కష్టపడుతున్నారు.
రోడ్డు
ప్రమాదాల
నివారణ
కోసం
ట్రాఫిక్
రూల్స్
పాటించాలని,
హెల్మెట్
ధరించాలని
ప్రజలకు
అవగాహన
కలిగించడానికి
అనేక
కార్యక్రమాలు
చేపడుతున్నారు.
హెల్మెట్
పెట్టుకోవడం,
కార్లు
నడిపే
వారు
సీట్
బెల్ట్
ధరించడం
వంటి
చర్యలను
తీసుకోవాలని
పదేపదే
సూచిస్తున్నారు.
హెల్మెట్
నిబంధనపై
సంచలన
నిర్ణయం
తీసుకున్న
కలెక్టర్
ట్రాఫిక్
నిబంధనలను
పాటించాలని,
హెల్మెట్
పెట్టుకోవాలని
ఎన్ని
సార్లు
చెప్పినా
ప్రజల
వ్యవహారశైలి
లో
మాత్రం
ఆశించిన
మార్పు
రావడం
లేదు.
దీంతో
కాస్త
కఠినంగా
ప్రజలలో
మార్పు
తీసుకురావాలని
భావించిన
రాజన్న
సిరిసిల్ల
జిల్లా
కలెక్టర్
కీలక
నిర్ణయం
తీసుకున్నారు.
రాజన్న
సిరిసిల్ల
జిల్లా
కలెక్టర్
గరిమ
అగర్వాల్
రాజన్న
సిరిసిల్ల
జిల్లాలో
ప్రమాదాలను
నివారించడానికి,
మరణాలను
తగ్గించడానికి
కచ్చితంగా
ప్రతి
ఒక్కరు
హెల్మెట్
పెట్టుకోవాలని
సూచించారు.
అన్ని
పెట్రోల్
బంకులలోను
నో
హెల్మెట్
నో
పెట్రోల్
రూల్
ఇక
హెల్మెట్
ధరించని
వారికి,
పెట్రోల్
బంకులో
పెట్రోల్
పోయవద్దని
ఆదేశించారు.
హెల్మెట్
లేకపోతే
పెట్రోల్
లేదు
అనే
కఠిన
నిబంధనలను
అమలు
చేస్తున్నారు.
కలెక్టర్
గారి
ఆదేశాల
మేరకు
అధికారులు
ఈ
కఠిన
చర్యలు
దిశగా
అడుగులు
వేస్తున్నారు.
జిల్లాలో
ఉన్న
అన్ని
పెట్రోల్
బంకుల
లోను
నో
హెల్మెట్
నో
పెట్రోల్
రూల్
ను
కచ్చితంగా
అమలు
చేస్తున్నారు.
తరచూ
పెట్రోల్
బంకుల
తనిఖీలు
హెల్మెట్
ధరించని
ద్విచక్ర
వాహనదారులకు
పెట్రోల్
పోయకూడదని
స్పష్టమైన
ఆదేశాలు
జారీ
చేయడంతో
వారు
కూడా
ప్రజలందరి
సంక్షేమాన్ని
దృష్టిలో
పెట్టుకొని
జిల్లా
కలెక్టర్
నిర్ణయానికి
సహకరిస్తున్నారు.
హెల్మెట్
ధారణ
ఈ
నిర్ణయం
వల్ల
తప్పనిసరి
అవుతుందని,
పెట్రోల్
కోసమైనా
ప్రజలు
హెల్మెట్
పెట్టుకుంటారని
భావిస్తున్నారు.
అలాగే
పెట్రోల్
బంకుల
యజమానులు
ఈ
నిబంధనను
ఏ
విధంగా
పాటిస్తున్నారో
తెలుసుకోవడానికి
పెట్రోల్
బంకులను
తరచూ
తనిఖీలు
చేస్తున్నారు.
ప్రమాదాల
నివారణ
కోసం
చర్యలు
ఇక
ఇప్పటికే
జిల్లాలో
ప్రమాదాల
నివారణ
కోసం
చర్యలు
తీసుకుంటున్న
జిల్లా
యంత్రాంగం,
ముఖ్యంగా
జిల్లా
కలెక్టర్
గరిమ
అగర్వాల్
ప్రమాదాలు
జరిగే
ప్రాంతాలను
గుర్తించి
వాటిని
మెరుగుపరచాలని
ఆదేశించారు.
రోడ్డు
భద్రతా
కార్యక్రమాలను
తరచూ
నిర్వహించడంతోపాటు,
రోడ్ల
మౌలిక
సదుపాయాలను
మెరుగుపరచడం
పైన
కూడా
దృష్టి
పెట్టారు.
సరైన
సూచిక
బోర్డులను
ఏర్పాటు
చేసి
పనులను
కూడా
వేగవంతం
చేశారు.
హెల్మెట్
పై
కొత్త
రూల్
సక్సెస్
అయితే
రాష్ట్ర
వ్యాప్తంగా
అమలుకు
ఛాన్స్
డ్రంక్
అండ్
డ్రైవ్
చేసే
వారి
పైన
కఠిన
చర్యలకు
ఆదేశించారు.
ఇక
హెల్మెట్
ధరించడానికి
ప్రజలకు
అలవాటుగా
మార్చడం
కోసం
నో
హెల్మెట్
నో
పెట్రోల్
నిబంధనను
తీసుకువచ్చి
అమలు
చేస్తున్నారు.
ఇక
ఈ
విధానం
ఈ
జిల్లాలో
సక్సెస్
అయితే,
రాష్ట్రవ్యాప్తంగా
అన్ని
జిల్లాల్లో
కూడా
ఇదే
విధానాన్ని
అవలంబించే
అవకాశం
ఉంది.


