Andhra Pradesh
oi-Dr Veena Srinivas
తెలుగుదేశం
పార్టీ
వ్యవస్థాపక
అధ్యక్షుడు,
ఉమ్మడి
రాష్ట్ర
మాజీ
ముఖ్యమంత్రి
నందమూరి
తారకరామారావు
30వ
వర్ధంతి
నేడు.
ఈ
క్రమంలో
రెండు
తెలుగు
రాష్ట్రాలలో
నందమూరి
తారకరామారావు
అభిమానులు,
రాజకీయ
ప్రముఖులు
ఆయనకు
నివాళులు
అర్పిస్తున్నారు.
ఆయన
చేసిన
సేవలను
గుర్తు
చేసుకుంటున్నారు.
నందమూరి
తారక
రామారావు
గారి
30వ
వర్ధంతి:
సీఎం
చంద్రబాబు
పోస్ట్
తెలుగుదేశం
పార్టీ
వ్యవస్థాపక
అధ్యక్షుడు
ఎన్టీఆర్
సేవలను
ఏపీ
సీఎం
చంద్రబాబు
నాయుడు
నేడు
గుర్తు
చేసుకున్నారు.
ఈ
మేరకు
ఆయన
సోషల్
మీడియా
వేదికగా
ఒక
పోస్ట్
చేశారు.
కారణజన్ముడు,
యుగ
పురుషుడు,
పేదల
పెన్నిధి,
‘అన్న’
నందమూరి
తారక
రామారావు
గారి
30వ
వర్ధంతి
సందర్భంగా
ఆ
మహనీయుడికి
ఘన
నివాళి
అర్పిస్తున్నాను
అంటూ
పేర్కొన్నారు.
తెలుగువారి
ఆత్మ
గౌరవాన్ని
ఆకాశం
అంత
ఎత్తులో
ఉంచిన
ఎన్టీఆర్
సినీ
వినీలాకాశంలో
ధృవతారగా
వెలిగి,
రాజకీయ
కురుక్షేత్రంలో
అజేయుడైన
‘అన్న’
ఎన్టీఆర్
తరతరాల
చరిత్రను
తిరగరాసిన
ధీరోదాత్తుడు
అని
చంద్రబాబు
ఎన్టీఆర్ను
కొనియాడారు.
తెలుగు
వారి
ఆత్మగౌరవాన్ని
ఆకాశమంత
ఎత్తులో
నిలబెట్టేందుకు
పోరాటం
చేసిన
ఆయన
మనందరికీ
ప్రాతఃస్మరణీయుడు
అన్నారు.
సంక్షేమ
అభివృద్ధి
పథకాలతో
చరిత్ర
గతిని
మార్చిన
మహనీయుడు
ఎన్టీఆర్
ఎన్టీఆర్
హయాంలోనే
కిలో
రెండు
రూపాయల
బియ్యం,
సామాజిక
భద్రతా
పింఛన్లు,
పక్కా
ఇళ్ల
నిర్మాణం
సాధ్యమయ్యాయి
అని,
రైతుకు
విద్యుత్,
మండల
వ్యవస్థతో
స్థానిక
స్వపరిపాలన,
ఆడబిడ్డలకు
ఆస్తిలో
హక్కు,
రాయలసీమకు
సాగు,
తాగునీటి
ప్రాజెక్టులు
లాంటి
అనితరసాధ్యమైన
సంక్షేమ
అభివృద్ధి
పథకాలతో
చరిత్ర
గతిని
మార్చిన
ఆ
మహనీయుడు
ఎన్టీఆర్
అని,
ఆయన
మనకు
ఆదర్శం
అన్నారు.
ఎన్టీఆర్
ఘాట్
వద్ద
నివాళులు
అర్పించిన
లోకేష్
ఆయన
వేసిన
బాట
అనుసరణీయం.
మరొక్కమారు
ఆయనకు
స్మృత్యంజలి
ఘటిస్తున్నానని
సీఎం
చంద్రబాబు
పేర్కొన్నారు.
మరోవైపు
ఎన్టీఆర్
30వ
వర్ధంతి
సందర్భంగా
హైదరాబాద్లోని
ఎన్టీఆర్
ఘాట్
వద్ద
ఏపీ
మంత్రి
నారా
లోకేష్
నివాళులు
అర్పించారు.
ఈ
మేరకు
ఆయన
సోషల్
మీడియాలో
పోస్ట్
పెట్టారు.
తెలుగు
జాతి
ఆత్మగౌరవ
పతాకం,
విశ్వవిఖ్యాత
నటసార్వభౌముడు,
మహా
నాయకుడు
ఎన్టీఆర్
గారి
వర్ధంతి
సందర్భంగా
ఘన
నివాళులు
అర్పిస్తున్నాను
అంటూ
పేర్కొన్నారు.
ప్రజలు
దేవుడిలా
పూజించటం
ఎన్టీఆర్
కు
దక్కిన
అరుదైన
వరం:
మంత్రి
లోకేష్
తారక
రాముడు
పోషించిన
పౌరాణిక
పాత్రల
ఫోటోలను
ఇళ్లలో
పెట్టుకొని
ప్రజలు
దేవుడిగా
పూజిస్తుండడం
ఎన్టీఆర్
గారికి
మాత్రమే
దక్కిన
అరుదైన
వరం
అని
లోకేష్
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
మీరు
భౌతికంగా
దూరమై
ఇన్నేళ్లయినా,
తెలుగువారి
హృదయాల్లో
సజీవంగా
ఉన్న
తాతయ్యా..
మీ
జన్మ
ధన్యమయ్యా
అంటూ
లోకేష్
తాత
ఘన
కీర్తిని
గుర్తు
చేసుకున్నారు.
ప్రజలే
దేవుళ్లని
నినదించిన
ఎన్టీఆర్
సమాజమే
దేవాలయం
–
ప్రజలే
దేవుళ్లని
నినదించిన
మహోన్నత
వ్యక్తి
విశ్వవిఖ్యాత
నటసార్వభౌమ
స్వర్గీయ
నందమూరి
తారక
రామారావు
అని
పేర్కొని,
ఆయన
చూపించిన
మార్గం
అనుసరణీయం
అన్నారు.
ఇక
రాష్ట్ర
వ్యాప్తంగా
మంత్రులు,
ఎమ్మెల్యేలు,
అభిమానులు
ఆయనను
గుర్తు
చేసుకుని
నివాళులు
అర్పిస్తున్నారు.


