కుక్క కాటుకు సుప్రీం దెబ్బ.. నష్ట పరిహారం చెల్లించాల్సిందే

Date:


India

oi-Lingareddy Gajjala

దేశవ్యాప్తంగా
పెరుగుతున్న
వీధి
కుక్కల
కాటు
ఘటనలు,
మరణాలపై
సుప్రీం
కోర్టు
మరోసారి
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
చేసింది.

అంశంపై
నేడు
జరిగిన
విచారణలో
జస్టిస్‌లు
విక్రమ్
నాథ్,
సందీప్
మెహతా,
ఎన్.వి.
అంజారీలతో
కూడిన
ధర్మాసనం
కీలక
వ్యాఖ్యలు
చేసింది.
కుక్క
కాటును
నివారించడంలో
రాష్ట్ర
ప్రభుత్వాలు,
స్థానిక
సంస్థలు,
పౌరుల
పాత్ర
ఏమిటన్నదానిపై
కోర్టు
విస్తృతంగా
చర్చించింది.

గత
విచారణలో
(జనవరి
8న)
వీధి
కుక్కల
నియంత్రణకు
సంబంధించిన
ఏబీసీ
(Animal
Birth
Control)
నిబంధనల
అమలులో
తీవ్ర
లోపాలు
ఉన్నాయని
ధర్మాసనం
స్పష్టంగా
పేర్కొంది.

సందర్భంగా
డాగ్
లవర్స్‌,
జంతు
కార్యకర్తలు
వాస్తవ
పరిస్థితులకు
దూరంగా
వాదనలు
చేస్తున్నారని
సుప్రీం
కోర్టు
తీవ్రంగా
విమర్శించింది.
నటి
షర్మిలా
ఠాగూర్
తరఫున
వాదనలు
వినిపించిన
న్యాయవాదిపై
కూడా
ధర్మాసనం
అసంతృప్తి
వ్యక్తం
చేసింది.
“కుక్కలు
దాడి
చేసే
ముందు
మనుషుల్లోని
భయాన్ని
గుర్తిస్తాయి”
అన్న
కోర్టు
వ్యాఖ్య
అప్పట్లో
దేశవ్యాప్తంగా
వైరల్‌గా
మారింది.


కోర్టు
అలా
చెప్పలేదే..

అయితే,
అన్ని
వీధి
కుక్కలను
పూర్తిగా
తొలగించాలని
కోర్టు
ఎక్కడా
ఆదేశించలేదని,
ఏబీసీ
నిబంధనల
ప్రకారం
స్టెరిలైజేషన్,
వైద్య
చికిత్స
తప్పనిసరిగా
అమలు
చేయాలన్నదే
కోర్టు
ఉద్దేశం
అని
సీనియర్
న్యాయవాది
అభిషేక్
మను
సింఘ్వీ
స్పష్టం
చేశారు.
జంతు
కార్యకర్తలు,
డాగ్
లవర్స్
తరఫున
డొమైన్
నిపుణులను

సమస్య
పరిష్కార
ప్రక్రియలో
భాగస్వాములుగా
చేర్చాలని
ఆయన
కోర్టును
కోరారు.


నేపథ్యంలో
నవంబర్
7,
2025న
సుప్రీం
కోర్టు
జారీ
చేసిన
కీలక
ఆదేశాలను
మరోసారి
గుర్తు
చేసింది.
విద్యాసంస్థలు,
ఆసుపత్రులు,
క్రీడా
మైదానాలు,
రైల్వే
స్టేషన్లు,
బస్
స్టాండ్ల
పరిసర
ప్రాంతాల
నుంచి
వీధి
కుక్కలను
పట్టుకుని
స్టెరిలైజేషన్
చేసి
శాశ్వతంగా
తొలగించాలని,
అలాగే
రహదారులపై
తిరుగుతున్న
వీధి
పశువులను
కూడా
తొలగించాలని
కోర్టు
ఆదేశించింది.


ప్రమాదకర
పరిస్థితి

ప్రస్తుత
చట్టాలు,
నిబంధనలు

సమస్యను
సమర్థవంతంగా
ఎదుర్కోలేకపోతున్నాయని
ఒక
న్యాయవాది
వాదించారు.
“ప్రమాదకర
పరిస్థితి
నెలకొంటే,
ఆర్టికల్
32,
142ల
కింద
ఆదేశాలు
జారీ
చేసే
అధికారం

కోర్టుకు
ఉంది.
కుక్క
కాటు
సమస్యకు
సంబంధించి
స్పష్టమైన
చట్టపరమైన
శూన్యత
ఉంది.
ప్రస్తుత
నిబంధనలు
పనిచేయకపోతే,
అది
సంపూర్ణ
వైఫల్యమే”
అని
ఆయన
పేర్కొన్నారు.


సందర్భంగా
కుక్క
కాటుకు
గురైన

బాధిత
మహిళ
కోర్టులో
భావోద్వేగంగా
తన
అనుభవాన్ని
వెల్లడించారు.
“నన్ను
ఒక
వీధి
కుక్క
దాడి
చేసింది.
నేను
దానిని
రెచ్చగొట్టలేదు.
కానీ
అది
ఎందుకు
కరిచిందో
అర్థం
కాలేదు.

కుక్కను
గతంలో
రాళ్లతో
కొట్టారని
తెలిసింది.
అందుకే
మనుషులను
చూసిన
వెంటనే
భయంతో
దాడి
చేసేది”
అని
ఆమె
వివరించారు.
కుక్కల
పట్ల
కరుణ
చూపాలని
కూడా
ఆమె
కోర్టును
కోరారు.


జీవిత
కాల
ప్రభావం..


వాదనలు
విన్న
అనంతరం
ధర్మాసనం
డాగ్
ఫీడర్లపై
తీవ్ర
వ్యాఖ్యలు
చేసింది.
“కుక్కలపై
ప్రేమ
ఉంటే
వాటిని
మీ
ఇంట్లో
ఉంచుకోండి.
అవి
ఎందుకు
వీధుల్లో
తిరుగుతూ
ప్రజలను
కరుస్తూ,
వెంటపడుతూ
ఉండాలి?
కుక్క
కాటు
ప్రభావం
బాధితులపై
జీవితకాలం
ఉంటుంది”
అంటూ
కోర్టు
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
కుక్క
కాటు
ఘటనలు,
మరణాలు
సంభవిస్తే
డాగ్
ఫీడర్లు
కూడా
బాధ్యత
వహించాల్సి
ఉంటుందని
స్పష్టం
చేసింది.

డాగ్
ఫీడర్లు
దాఖలు
చేసిన
పిటిషన్‌ను
ధర్మాసనం
తిరస్కరిస్తూ,
ఇది
లా
అండ్
ఆర్డర్‌కు
సంబంధించిన
అంశమని
పేర్కొంది.
బాధితులు
అవసరమైతే
హైకోర్టులను
ఆశ్రయించి
ఎఫ్‌ఐఆర్‌లు
నమోదు
చేయాలని
సూచించింది.
కోర్టు
ఉత్తర్వులు
ఎవరి
పట్లనూ
వేధింపులకు
లైసెన్స్
కాదని
కూడా
స్పష్టం
చేసింది.


ప్రభుత్వాల
వైఫల్యం
వల్లే..

కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలపై
సుప్రీంకోర్టు
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
ఏబీసీ
నిబంధనలను
తీవ్రంగా
అమలు
చేయడంలో
ప్రభుత్వాలు
పూర్తిగా
విఫలమయ్యాయని
పేర్కొంది.
“1950ల
నుంచే
పార్లమెంట్

అంశంపై
దృష్టి
సారిస్తోంది.
అయినా
ప్రభుత్వాల
వైఫల్యం
వల్లే
సమస్య
వెయ్యి
రెట్లు
పెరిగింది.
ఇది
సంపూర్ణ
పరిపాలనా
వైఫల్యం”
అంటూ
ధర్మాసనం
మండిపడింది.
వీధి
కుక్కల
కాటుతో
ప్రాణాలు
కోల్పోయిన
ప్రతి
వ్యక్తి
విషయంలో
ప్రభుత్వాలపై
భారీ
నష్టపరిహారం
విధిస్తామని
కోర్టు
హెచ్చరించింది.

జంతు
కార్యకర్తలు,
కుక్కల
ప్రేమికుల
తరఫు
న్యాయవాదులను
ఉద్దేశిస్తూ,
“ప్రేమ
కేవలం
కుక్కల
పట్ల
మాత్రమే
ఉన్నట్లుగా
కనిపిస్తోంది.
మానవుల
పట్ల
కూడా
భావోద్వేగ
అనుబంధం
ఉండాలి.

వాదనలు
చాలా
ఉన్నత
వర్గానికి
చెందిన
ఆలోచనలాగా
అనిపిస్తున్నాయి”
అని
ధర్మాసనం
వ్యాఖ్యానించింది.
దీనికి
ప్రతిస్పందనగా
న్యాయవాది
మేనకా
గురుస్వామి,
ఏబీసీ
నిబంధనలు
పార్లమెంట్
ఆలోచనలకు
ప్రతిబింబమేనని
కోర్టుకు
వివరించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related