కుప్పకూలిన తేలికపాటి విమానం- ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు

Date:


India

oi-Chandrasekhar Rao

జార్ఖండ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. ఛత్రా జిల్లా సిమారియా సమీపంలో ఈ ఘటన సంభవించింది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన తేలికపాటి విమానం అది. ఓ రోగిని మెరుగైన వైద్య చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. రాంచీ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 7:11 నిమిషాలకు టేకాఫ్ అయింది. ఆ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.

ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురూ ఈ ప్రమాదంలో మరణించినట్లు ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఎయిర్ అంబులెన్స్ రాడార్ నుంచి అదృశ్యమైంది. సిమారియాలోని బరియాతు పంచాయతీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు వెలికితీసినట్లు ఎస్‌డీపీవో శుభం ఖండేల్‌వాల్పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా గుర్తించారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Brenda Song on Alaska Airlines Flight Issue With Macaulay Culkin, Kids

Brenda Song Shares How 'Home Alone' Inspired Safety...

Liam and Noel Gallagher celebrate Manchester City’s Carabao Cup success together

Liam and Noel Gallagher celebrated Manchester City’s Carabao Cup victory together...

Wet Leg Performs ‘Moisturizer’ Tracks on ‘SNL UK’ Premiere Episode

Live from London, it’s Saturday Night Live! The iconic sketch...