కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా – కొత్త లెక్కలు..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేదెవరు. త్వరలో రాజ్యసభలో ఏపీ నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది. ఈ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు స్థానాల పైన కూటమిలోని మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ స్థానాలను పంచుకోనుంది. ఈ మూడు పార్టీల అభ్యర్ధుల పైన స్పష్టత వస్తోంది. అయితే, జనసేన నుంచి రాజ్యసభకు ఎవరనేది పవన్ ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. అనూహ్య ఎంపిక ఉంటుందని చెబుతున్నారు.

రాజ్యసభలో నలుగురు సభ్యులు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే నెల ఈ ఖాళీల కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టిడిపి సభ్యుడు సానా సతీష్ సైతం ఖాళీ కానున్నారు. వీరిలో సానా సతీశ్ కు తిరిగి పదవి రెన్యువల్ కానుంది. మిగిలిన మూడు స్థానాలు కూటమిలోని మూడు పార్టీల నంచి ఎంపిక కానున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే అభ్యర్దిగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఒకటి సానా సతీశ్ కు రెన్యువల్ చేయనుండటంతో.. రెండో స్థానం కోసం పలువురు పోటీలో ఉన్నారు. అయితే, ఎస్సీ లేదా బీసీ నేతకు ఈ సీటు కేటాయిస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా పొలిట్ బ్యూరోలో ఉన్న ఇద్దరు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదే సమయంలో ఒక ప్రముఖ ఫార్మా సంస్థ అధినేత పేరు రేసులో ఉంది. ప్రాంతీయ – సామాజిక లెక్కల ఆధారంగా వీరి విషయంలో టీడీపీ రెండో అభ్యర్ధి విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది.

పవన్ కల్యాణ్ అనూహ్య ఎంపిక

ఇక, ఒక పదవి జనసేనకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జనసేన రాజ్యసభ పదవులను కోరుకోలేదు. జనసేన నుంచి తొలుత మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రచారం లోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అనకాపల్లి సీటు బీజేపీకి దక్కటంతో రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అవకాశం ఇస్తారనే చర్చ సాగింది. కాగా. సమీకరణల దృష్ట్యా నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసు కుంటామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. అందులో భాగంగా గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా మాత్రం ఇంతవరకు అవకాశం రాలేదు. దీంతో, తాజాగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన పవన్తో పాటుగా చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరుంది. ఇదే సమయంలో తాజాగా అల్లు అరవింద్ ను జనసేన నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే.. సామాజిక లెక్కలు కీలకంగా మారటంతో.. చివరికి పవన్ ఈ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related